MENU

News

Procurement of Manuscript

वेदविचारसरणि
वेदविचारसरणिः     Veda-vicaara-sarani

Diploma in Hindu Dharma


वेदविचारसरणिः
Veda-vicaara-sarani

1       2      

Q101. Sir, please provide answers for the following quation. Who(provide names) are the 'Ratha Sarathis (or) Ratha Sarathees" for Bhishma Pitamaha, Dhronacharya, Karna, Sukracharya in mahabharatha(Kurukshetra War) war. - Thanking you, S.Ravi Kumar, Tirupati.

QAnswer: The Charioteers (Ratha Sarathis) of Bhishma, Drona and Karna were constantly changing whenever the earlier was Sarathi was killed by Pandavas. So their names were not mentioned. But on the Day of the Death of Karna the king of Madra Desa - SALYA -was the charioteer (Sarathi) for Karna. Strangely you asked about the charioteer of Sukracharya in the list. Is there any evidence for the participation of Sukraacharya in the Mahabharata War?

Svasti

- Dr. Rani Sadasiva Murthy, Associate Professor, R.S. Vidyapeetha, Tirupati


Q102. Gurubhyo Namaha! SRI VENKATESAYA NAMAHA! Respected Sir, Firstly I want to Thank you People for providing this Great opportunity of Sharing views about veda related Matters and trying to Emphasize knowledge and to clear Doubts which are usually occur in our Daily Life. I Have some Doubts Regarding two Aspects

1.I want to Know about Dusshera Festival 10 days in detail (i.e.,Puja Vidanam , Ammavari Avatharam , Nivedyam etc.,)

2.I Want to Know about kadamba vruksham in Regular Telugu Language and its Importance

I must be Very Thankful to you sir

- Palaparthi Aparna, Anantapur

Answer: Navaratrti is the Nine Day festival of Goddess Parameswari as a mark of her victory over the Demons, This Navaratri Festival is celebrated during the first nine days beginning with PRATIPAT or PADYAMA of the Bright fortnight of Aswiyuja Masa of Sarad Rtu. Hence these nine days are called "DEVI SARANNAVARATRI" Celebrations. During these days Kalasa sthapana is done and Devi is worshiped in different forms like Jagadamba, Balambika, Parvati, Gayatri, Annapurna, Mahalakshmi,Maha Saraswathi, Durga, Mahishasura Mardini and Sri Raja Rajeswari. Some Sadhakas Perform Srichakra Navavarana Puja during these days.

The tenth day is popularly known as VIJAYA DASAMI. This Vijaya Dasami Day is also called DUSSHERA. DUSSHERA is the Tenth Day festival and not the name of all the TEN DAYS.

2. KADAMBA vrksha is translated as KADIMI CHETTU in Telugu. The flowers of this tree are like Wool Balls in appearance. These trees are abundantly seen in the Guwahati of Assam and the flowers of this tree are used in the worship of Devi Kamakhya Temple of Guwahati.

Mother goddess is often praised as Kadamba Vanavasini. In fact that Divine Kadamba Trees described in Lalithopakhyana are not this ordinary Kadamba or Kadimi Trees.

- Dr. Rani Sadasiva Murthy, Associate Professor, R.S. Vidyapeetha, Tirupati


Q103. అయ్యా నమస్కారములు! కృపాచార్యుడు "ఆచార్యుడు" వరుసక్రమమందుకూడా "భీష్మ,ద్రోణ,కృపాచార్యులు" అని అంటారుకదా మరి సుయోధనుడు కృపాచార్యునికి సర్వసైన్యాధిపత్యం ఎందుకివ్వలేదు. భారతంలో "కృపపర్వం" లేకపోవడానికి కల కారణములు తెలుసుకోవాలన్నజిజ్ఞాసతో అడుగుతున్నాను . నన్ననుగ్రహించగలరు

Answer: కురు - పాండవ యుద్ధారంభనుంచి యుద్ధాంతం వరకూ గల సేనాధిపతులెవరో వారిపేరుమీదనే ఆ పర్వలకు పేర్లు పెట్టారు వేదవ్యాసమహర్ష్గి అని అనిపిస్తుంది మనకు. అయితే ఎవరి పేర్లమీద ఈ పర్వలకు ఆ యా పేర్లు పెట్టారో వారంతా ఆ యా పర్వల చివరిలో పాండవులచేతిలో నేలకొరిగారు. అందుచేతనే భీష్ముడు పతనమయిన పర్వ భీష్మపర్వ, ద్రోణుడు నేలకొరిగిన పర్వ ద్రోణపర్వ, కర్ణుడు మరణించిన పర్వ కర్ణపర్వ, శల్యుడు మరణించిన పర్వ శల్యపర్వ ఏర్పడ్డాయి. ఆ తరువాత విషయం చూడండి. శల్యుని తరువాత అశ్వత్థామను దుర్యోధనుడు కురుసేనానిగా అభిషిక్తుణ్ణి చేశాడు. మీ ఊహ ప్రకారం అశ్వత్థామ పర్వ అని ఒక పర్వ ఉండాలి. ఉన్నదా? లేదు. అందుకు బదులుగా సౌప్తికపర్వ అని ఒక పర్వ ఉన్నది. సౌప్తికపర్వలో నిదురిస్తున్న ఉపపాండవులను పాండవులుగా భ్రమించి అశ్వత్థామ అంతంచేశాడు. కనుక దానికి సౌప్తికపర్వ అని పేరు వచ్చింది.

ఇక రెండవ విషయం, మీరు చెప్పినట్లు "భీష్మ -ద్రోణ - కృపాచార్యులు" అని మనకు సంస్కృతభారతంలో కాని ఆంధ్రమహాభారతంలోకాని ప్రయోగం మనకు ముగ్గురిని ఆచార్యులనే అర్థంలో ఎక్కడా ప్రయోగించలేదు. భీష్ముడు కౌరవపాండవులకు పితామహుడే కాని ఆచార్యుడు కాడు. వారికి తొలి ఆచార్యుడు కృపుడు. కృపుని తరువాత అంతకన్న అధికమైన విద్యారహస్యాలను నేర్పిన వాడు ద్రోణుడు. కనుక మీరు భావించినట్లుగా వారి ఆచార్యత్వమును బట్టి పర్వలకు వ్యాసులవారు పేర్లను పెట్టలేదు అన్నవిషయం విశదమే కదా?!?

స్వస్తి!

- Dr. Rani Sadasiva Murthy, Associate Professor, R.S. Vidyapeetha, Tirupati


Q104. chudaakarma samskaramunandu homamulu unnava avi ekkada cheppabaddai dayachesi telupagalaru.

Answer: చూడాకర్మయందు “ధాతాదధాతునః” ఇత్యాది నాలుగుమంత్రములు, “యస్త్వాహృదా కీరిణా” ఇత్యాది నాలుగు మంత్రములు కలిపి ఎనిమిది హోమమంత్రములు. ఆపస్తంబగృహ్యసూత్రమందుగల షోడశఖడములో “సీమన్తవదగ్నేరుపసమాధానాది” అనే అతిదేశసూత్రముచేత సీమన్తోన్నయనము వలే పూర్వేద్యుః నాన్దీశ్రాద్ధాది, “ధాతాదధాతున” హోమములు చూడాకర్మయందు విహితములే.

- Sri G.V. Phaniraja Shastri, Asst.Professor, S.V.V.U.

Q105. ఇంటిలో పూజలో కొబ్బరి కాయ ను కొట్టినప్పుడు నైవేద్యం పెట్టినప్పుడు అందులో బెల్లం ముక్కను కూడా వేసి నైవేద్యం పెట్టాలా? ఎందు చేత ?అరవ రాధా కృష్ణ రావు, Rajahmundry

Answer: మనంతినే ఆహారాన్ని భగవంతునికి సమర్పించుట నైవేద్యం అవుతుంది. మనం తినుటకు వీలుగా, రుచిగా, శుచిగా, శాస్త్రనింద్యములుగాని ఆహార పదార్థాములను భక్తితో భగవంతునుకి నివేదించి ప్ర,సాదరూపముగా మనము ఆపదార్థాన్ని స్వీకరించవలెను. కనుక కొబ్బరికాయను కొట్టి ఆ నీటిని కొబ్బరిని (చిప్పలను) నివేదిచవచ్చును. లేక కోరిబెల్లముగాని పంచదారగాని కలిపినివేదిచవచ్చును, ముక్కలుగాకోసి వడపప్పు కలిపి నివేదిచవచ్చును, అంత ఓపిక అవకాశములేనువారు కేవలం కొబ్బరిచిప్పలనే నివేదించవచ్చును, మనంతినునప్పుడు మాత్రం చిప్పలను ముక్కలుగా గాని తురిమిగాని తినవచ్చును.ఎట్లాచేసిననూ తప్పులేదు – కాని కొబ్బరిచిప్పలకు కుంకుమబొట్లు పెట్టి నివేదించరాదు.

- Sri G.V. Subrahmanya Sarma, Dean, S.V.V.U.

Q106. Namaskarams, After the start of this program, lot of my doubts are clarified. Thanks to TTD. I have some doubts, please do clarify them.

1. On which days we are not supposed to touch Devatha trees like Neem, Tulasi, Ravi and others?

2. why we do pranayamam and Mudras while doing Sandhyavandanam. Is there any scientific significance?

- Regards, Mruthyunjaya

Answer:

అశ్వత్థసాగరేసేవ్యౌ నస్పృష్టవ్యాకదాచన| అశ్వత్థం మందవారేతు సాగరం పర్వణిస్పృశేత్|| (ధర్మసిన్ధు)

1. అశ్వత్థవృక్షమును (రావి) శనివారం తప్పమిగతావారములలో ముట్టుకొనరాదు. రోజూపూజించవచ్చును – శనివారం ముట్టుకొనిపూజించి ప్రదక్షిణములుచేయుట విశేషఫలితముగా చెప్పబడినది. తుళసీ మొదలగువానిని రోజూ ముట్టుకొని పూజింపవచ్చును. దళములను ఆది,మంగళ,శనివారములందు మరియూ ఏకాదశిరోజున కోయరాదు.

2. ప్రాణాయామముచేయుటవలన చిత్తైకాగ్రతకలుగును, కనుక సంధ్యావందనాది నిత్యకర్మలు, శుభకర్మలు చేయునపుడు విధిపూర్వకముగా చేయు ప్రాణాయామమువలన చిత్తశుద్ధి ఏకాగ్రత కలుగుటవలన ఆయాకర్మలఫలములు పొందగలము, ప్రాతస్సంధ్యాకాలమందుచేయు ప్రాణాయామమువల్ల ఆరోజంతాయు చిత్తశుద్ది,ఏకాగ్రత కలిగి అన్ని పనులయందు బుద్ధి చురుకుగా పనిచేసి ఆరోగ్యముగా నుందురు.

3. ముద్రలవిషయమై యోగశాస్త్రము ప్రమాణమైయున్నది, శరీరములోని అనేకనాడులు చేతివ్రేళ్ళయందు అరచేతులయందు, అరికాళ్ళు, వేళ్ళచివరలయందు కలిసియుండును. ముద్రలద్వారా ఆయాస్థానములను కలుపుటచే ఆయానాడులకేంద్రములు ప్రభావితమై ఆ ముద్రప్రయోజనములు సిద్ధించుటద్వారా ఆరోగ్యము, ఏకాగ్రత చేకూరును, కనుక ఆ యా ముద్రలు ప్రతిపాదింపబడినవి.

- Sri G.V. Subrahmanya Sarma, Dean, S.V.V.U.

Q107. The devotees of Ayyappaswami of Sabarimalai take deeksha for 40 days called mandala deeksha. Please let me know the significance of 40 days. How is the figure 40 arrived at? It is not a week, fortnight, month etc. Regards, Sathya

Answer: Just as a week, fortnight and month the word MANDALA denotes a collection of 40 days particularly in Ayurveda and Mantra Sastra. So often most of the Ayurvedic medicines for chronic diseases are prescribed to be used for 40 days. Similarly the holy texts like the Mahabharata are recommended to be recited for 40 days (or days of one Mandala). Similarly any Mantras according to Mantra Sastra yield good or desired results if they are repeatedly uttered for 40days. This type of practice for 40 days is known as Mandala Diksha.

The word MANDALA is verbally stands for a LONG CIRCLE FORMED FROM A LARGE RECTANGULAR FIELD EXTENDING TO A LENGTH OF 20 YOJANAS ON ITS EITHER LONG SIDES.

So symbolically the word MANDALA stands for 20+20= 40.

Even a person with all bad habits if takes an austerity and stops his bad habits for 40 days he will be able to control his weaknesses for ever. So the period of 40days is given importance in special ritualistic practices.

- Dr. Rani Sadasiva Murthy, Associate Professor, R.S. Vidyapeetha, Tirupati


Q108. Namo Naryanaya! With great faith in vedas being a Hindu, I would like to ask you one question and request you to provide me an appropriate answer for the question.

I have lost my eldest son Andugulapati Sri Mukesh recently on 21st May 2014 at the age of 26 years. He has completed his education and got good job in GVK EMRI also I am retiring from my government Job within two years. I don't know why this has happen to me. I am god fearing and never done any harm to any body nor involved in any illegal works. What curse is on me that the lord has taken away my son from me with cancer, which is a hidden cancer and cannot be discovered by any diagnostic instrument. I have done every thing possible in my hands and also prayed the lord of seven hills to save him, I also recite vishnu sharsanama's every Saturday. Please tell me how my son was taken away from me. I could not understand he is young and good boy. Hows fault is it, why god gave me such a big punishment.

Yours sincerely, Andugulapati Venkata Subba Rao

Answer: It is a very pitiable situation. Nothing else in this situation can fill the loss or gap. No answer at individual level can be a good reply in this context. Just expressing one's sorry may console your grief to a very little extent. But when this type of incidents are generalized the scriptures say

ఋణానుబంధరూపేణ పశు -పత్నీ - సుత - ఆలయా:

As said in this quote from Dharma Sastra and Niti Sastra the relation between any two persons is very much temporal and indecisive to sustain in the very next moment even. Though our prayers offered to the GOD seem not to have saved our relations from their death those prayers are not in vain. They take us closer to the GODs in our Adhyatmika life. They are the sources of our Vairagya. Or any unpardonable sin committed by any one of our family may result in such drastic end disregarding all our virtues.

May GOD of The GODS VENKATESWARA fetch a Peaceful turn in your life.

- Dr. Rani Sadasiva Murthy, Associate Professor, R.S. Vidyapeetha, Tirupati


Q109. swamy adiyen! according to sri pancharatra agama samhithas in jirnodharana balalayam in kumbha theertham how many days it is valid. plz send me the pramanas in various samhithas. i heard "eka masam thu kumbham syat". plz send me the reply. dasan barghavan

Answer:

ఏకమాసంతు కుంభస్థం బాలశక్తిః ప్రశస్యతే| అతఃపరం న్యసేత్ చిత్రే చిత్రాsభాసేsథవా మునే|| (పీరమేశ్వరమ్)

జిర్ణం వా నూతనం వాపి మాసాన్తః కల్పయేద్విధి| ఘటేశక్తిం సమావాహ్య పూజయేత్ దేశికోత్తమః||

మాసాత్పరం వత్సరం వా తతోవాప్యధికం భవేత్| బాలబింబం ప్రతిష్ఠాప్య తస్మిన్ సంప్రార్థయేత్ హరిమ్|| ( శ్రీ ప్రశ్నసంహితా)

- Sri K.H. Rajesh, Dept. of Agama, S.V.V.U.


Q110. పూజ్యునీయులైన గురుగారికి, తమరు ధర్మ సందీహములకు సమాధానములు తెలియజేస్తారని విన్నాను నాకు ఒక సందైహమున్నది రామాయణంలో పరశురాముడ్ని భృగురాముడంటారు అదే పేరుతో భృగుమహర్షికూడా ఉన్నారు, నేను ఈ మధ్య భృగురాశి మరియు భృగువాసరమని కూడా విన్నాను, అసలు భృగు అంటే అర్థమేమిటో తెలుపగలరు మరియూ భృగు రాశి అంటే ఏరాశి అవుతుంది భృగువాసరమంటే ఏ వారమవుతుంది తెలుపగలరు. నేను ఏమైనా తప్పుగా వ్రాసియుంటే ధయుంచి క్షమించగలరు.

జి.నాగజ్యోతి

Answer: పరశురాముని తండ్రి జమదగ్ని. అతడు భృగు మహర్షి వంశానికి చెందిన వాడు. జమదగ్నికే కాక భృగుమహర్షి వంశస్థులందరికీ భార్గవులు అని పేరు ఉన్నది. భృగుమహర్షి వరుణుని కుమారుడు. కనుక అతని వంశంలో జమదగ్నికి పుట్టిన పరశురాముడు కూడా భార్గవరాముడు అని పిలువబడుతున్నాడు. అంతే కాని భృగురాముడు అని కాదు. అయితే భృగుమహర్షి వంశంలో పుట్టిన శుక్రునకు భృగువని పేరు ఉన్నది. కనుక శుక్ర్రునకు చెందిన తులా, వృషభరాశులకు - భృగురాశులు అని పేరు. అలాగే అదే కారణంచేత శుక్రవారానికి భృగువారం అని పేరు.

- Dr. Rani Sadasiva Murthy, Associate Professor, R.S. Vidyapeetha, Tirupati


Q111. Namaste! Na Peru saraswathi, Kamsa daasi kubja Krishna bhagavanudiki gandham samarpinchinanduku Ganu Soundarya vathiga marchadu. Kubja nu trivakra ani pilichevarata. Krishna bagavanudi anugrahmtho soundaryavathiga marindi. Kaliyugam lo soundaryam korukune vaaru gandharva puja cheyyalani chadivanu...gandharva puja visheshalu telugulo vivarinchagalarani manavi chesukuntunnanu...

Answer: శారీరిక సౌందర్యం బాహ్య సౌందర్యం. అది ఎల్లకాలం అలాగే ఉండదు. యౌవ్వనంలో చాలా అకర్షణీయంగా ఉండేవారు కూడా ముసలితనంలో లేదా మధ్యవయస్సు వచ్చేసరికి అందవిహీనంగా మారవచ్చు.

మనిషి ఎప్పుడూ ఆకర్షణీయంగా కనబడాలంటే అందరూ ఇష్టపడేలా ఉండాలంటే -

౧. అందరితో మనసులోంచి ఆత్మీయంగా వారి కష్టసుఖాలను పంచుకుంటూ మాట్లాడటం,

౨. ఇష్టదైవాన్ని భక్తినిష్ఠలతో కొలవటం

౩. మన సామర్థ్యాన్ని చక్కగా తెలుసుకుని మన సామర్థ్యానుగుణంగా కష్టించి పనిచేసి ఆత్మవిశ్వాసం పెంచుకోవటం

౪. ధ్యానం, సద్గ్రంథపఠనం, యోగాభ్యాసం వంటివి అలవర్చుకుంటే మనం ఎప్పుడూ మన వయస్సుకంటే చిన్న వారంగానే ఆకర్షణీయంగా కనబడుతాం.

ఇక గంధర్వపూజ గురించి - ఇది కేరళలోని వఝప్పులి అనే ప్రదేశంలో ఉన్న ఆలయంలో "గంధర్వ పూజ" లేక "గంధర్వదోషపూజ" ను చేస్తారు. ఈ పూజను సంతానంలేనివారు, మూర్ఛవంటి వ్యాధులతో పీడింపబడేవారు, ఏవిధమైన కారణం వల్లనైనా వివాహంకాని వారు స్త్రీలు - పురుషులు కూడా ఈ పూజ చేస్తారు. కనుక ఈ గంధర్వపూజ కేవలం అందంకోసమే కాదు.

స్వస్తి

- Dr. Rani Sadasiva Murthy, Associate Professor, R.S. Vidyapeetha, Tirupati


Q112. పెద్దలకు నమస్కారము! ఆర్యా, నాదొక సందేహము, మనిషి మరణించిన తరువాత దహనము మొదలైన సంస్కారములు చెప్పబడినవి, అదేవిధముగా గోవు (ఆవు) మరణించినపుడుకూడా ఏవైనా సంస్కారములు కలవా, ఉన్నట్లైతే అవి ఏవో తెలుపగలరు. ఇట్లు, కే.సుమన్త శర్మ

Answer: గవాదులకు సంస్కారవిశేషములు ధర్మశాస్త్రమందు సాధారణముగా చెప్పబడలేదు, కాని యజమానుడు వాటిని ఖననము చేయుట యోగ్యము. పైతృమేధికసంబంధి మంత్రములన్నియూ మనుష్యలింగకములే కావున మంత్రలింగములను బట్టి సంస్కారము లేదని చెప్పబడుచున్నది - ఒకవేళ సంస్కారమున్ననూ లౌకికమే గాని వైదికముకాదు.

- Sri M.V.N. Pavana Kumara Sarma, Head, Dept. of Apastamba Pourohitya, S.V.V.U.


Q113. The puranas and vedas says surya bhagavan can move all over the visvam with ratham &anuludu as driver but the science said sun is a star and it cannot move it fixed at a place which is correct the vedas or the science?

Answer: Indian Astronomy based on Vedic Knowledge is the oldest one in the entire world. According to ancient Indian Astronomy - The Sun is a STAR only Taara Graha) and never deified it. Even the Astronomical and Astrological portions of Puranas and the Vedas consider the Sun to be a TAARA GRAHA and not a GOD. But in the Puranas there are a few stories in which the divine aspect of the SUN is highlighted. This doesn't mean that they disagree with the concept the Sun's being a Planet.

- Dr. Rani Sadasiva Murthy, Associate Professor, R.S. Vidyapeetha, Tirupati


Q114.Namaskaram, I am Sheetal and reside in Hyderabad city. My question to you is:

1. What is the importance of Kartik Maasam?

2. As I am a working woman, what simple things can I follow during this month?

3. Can you give me a mantra that i can chant everyday for overall prosperity and to overcome bad behaviors / negativity?

Regards,Sheetal.

Answer: Kartika masa is the most auspicious month according to our tradition. It is the most dearest month to both Vishnu and Siva. While there are are several Vishnu Vratas in this month every Monday is said to be the most dearest one to Siva. Fasting and Abhisheka on every Monday is dearest to Siva. Fasting, Lighting Lamps every day, Taking bath before Sunrise with cold water, Worshiping Tulasi Tree and Worshiping Vishnu, Siva, Lakshmi and Devi are some important events. Recitation of Vishnu Sahasra Nama or Siva Sahasra nama or the both is good for reverting evil thoughts.

svasthi

- Dr. Rani Sadasiva Murthy, Associate Professor, R.S. Vidyapeetha, Tirupati


Q115. శ్రీ గురుభ్యో నమః! పండితులకు నమస్కారములు. వివాహితలు, సభర్తృకలు అయిన స్త్రీలు తల నీలాలు (పూర్ణ ముండనం) సమర్పించడం విషయంలో శాస్త్ర బద్ధమైన నియమము దయచేసి తెలుపగలరు. సభర్తృకలైన వారు సమర్పించరాదని విన్నాము. కానీ పిల్లల ఆరోగ్యం బాగుపడాలని ఒక మాతృమూర్తి శ్రీ వేంకటేశునికి పూర్ణ ముండనం మొక్కుకున్నారు. ఈ విషయంలో సందిగ్ధం ఏర్పడింది. అయితే భర్త ఒడిలో కూర్చొని తల నీలాలు పూర్తిగా సమర్పించ వచ్చునని కొందరు చెప్పారు. దయచేసి వీలైనంత తొందరగా ఈ విషయముgvkలో దిశానిర్దేశనము చేయ ప్రార్థన. ధన్యోస్మి, కూర్మనాథ శర్మ, బెంగళూరు

Answer: సువాసినీ స్త్రీలకు ముండనవిధి నిషిద్ధము సర్వశాస్త్ర సమ్మతము. ఇక మొక్కు పక్షములో మొగానే భావించ వలసినదిగా తెలుస్తుంది. ఈ విషయంలో గౌణపక్షముకు, శాస్త్రచర్చలకు దావులేదు.

G.V.Phanirajshastri, SVVU


Q116. Guru gariki namaskaram. Nenu spatika sivalingam, srichakram, ganapati, marakatha srichakram ni puja lo vunchi roju laghu rudram tho abhishekam chestanu.rajasphalam ayyina rojullo deepam pettanu.malli snanam ayyina 5 roju ninchi puja modalapedthanu.ila chesko vaccha.deeniki emaina niyamalu unnayya.teliyacheyyandi. - Dhanyavadalu, Valli sridevi

Answer: ఇబ్బందిరోజుల్లో అనగా ఆశౌచాదులు మొదలైనవి గ్రామాంతరంవెళ్ళుట వంటివి జరిగినపుడు గృహములో ఎవరో ఒకరు దీపారాధనం చేసి నివేదనచేయవలసి ఉంటుంది. ముఖ్యముగా స్త్రీలు రుద్రము మొదలైనవేదమంత్రములతో చేయరాదు స్తోత్రములతో శ్లోకములతో పూజచేయవలెను.

- G.V.Subrahmanya sarma, Dean, S.V.V.U.


Q117. The extract :

Sharadi Vishadapakshe cha Ashvine Sukravare, Uduni Surapatise Yoga Ayushmatiyam, tithirapi cha gatanam panchami yatra suddha I

This is with reference to the date either 12th Sep 275 AD or 22nd Sep 274 AD.

1. It was Sukla Panchmi of Ashvina Month. But 12th Sep 275 was Sunday and 22nd Sep 274 AD was Tuesday. Is it Friday possible?

2. What is the meaning of Uduni Surapatishe?

3. Yoga Ayushmati can be Saubhagya yoga?

with regards

Answer: The meaning of the following sentence may give reply to all of your three questions:

Sharadi - IN THE AUTUMN SEASON

Vishadapakshe cha - IN THE BRIGHT FORTNIGHT

Ashvine - IN THE ASVIYUJA MASA

Sukravare, _ ON FRIDAY

Uduni (IN THE STAR OF)

Surapatise - VISHNU i.e. SRAVANA

Yoga Ayushmatiyam, - IN A YOGA THAT PROMISES LONGEVITY

tithirapi cha gatanam panchami yatra suddha - ON THE SUDDHA PANCHAMI DAY I

Svasthi

- Dr. Rani Sadasiva Murthy, Associate Professor, R.S. Vidyapeetha, Tirupati


Q118. 1.శివునికి ఇద్దరు భార్యలు పార్వతి,గంగా. శివునికి గంగతో ఎప్పుడు ఎలా వివాహము ఐనదో తెలుపగలరు.

2.రామాయణంలో పిడకలవేట అనే ఈ సామెత ఎలావచ్చిందో చెప్పగలరు.

G. Sampath Kumar

Answer: ౧. గంగాపరమేశ్వరుల వివాహంగురించి - భగీరథుని కోరికపై పరమేశ్వరుడు గంగను తన శిరస్సుపై ధరించాడు కనుక గంగా ధరుడైనాడు కాని గంగను శివుడు పరిణయమాడినట్లు ఇతిహాసం కనబడదు. అయితే శ్రీమద్రామాయణంలోనూ, భారతంలోనూ ఒకటి రెండు స్థలాలలో హిమవంతుని పుత్రికలు గంగా, పార్వతి శివపత్నులు అనే అర్థం వచ్చే ప్రయోగాలు కనబడుతాయి. ఇతరత్ర అంతా పార్వతీ పతి, పార్వతీ జాని అన్నట్టు గా గంగాపతి, గంగాజాని అనే ప్రయోగాలు వాడుకలో లేవు.

౨. రామాయణంలో పిడకల వేట: ఇది నిజానికి రామాయణంలో పిచుకల వేట. ఒక నవాబుగారికి ఒక పౌరాణికుడు రామాయణ కథను చెబుతూంటే ఆ కథను వినటం ఆపి ఆ ప్రక్కనే ఉన్న చెట్టుపై అటు ఇటు ఎగురుతూ ఉన్న పిచుకలను లెక్క పెడుతూన్నాడట ఆ నవాబు. అందుచేత "రామాయణంలో పిచుకలవేట". అనే ప్రయోగం ప్రసిద్ధికి వచ్చింది. అయితే కాలక్రమంలో పిచుకల వేట అనే స్థానంలో పిడకల వేట అనేది ప్రసిద్ధికి వచ్చింది. మనం ఛెయ్యవలసిన ప్రధానమైన పని వదిలేసి ఆ సమయంలో సంబంధంలేని పని ఏదైనా చేస్తే ఈ ప్రయోగాన్ని చేస్తారు.

Svasthi

- Dr. Rani Sadasiva Murthy, Associate Professor, R.S. Vidyapeetha, Tirupati


Q119. మూలా నక్షత్రం (ఏ పాదమైనా) వాళ్ళని పెళ్ళిచెసుకుంటే, పెద్ద వాళ్ళకి గండం అంటారు. నిజమేనా? ఒక వేళ నిజమయితే అది ఆడవారికేనా? మగవారికి కూడా వర్తిస్తుందా? ఎవరికి ఆ గండం వుంటుంది? అలాగే ఆశ్రేష, విశాఖ నక్షత్రం వాళ్ళకి కూడా చెప్తారు. నిజమేనా? దయచేసి వివరించగలరు.

Answer: మూల 4వ పాదం – మామ గారికి. ఆశ్రేష 1వ పాదం – అత్త గారికి, జ్యేష్ఠ - బావ గారికి, విశాఖా - మరిదికి గండమ్.

పురుషులకు దోషము లేదు. స్త్రీలకు మాత్రమే దోషమని కలదు.

శ్లో. మూలాసార్ప విశాఖాసు జ్యేష్ఠభేచోద్భవఃపుమాన్.

న దోషకృద్వివాహేషు స్త్రియం సర్వత్ర వర్జయేత్. ఇతి పూర్వకాలామృతే – 63వ శ్లో.

- Sri G.V. Subrahmanya Sarma, Dean, S.V.V.U.


Q120. Namaste Vedavicarasarani, Na peru Viswanath. Naku gruhapravesa muhurtham gurinchi oka sandeham undi. Yajamani (Owner) bharya (wife) nakshatram rithya, 3 va taara lo unnappudu Gruhapravesam muhurtham pettavachuna? Daya chesi naa e sandehamu nu tolaginchedaru.!

Answer: 1,3,5,7 తారలు పనికిరావు.

1. భార్య పేరుతో గృహమున్నప్పుడే భార్యాభర్తలకు తారాబలం చూచి లగ్న నిర్ణయం చేయవలెను.

2. యజమాని పేరుతో మాత్రమే గృహప్రవేశాదులకు లగ్న నిర్ణయం చేయాలు.

3. అత్యవసర పరిస్థితులలో మొదటి తొమ్మిదిలో జన్మతార (1), 2వ తొమ్మిదిలో విపత్తార (3), 3వ తొమ్మిదిలో ప్రత్యక్తార (5) లు వదలి పెట్టిన సరిపోవును. నైధనం (7) ఎల్లప్పుడూ పనికిరాదు.

శ్లో. ప్రథమే ప్రథమం త్యాజ్యం ద్వితీయే తు తృతీయకమ్.

తృతీయే పఞ్చమం త్యాజ్యం నైధనం త్రిషు వర్జయేత్.

- Sri G.V. Subrahmanya Sarma, Dean, S.V.V.U.


Q121. Respected Aacaaryas Of Veda-Vicaarasarani, Namaskaram, Parakaya Pravesham dwara inkokari shariramloki, parakaya pravesham cheyuvari Aatma pravesistundani mana Sastrala dwara telusundi. Parakaya pravesham chesinavaru inkokari shariramlo praveshinchi sastra viruddamyna papmulu chesinappudu Aa papakharmalu, parakayapravesam chesinavariki chendutaya leka praveshamu pondina shariraniki leda Aathmaku chendutaya? -Chepuri

Answer: పరకాయ ప్రవేశ విద్య గురించి ప్రస్తావన మనకు శాస్త్ర గ్రంథాలలో కన్న పౌరాణిక కథలలోనూ, భట్టివిక్రమార్కుల కథవంటి కథలలోనూ, ప్రాచీన జానపదకథలలోనూ, మహాత్ముల చరిత్రకు సంబంధించిన కథలలోనూ మాత్రమే లభిస్తున్నది.

శాస్త్రగ్రంథాలలో ముఖ్యంగా యోగశాస్త్రగ్రంథాలలో ఈ విషయాన్ని నామమాత్రంగా స్మరించినా పరకాయ ప్రవేశవిద్య ప్రక్రియ ఏమిటి? అన్న విషయంలో ఆ గ్రంథాలు మౌనంగానే ఉన్నాయి. కనుక శాస్త్రాధారాలను బట్టి పరకాయప్రవేశవిద్యను గురించి మాట్లాడాలంటే మనంకూడా మౌనమాచరించవలసిందే.

ఇక పౌరాణికాది కథలలో ఉన్న విశేషాలు పలువిధాలైన చర్చలకు దారితీసేవే కాని వాటినుంచి ఏవిధమైన నిర్ధారణ చెయ్యలేము. అయితే ఇక్కడ దొరుకుతున్న కథలను ఆధారంగా చేసుకుని యుక్తి సహాయంతో కొంత ఊహ చెయ్యవచ్చు.

ప్రాచీనకథలలో మనకు కనబడే ఒక కథను పరిశీలిద్దాం. ఒక యోగి ఒక గ్రామం పొలిమేరలో తపస్సు చేసుకుంటూండేవాడు. ఆ సమయంలో ఒక బాలుని తల్లిదండ్రులు అకాలంలో మరణించిన ఆ బాలుని శరీరంతో ఆ యోగి తపస్సు చేసుకునే ప్రాంతంలో ఉన్న స్మశానానికి వచ్చారు. అక్కడ వారు భోరున విలపిస్తున్నారు. వారి దు:ఖాన్ని చూసి వారికి హితవు చేయాలనే తలంపుతో ఆ యోగి తన శరీరాన్ని విడిచి ఆ బాలుని శరీరంలో ప్రవేశించాడు. వారికి తమ బాలుడు తిరిగి బ్రతికాడు అనే ఆనందం కలిగింది. అక్కడ ఉన్న యోగిశరీరం నిర్జీవమై నేలకు ఒరిగిపోయింది. గ్రామస్థులు ఆ యోగి మరణించాడని ఆయన శరీరానికి దహన సంస్కారాలను చేశారు. ఆనాటి నుంచి ఆ యోగి తన ధ్యానాదులను ఆ బాలుని శరీరంలోనే ఉండి చేస్తూ తన యోగజీవనానికి ఆటంకంలేకుండా కొనసాగిస్తూనే కాలంగడిపాడు. అతని తల్లిదండ్రులు తమ బాలునిలో ఈ మార్పు రావటం గమనించారు. తమ బాలుడు తిరిగి జీవించగానే యోగి శరీరం కోల్పోవటం కూడా వారికి గుర్తుకు వచ్చింది. ఆ యోగి తమను అనుగ్రహించటంకోసం తమ పుత్రుని శరీరంలో ప్రవేశించాడనే విషయాన్ని కూడా అర్థం చేసుకున్నారు. అతనిని తమ బాలునిగా కాక యోగిగానే పూజిస్తూ వచ్చారు.

ఈ కథకు విశ్లేషణ:

౧. పరకాయ ప్రవేశమనేది నిర్జీవమైన శరీరాలలోనికి మాత్రమే జరుగుతుంది కాని ఇద్దరూ బ్రతికి ఉండగా కాదు.

౨. ఒక శరీరాన్ని విడిచి మరొక శరీరంలో ప్రవేశించగానే విడిచిన శరీరం నిర్జీవమౌతుంది.

౩. ఒక జన్మ తరువాత మరొక జన్మ సంప్రాపిస్తే పూర్వజన్మ వాసనలు ఉండవచ్చు లేక ఉండకపోవచ్చు. కాని పరకాయ ప్రవేశంలో మాత్రం తాను అలా ప్రవేశించటానికి ముందు ఎవరో ఆ జీవిగానే అన్నివిధములైన స్మృతివిశేషాలతో ప్రవేశిస్తాడు జీవుడు. తనకు ఉన్న సంస్కారాలలోని ఔన్నత్యంలో ఏ మార్పు ఉండదు. తాను ప్రవేశించిన శరీరపు స్వభావాన్ని బట్టి వచ్చే మార్పులు ఆ శరీరంలో ఉన్న వ్యక్తి అంతరంగ చతుష్టయం పైన కాని, ఆత్మపైన కాని ఏ ప్రభావాన్ని చూపవు.

౪. అలాగే ప్రవేశించిన శరీరం నిర్జీవశరీరం కనుక దాని పూర్వపుఆత్మ అందులో లేదు కనుక ఆ ఆత్మకు ఈ శరీరంలో ప్రవేశించిన వారి చేష్టల పాపపుణ్యముల ప్రభావమూ సంతరించే అవకాశమూ లేదు.

Svasthi

- Dr. Rani Sadasiva Murthy, Associate Professor, R.S. Vidyapeetha, Tirupati


Q122. namaskaram, Kindly let me know brahma samhita is in which puranam.what it consists of..... since some commentators quote brahma samhita for support

Answer: Brahma Samhita is a Pancha Ratra Text extolling the Divine Glory of Lord Sri Krishna and Radha. It is not taken from any Purana.

Svasthi

- Dr. Rani Sadasiva Murthy, Associate Professor, R.S. Vidyapeetha, Tirupati


Q123. గురుభ్యొనమ. దయచెసి ఈక్రిన్ద నా అనుమానము తీర్చగలరు.1. హరితస గోత్ర రుశులు మరియు ప్రవర 2 త్రివర్తి రుశులా ఉన్నయా. లెక 1 నా,సరిఅయినది ఎది? స్ర్తీ గొత్రము వివాహప్రక్రియలొ ఎపుదు పెళ్ళికుమారుడు గొత్రంనకు శాస్త్ర ప్రకారము మారుతుంది. - నమస్కారం, vrk మూర్తి హైదరాబాద్

Answer: 1. హరితగోత్రమునకు ఆంగిరస, అంబరీశ, యవ్వనాశ్వ – అను పేర్లు కల ముగ్గురు ఋషులు.

2. కింతు వైవాహికా దేవపితృగోత్రం న ముంచతిస్వగోత్రాద్భ్రశ్యతే నారీ క్రమణాత్సప్తమే పదే అను వచమువలన వివాహసంస్కారములో “సప్తపది” విధి అనన్తరము వరుడి గోత్రమును వధువు పొందుచిన్నది.

- Sri G.V. Phaniraja Sastri, Asst. Professor, S.V.V.U.


Q124. Sir, can you tell me the reason to wear 3 - YAGNOPAVEETAMs for the GHRUHSTAS.

Answer:

యజ్ఞోపవీతే ద్వౌధార్యే శ్రౌతే స్మార్తే చ కర్మణి

తృతీయముత్తరీయార్ధం వస్త్రాభావే తదిష్యతే

అని మనుస్మృతి వచనము , గృహస్థుడు శ్రౌతకర్మలయందు,స్మార్తకర్మలయందు రెండు యజ్ఞోపవీతములు ధరించవలెను మూడవ యజ్ఞోపవీతము ఉత్తరీయస్థానమందు అతిదేశించబడినది, అదేవిధముగా “నిత్య ముత్తరం కార్యమ్” ఆపస్తంబ ధర్మసూత్రప్రమాణముచే ఉత్తరీయము విధిగా తెలియజేయబడుతుంది. కావున రెండు యజ్ఞోపవీతములు శ్రౌత,స్మార్త కర్మలయందు విహితములు,అదేవిధముగా ఉత్తీరీయార్థము తృతీయయజ్ఞోపవీతము విధిగా ధరించవలెను.

- Sri G.V. Phaniraja Sastri, Asst. Professor, S.V.V.U.


Q125. Dear Sir,

Q1. In Bhagvath Gita, after showing the "VISHWAROOPA DARSHAN" bhagwan says "Arjuna, being pleased with you i have shown you through my own power of yoga, the supreme, shining, infinite universal form, which none but you ever seen" Chapter 11 - Sloka 47

Keeping the fact that, Lord Krishna knew that Sanjay had got special "dristhi" gifted by Vyasa, how could he make such a statement?

Q2. Brahmasutra - written by VYASA, belong to "Vashishta gotra" and Mahabartha also written by VYASA belongs to "Angiras Gotra". If both the works were written by VYASA, why the difference in the Gotras? Whats the co-relation between the two?

Answer: 1. About Vishvarupa of Sri Krishna

A keen observation of Mahabarata Sequence is necessary here. Sri Krishna imparted Bhagavadgita to Arjuna on the First Day of the war. At that time he showed his Viswarupa to Arjuna only. But Sanjaya got his divine vision on the 10 day after the fall of Bhishma. It was by the grace of Vedavyasa he got his divine vision on the 10 day to narrate the Mahabharata war to Dhrtarashtra from the beginning of the war. In this process of describing he visioned the first day's Vishvarupa also and narrated the same to Dhrtarashtra. So there is no controversy in it. Shri Krishna Dvaipayana Vyasa of present Manvantara belongs to Vasishtha's gotra. In the present Manvantara this Vyasa wrote the Mahabharata and Brahma Sutras and divided the Vedas. He is also called Badarayana Vyasa.

The other Vyasa who belongs to the race of the sage Angiras belongs to one of the previous Manvantaras. For details Devi Bhagavatam can be seen where a list of 27 Veda Vyasas of 27 Manvantaras are in detail given.

Svasthi

- Dr. Rani Sadasiva Murthy, Associate Professor, R.S. Vidyapeetha, Tirupati


Q126. Sri, Gurubhyo namah, What is meant by kanchi garuda Seva? Kindly explain.

Answer: In Tamil Tradition the Service to Garuda is highly praised. It was linked to the divine grace of Garuda towards a devotee. According to that a devotee was staunchly worshiping the Chariot of Vishnu i.e. Garuda. But Garuda was not giving his darsan to him. It was on a festive day on which having observed all this Vishnu permitted Garuda to grace the devotee and come back. In the meanwhile Vishnu disappeared from the view of his devotees on the festival day. Garuda went to the temple from the Festival Procession and graced his devotee. So during this time it was felt fruitless by all others. So Kanchi GarudaSeva is popularly known to stand for a purposeless service on any occasion.

Svasthi

- Dr. Rani Sadasiva Murthy, Associate Professor, R.S. Vidyapeetha, Tirupati


Q127. గురుభ్యోన్నమః, శాంతిమంత్రం అంటే ఏమిటి? ప్రాముఖ్యం మరియు ఉపాసనా క్రమం వివరముగా తెలుపగలరు. అనేక ధన్యవాదములతో, రామచంద్ర

Answer: శాంతిమంత్రములు అనేకముకలవు, ఉపాసనాపద్దతులను అధికారికపురుషులు, ఉపాసకులైన గురువువద్ద ప్రత్యక్షముగా తెలుసుకొనవలెను.

- Dr. K. Tarakaramakumara Sarma, Associate Professor, Dean, S.V.V.U.


Q128. Dear Sir, What is the significance of Harathi in Hindu tradition. In some temples and house hold rituals, Camphor is used in harathi. But in some temples ghee lamp and lamp with different oils are used. What is the correct method of giving harathi in house hold rituals and in temples.

- Dr. Murali Nandi, Dept. of Computer Science, S.V.V.U.

Answer: Mangala Harati, Mangala Aratrikam or Harati are synonymous. Usually it represents to the Camphor Jyothi or Ghee Jyothi offered to the God. It is the representation of the the knowledge filled heart of the devotees. Either Camphor or Ghee can be used in Harati. But other than these two any of the other oils should not be used for Harati.

Svasthi

- Dr. Rani Sadasiva Murthy, Associate Professor, R.S. Vidyapeetha, Tirupati


Q129. Dandavat pranamams. What is Gayatri chandas

1) 8 aksharam x 3 padams = 24 or

2) 6 aksharam x 4 padams = 24

Bhagavad Gita (most of the shlokas except for few) shlokas are in which Chandas - Gayatri or Anushtup?

Dhanyavada:, Dasosmi, Venugopala Dasan (Vivek)

Answer: To know about Gaayatri metre its sources classes also should be known. In the Vedic Chandas Sastra there are basically 8 metrical classes. They are :

DAIVI Class AASURI Class - PRAAJAAPATYAA Class - AARSHI Class YAAJUSHI Class - AARCHI Class - SAAMNI Class - BRAAHMI Class

Out of these eight Classes except in Arshi Class in all other 7 classes there are only single foot metres (Eka paada Chandamsi). They are:

Gaayatri, Ushnik, Anushtubh, Brhati, Pankti, Trishtubh and Jagati.In all the said 7 classes the Single foot Gaayatri has its Syllabic Strength in the following manner:

Davi Gayatri = 1 syllable

Aasuri Gayatri - 15 syllables

Praajaayapatyaa Gayatri = 8 syllables

Yaajushi Gaayatri = 6 syllables

Saamni Gaayatri = 12 syllables

Aarchi Gaayatri = 18 syllables and

in Braahmi Gaayatri = 36 syllables

Now the details of Aarshi Class

In this class only all the metres are of Catushpaada or bahupaada Chandamsi. Four feet metres or multi feet metres. The syllabic strength of these metres is in the following manner.

1. Maa - 4 syllables (having one syllable in each foot)

2. Pramaa - 8 syllables (having 2 syllables in each foot)

3. Pratimaa = 12 syllables (having 3 syllables in each foot)

4. Upamaa - 16 syllables (having 4 syllables in each foot)

5. Sammaa - 20 syllables (having 5 syllables in each foot)

6. GAAYATRI - 24 syllables (with six syllables in each foot)

7. Ushnih - 28 syllables (with 7 syllables in each foot) and

8. Anushtubh = 32 syllables (having 8 syllables in each foot) ...

in this manner in the AARSHI class of Vedic Metres there are 26 metres altogether.

Here while defining AARSHI GAAYATRI the sage Pingala Naaga the author of Vedaanga Chandas says: Gaayatri Chatuspaat Rtubhih (Aarshi Gaaytri is of 24 syllables with 6 (Rtubhih) syllables in each foot and Ashtaaksharaa Tripadaa vaa (Optionally of 24 syllables with 8syllables in each foot). While defining Anusthubh in the Text Vedaartha Dipika its author Shadguru Sishya says: Tripadaameva Gaayatriim ekena paadena Anusthobhatiiti Anusthubh iti . (The three feet Gaayatri with 8 syllables in each becomes Anushtubh by addition of one more Octo syllabic foot (foot with 8 syllables).) This is because of the verbal root Anu+ Sthubh (vardhane). For more details the Text Pingalanaaga's Chandassastra can be seen.

Svasthi

- Dr. Rani Sadasiva Murthy, Associate Professor, R.S. Vidyapeetha, Tirupati


Q130. 1)brahmanulu kshathriya vaishya shudrulanu vivaham chesukovachani agnipuranam lo undi ala chesukunte variki kaligina santhananiki upanayana samskaralu cheyavacha vaari valana pithrulaku utthama lokalu kaluguthaya

2)Krutha yugam lo brahmanulu mathrame thapassuku arhulani thretha yugam lo brahmanulu kshathriyulu dhwapra yugam lo brahmana kshathriyulaku vaishyulaku kaliyugam lo anni varnala vaaru arhulani Ramayana lo undi mari vyasuni valana shudra garbam nundi puttina vidhurudu dhwapara yugam lo chivariki thapassu chesi dheha thyagam chesthadu kadha

3)brahmanulu mathrame vedhalu chaduvuthunnaru kadha upanayana samskaralu vaaru mathrame ippudu chesthunnaru kadha mari Sri krishnudu kuda upanayanam chesukoni vedhalu chadhukunnadani bhagavatham lo undhi mari krishnudu kshathriyudu kadha mari evarevaru upanayana samskaralu chesukoni vedhalu chadhuvavachu

Answer: యుగధర్మములు, వ్యాసపరాశరాది మహర్షులధర్మములు, మహాయోగులధర్మములు వేరుగాఉండును.మనపూర్వులు ఒకటిలేక రెండు పురాణములనుకాక సూక్ష్మ దృష్టితో సమగ్రమైన ఇతిహాసపురాణాదివాఙ్మయాన్ని పరిశీలించి రాబోవు తరములవారి యోగక్షేమమును మరియు కలిప్రభావమును దృష్టిలో ఉంచుకొని అనేకసంప్రదాయములను కట్టుబాట్లను ఏర్పాటు చేసియున్నారు, వేరే ఆలోచనచేయక వాటిని అనుసరించినప్పుడుమాత్రమే ఐహికంగానూ, ఆముష్మికంగాను ఉత్తమస్థితి లభించును.

- Dr. K. Tarakarama Kumara Sarma, Associate Professor, Dean, S.V.V.U.


Q131. ||Asmad Param Guruve Namaha||

The doctrine of Prapatti was propounded by Sri RaAmaAnuajaAChaArya in 11 century AD. Although the sole objective of either Vishitadwaita, Advaita or Dwaita is universal attainment of Godhead, Can you elaborate on How Shankara and MadhwaAchaArya concurred or differed from Sri RaAmaAnuajaAChaArya ?

Sincerely, Srinath Belur in Toronto, Canada

Answer: Bhakti as a means of attaining Moksha is accepted by all the three Major Schools of Philosophy : Advaita, Visishtta Advaita and Dvaita.

But there is a slight difference among these three schools in accepting its status. While Advaita considers this as a subsidiary means to attain MOKSHA (by saying - 'moksha saadhana saamagryaambhaktireva gariyasii the other two schools Visishta Advaita and Dvaita accept it as a direct means. In these two schools Sri Maha Vishnu or Naraayana is PRABRAHMA by Himself. So worshiping Him according to them leads Moksha.

As far as the Doctrine of Prapatti or Saranagati is concerned it was originated from Vishtadvaita only. But in Advaita and Dvaita though not these two terms are not used the same spirit towards Godlihood is expressed. For instance if we take the "Bhaja Govinda Stotra" or "Vishnu Shatpadi Stotram" or "Narayana Stotram" of Adi Shankara the spirit or the mood of Self Surrendering to Vishnu can clearly be seen through out.

Similarly in many stotrams of Madhva Acharya we seen the same state of mind. All the three Acharyas gave a prominent status to BHAKTI in their respective philosophies. Another slight difference is: Advaita along with Vishnu promotes the devotion for Shakti, Siva, Ganesha and Kumara also. Where as the other two acharyas promote Vishnu Bhakti as the ultimate means for attaining Moksha.

Svasthi

- Dr. Rani Sadasiva Murthy, Associate Professor, R.S. Vidyapeetha, Tirupati


Q132. అయ్యా వేదమూర్తులైన గురువుగారికి వందనములు, సంధ్యావందనము ప్రాతఃకాలము నక్షత్రములు అస్తమించకుండ చేయవలెనని అంటారు. మరియు సంధ్యావందనములోని భాగమైన సూర్యోపస్థానము సూర్యుడు ఉదయించిన తరువాత చేయాలంటారు. అంటే సూర్యోపస్థాన పూర్వ ఘట్టము వరకు నక్షత్రములు అస్తమించకుండ చేసుకొని, కొంత సమయము వేచి ఉండి సూర్యోదయమైన తరువాత సూర్యోపస్థానము మరియు ఉత్తరభాగములు చేయాలని అర్థమా? దయచేసి వివరించగలరు

Answer: అహోరాత్రస్యయస్సంధిస్సూర్యనక్షత్రవర్జితః

సాతు సంధ్యా సమాఖ్యాతా మునిభిస్తత్వదర్శిభిః

అని మన మహర్షులు ప్రాతఃకాలమందు సూర్యవర్జితమైనట్టియు, సాయంకాలమందు నక్షత్రవర్జితమైనట్టియు కాలమును “సంధ్యాకాలము“గా నిర్వచించినారు.

ఇక -

ఉత్తమాతారకోపేతా మధ్యమాలుప్తతారకా|

అధమా సూర్యసంయుక్తా ప్రాతస్సంధ్యా త్రిధాస్మృతా ||

ప్రాతఃసంధ్యావందనముకు నక్షత్రములుండగా ఉత్తమకాలముగా, నక్షత్రములు లోపించిన పిమ్మట మధ్యమకాలముగా, సూర్యోదయము తరువాత అధమకాలముగా తెలియజేసారు. అదేవిధముగా –

ఉత్తమా సూర్యసంయుక్తా మధ్యమా లుప్తభాస్కరా|

అధమా ఋక్షసంయుక్తా సాయంసంధ్యా త్రిధామతా||

సూర్యసహితమైనది ఉత్తమకాలముగా, సూర్యుడస్తమించిన పిమ్మట మధ్యముగా, నక్షత్రసహితమైనది అధమకాలముగా సాయంసంధ్యావందనమునకు తెలియజేసారు.

సాయముత్తరాపరాభిముఖోs న్వష్టమదేశం సావిత్రీం

\

జపేదర్ధాస్తమితే మణ్డల ఆనక్షత్ర దర్శనాత్ |

ఏవం ప్రాతః ప్రాఙ్ముఖస్తిష్ఠన్నామణ్డల దర్శనాత్|

అను ఆశ్వలాయన సూత్రముచే సాయంకాలమందు అర్ధాస్తమితముగా సూర్యుడున్నంతవరకు గాయత్రీ జపము చేసి ఉపస్థానము చేయవలెను, ప్రాతఃకాలమందు సూర్యమణ్డలదర్శనమువరకు నిల్చోని జపముచేసి సూర్యోపస్థానము చేయవలెను. అనగా సక్షత్రములుండగా ప్రాతస్సంధ్య ప్రారంభించి సూర్యమణ్డలదర్శనమువరకు అపరిమితముగా యథాశక్తిగా గాయత్రీ జపోపాసనము చేయవలసినదిగా అవగతమగుచున్నది.

- Sri G.V. Phaniraja Sastri, Asst. Pofessor, S.V.V.U.


Q133. ఓం నమో వేంకటేశాయ ,విజ్ఞులకు నమస్కారం . సంపూర్ణ యాత్ర అని శాస్త్రాలు చెప్పిన యాత్ర ,రామేశ్వరం ,కాశి ,రామేశ్వరమా? ఒకేసారి బయలుదేరి మూడు వరుసలో చెయ్యాలా ?మధ్యన ఇంటికి వచ్చి, వెళ్ళ వచ్చునా? అలా ఎంత కాలంలో యాత్ర పూర్తి చేయ వచ్చును? కాశిలో 9 నిద్రలు తప్పక చెయ్యాలా? దయచేసి పూర్తి వివరణ ఈయవలసిందిగా కోరుతున్నాను. - నమస్కారములతో, శ్రీమతి రాజేశ్వరి .

Answer: దక్షిణభారతదేశం నుంచి కాశీ యాత్ర చేయదలచినవారు ఎవరైనా ముందుగా రామేశ్వరం చేరుకోవాలి. రామేశ్వరానికి ఇరవై ఎనిమిది కిలో మీటర్ల దూరంలో ఉన్న ధనుష్కొడి కి వెళ్ళాలి. అక్కడ సముద్రస్నానం చేసి కాశీ యాత్రకు సంకల్పం చెప్పుకోవాలి. ఆ సమయంలో ఆసముద్రపు ఇసుకతో నాలుగు శివలింగాలను చేయాలి. సేతు మాధవ, వేణీమాధవ, బిందుమాధవ, రామనాథస్వాములని ఆ లింగములకు పేర్లు పెట్టాలి. వాటికి పూజ చెయ్యాలి. తరువాత వేణీమాధవ సైకతలింగాన్ని ప్రయాగలోని త్రివేణీసంగమం లో నిమజ్జనం చేయటానికి ఒక పెట్టెలో భద్రంగా ఉంచాలి. మిగిలిన మూడు లింగాలను సముద్రంలో కలిపివేయాలి. అక్కడినుంచి రామేశ్వరం చేరుకోవాలి. అక్కడ రామేశ్వరస్వామివారి గుడి ప్రాంగణంలో ఉన్న నూతుల నీళ్ళతో స్నానం చేసి అక్కడ ఉన్న నూతలలోని జలాలను ఒక పాత్రలో భద్రం చేసుకోవాలి.

అక్కడి నుంచి కాశీ యాత్రకు ప్రయాణం ప్రారంభించాలి. కాశీ యాత్ర అంటే ... ముందు ప్రయాగ ...అక్కడి నుంచి కాశీ ...అక్కడి నుంచి గయ వెళ్ళటమన్నమాట.ప్రయాగలో ... సంకల్పం, వేణీదానం, త్రివేణీ సంగమంలో తమతో ధనుష్కోడి నుంచి తెచ్చిన సైకతలింగాన్ని నిమజ్జనం చెయ్యటం, వేణీమాధవస్వామి దర్శనం చేసుకోవటం, అక్కడి గంగనీటిని సేకరించటం, హిరణ్యశ్రాద్ధం, పిండప్రదానం, తిలతర్పణం చెయ్యటం అనేవి ముఖ్య విధులు. అక్కడి నుంచి కాశీ చేరుకోవాలి.

కాశీలో మొదటి రోజు గణపతి పూజ, మహాసంకల్పం, తర్పణం, మణికర్ణిక ఘాట్ లో స్నానం, ఫలదానం, అన్నరూపహోమశ్రాద్ధం, పిండప్రదానం, తిలతర్పణం చెయ్యాలి. ఆ రోజు సాయంకాలం శ్రీకాశీవిశ్వేశ్వరస్వామి, అన్నపూర్ణ, విశాలాక్షి అమ్మవార్ల దర్శనం చేసుకోవాలి. అక్కడ శ్రీకాశీవిశ్వనాథస్వామివారికి శ్రీరామేశ్వరం నుంచి తెచ్చిన సముద్రజలాలతో అభిషేకం చెయ్యాలి.

కాశీలో రెండవరోజు అసి ఘాట్, వరుణఘాట్, దశాశ్వమేధఘాట్, పంచగంగా ఘాట్, మణికర్ణికఘాట్ లలో పిండప్రదానం, తిలతర్పణం చెయ్యాలి. అక్కడి నుంచి బిందుమాధవదర్శనం చేసుకుని గంగా పూజ చెయ్యాలి. మూడవరోజు గయకు చేరుకోవాలి. గయలో మహాసంకల్పం, పల్గుణీ తీర్థస్నానం, హిరణ్యశ్రాద్ధం, పిండప్రదానం, విష్ణుపాద హిరణ్య శ్రాద్ధం, హోమసహిత అన్నశ్రాద్ధం, అక్షయవటం దగ్గర పిండప్రదానం, ఫలదానం చెయ్యాలి.

నాల్గవరోజున తిరిగి వారణాశికి (కాశీకి మరో పేరు వారణాశి) చేరుకుని అక్కడ గంగాతీరంలో దంపతీ ఫూజ చేసి అక్కడినుంచి కాలభైరవస్వామి ఆలయంలో భైరవదర్శనం చేసుకుని రక్షతాడు కట్టుకోవాలి. కాలభైరవ దర్శనంతో కాశీ దర్శనం పూర్తి అయ్యింది అన్న మాట. అక్కడి నుంచి తిరిగి రామేశ్వరానికి చేరుకుని శ్రీరామనాథస్వామిని ప్రయాగలో సేకరించిన గంగాజలాలతో అభిషేకించాలి. ఈ అభిషేకవిధితో కాశీయాత్ర పరిపూర్ణమౌతుంది. కాశీలో తొమ్మిది రోజులు బస చెయ్యాలి అనేది ఒక విశ్వాసం తో కూడిన ఆచారమే కాని తప్పని సరి నియమం కాదు.

Svasthi

- Dr. Rani Sadasiva Murthy, Associate Professor, R.S. Vidyapeetha, Tirupati


Q134. Namaste Vedavicarasarani,Na peru Viswanath. Naku gruhapravesa muhurtham gurinchi oka sandeham undi. Yajamani (Owner) bharya (wife) nakshatram rithya, 3 va taara lo unnappudu Gruhapravesam muhurtham pettavachuna? Daya chesi naa e sandehamu nu tolaginchedaru.!

Answer: 1,3,5,7 తారలు పనికిరావు.

1. భార్య పేరుతో గృహమున్నప్పుడే భార్యాభర్తలకు తారాబలం చూచి లగ్న నిర్ణయం చేయవలెను

2. యజమాని పేరుతో మాత్రమే గృహప్రవేశాదులకు లగ్న నిర్ణయం చేయాలు.

3. అత్యవసర పరిస్థితులలో మొదటి తొమ్మిదిలో జన్మతార (1), 2వ తొమ్మిదిలో విపత్తార (3), 3వ తొమ్మిదిలో ప్రత్యక్తార (5) లు వదలి పెట్టిన సరిపోవును. నైధనం (7) ఎల్లప్పుడూ పనికిరాదు.

ప్రథమే ప్రథమం త్యాజ్యం ద్వితీయే తు తృతీయకమ్.

తృతీయే పఞ్చమం త్యాజ్యం నైధనం త్రిషు వర్జయేత్.

- Sri Goli Venkata Subrahmanya Sarma, Associate Professor, Dean, S.V.V.U.


Q135. Dear Sir, In our house we are having one Pooja Mandir made of wood and in that we have placed various GOD's photos in "U" shape. That is to say some photos facing to us and some photos to the right and some photos facing them(left side). Due to this arrangement the left side photos and right side photos are facing to each other. Some advised us that we should not keep photos in the pooja mandir opposite to each other( facing each other). There is no place to keep all the photos in one row facing us. As such I request you to clarify my doubt whether it is objectionable to keep photos in pooja mandir facing each other.

Thanking you, D.Prakasa Rao, Bangalore.

Answer: In the Puja mandiram the Photos of Gods can be arranged in any shape and in any order. But all the photos though are in U shape should face US. Even if they face each other it is not a wrong thing. But if they face us even being in U shape it can be considered as their favour and grace. Only direction prohibited is South. The photos should not be placed on the South side facing North.

Svasthi

- Dr. Rani Sadasiva Murthy, Associate Professor, R.S. Vidyapeetha, Tirupati


Q136. Guruvugariki padabhi vandanam, Sthreelu a a rojulalo thalantu posukovachu? Daya chesuchappa galaru. - Thanks & regards, Sridevi Srinivas

Answer: స్త్రీలు మంగళ, శుక్రవారములలో తలస్నానము నియమముగా చేయవలెనని శిష్టాచారము వలన తెలియుచున్నది

- Sri G.V. Phaniraja Sastri, Asst. Professor, S.V.V.U.


Q137. Hello Sir, the Dwajasthamba shadow of new built (5years- vinayaka ) temple near by our house, does not fall during the day light ( sun light)..but in the evening due to the electrical lights arranged , shadow falls on our house .

1) is it also considered as dosha?

2)what are the remedies to be done if the shadow falls (due to sun or electrical light)?

please mention some remedies. - thanking you, krishna

Answer: Nothing to worry about the shadow of Dhvajastambha due to electric light. More over it is not a dosha since it is in the temple of Ganesha and not in a Shiva Temple.

Svasthi

- Dr. Rani Sadasiva Murthy, Associate Professor, R.S. Vidyapeetha, Tirupati


Q138. DEAR SIR, HOW MUCH AMOUNT DID SRINIVASA TOOK FROM KUBERA FOR HIS MARRIAGE AND WHEN IT WILL GET REPAYED

The episode of the marriage of Padmavati and Srinivasa is available only in Varaha purana. There one can find only one line:

धनदो धनधान्याद्यै: पूरयामास वेश्म तत्.।

which means that Kubera filled that building with plentiful wealth and grains. So there is no count or account for it with us in the available sources.

Svasthi

- Dr. Rani Sadasiva Murthy, Associate Professor, R.S. Vidyapeetha, Tirupati


Q139. Respected Sir, It is said that Bhagavan Sri Krishna preached Bhagavad Gita on MARGASIRA SUDDHA EKADASI. It is also said that Bhagavad Gita was preached just before commencement of MAHABHARATA WAR, which was on KARTHIKA BAHULA AMAVASYA. Please clarify how these two dates could be reconciled?

With best regards,

Ch.S.R.Sarma, 505, Prabhatkar Apartments, 10-2-355/2, Vijayanagar Colony, Hyderabad-500057.

Yes...Mahabharata war according to the sources was started on Kartika Amavasya. On the same day Bhagavadgita was imparted by Sri Krishna to Arjuna. But it was on Margasirsha Suddha Ekadasi after the fall of Bhishma Snajaya started narrating the WAR DETAILS to DHRITARASHTRA from the first day to that day with all details due to the divine power of visioning PAST and FUTURE that was given by VEDA VYASA. Through the words of SANJAYA on that day BHAGAVADGITA was revealed to the world. So MARGASIRSHA SUDDHA EKADASI is considered to be the day of Bhagavadgita's origin.

Svasthi

- Dr. Rani Sadasiva Murthy, Associate Professor, R.S. Vidyapeetha, Tirupati


Q140. Acaryas Of Veda Vicaara Sarani, Namaskaram, Plse Tell Me Why Lord Venkateswara Vigraha Not Presented Along With Padmavathi Or Alamelumanga. There Is Any Reasons According Catur Vedas Or Puranas Or Created Sastras. -Chepuri

There are many Vedic and Pauranic sources in support of Sri Venkateswara's First emergence on Venktadri. Here is an account from Padma Purana:

आदौ कृतयुगे जम्बूद्वीपे भारतवर्षके।

गङ्गाया: दक्षिणे भागे योजनानां शतद्वये॥

पञ्चयोजनमात्रे तु पूर्वाम्भोधेस्तु पश्चिमे।

मासे भाद्रपदे विष्णुतिथौ विष्णुसमन्विते।।

सिद्धयोगे सोमवासरे गिरौ नारायणाऽह्वये।

स्वामिपुष्करिणीतीरे पश्चिमे भूत्यपश्चिमे॥

बृन्दारकाणां बृन्दैस्तु प्रार्थितो लोकरक्षक:।

आविर्बभूव भगवाऩ् श्रीनिवास: पर: पुमाऩ्।

श्रीनिवासाय महते निष्कलानिष्कलात्मने॥

नमोऽस्तु पद्मनेत्राय पवित्रायादिवेधसे॥

- इति पद्मपुराणे क्षॆत्रकाण्डे श्रीवेङ्कटाचलमाहात्म्ये

According to this citation from Padmapurana - Lord Sri Venkateswara SELF-EMERGED in the FIRST KRTA YUGA, in Jambu Dvipa, particularly in the Bharata Varsha. The place where He emerged by Himself is situated on the southern region of the river GANGA at about 200 yojanas. That was Bhadrapada month and the Tithi was Dvadasi (popularly known as Vishnu Tithi)...in Siddha yoga, Soma Vasara on this hill named Narayanadri. To specify further it was on the western side of Swami Pushkarini. That Vishnu was called VENKATESWARA as He emerged on the hill of NARAYANADRI which is also called VENKATADRI.

He was called SRINIVASA as He kept His Spouse Sridevi on His left side of the Chest. Further on the right side of the Chest He accommodated Bhudevi and hence called PRUTHVI VALLABHA.

Here on this hill SRINIVASA is a SVAYAM VYAKTA GOD and also ARCHAA MURTI. As He was alone while emerging He has continued to be alone on this hill having accommodated Sri Devi and Bhudevi on his Vakshastghala. This was mentioned in the following Rgveda Mantra also.

प्रव: पान्त मन्थसो धियायते।

महे शूराय विष्णवे चार्चत॥ (ऋग्वेदे १० मण्डले १५५ सूक्ते १ मन्त्र:)

According to another Rgvedic reference Dharmadevata recommended all the people to find for easy ways of salvation by serving the Lonely Vishnu on this Venktadri.

आरायिकाणे विकटे गिरिं गच्छ सदान्वे।

शिरिम्बिठस्य सत्त्वभिस्तेभिष्ट्वा चातयामसि॥

(ऋग्वेदे १० मण्डले १५ सूक्ते १ मन्त्र:)

This is the very reason for presenting Venkateswara Dhrva beara as a lonely Vigraha and not with his wives.

Svasthi

- Dr. Rani Sadasiva Murthy, Associate Professor, R.S. Vidyapeetha, Tirupati


Q141. NAMASTE to all the eminent scholars !

MY query:

Generally, the day dawns with the rising of the Sun. But ,why don't our telugu calendars or panchangam start the day with a particular thidi?

1) For eg. padyami or some other thidi starts at some 10.15 am but not exactly at the rise of the Sun and ends at some time in the evening or in the night.Why?

2) Why don't we have a particular thidi on the particular english day? or why doesn't a particular thidi last from a dawn to another?

3) How is it possible to have one or two thidis or sometimes ne of the thidis get lapsed on one day of english calendar?

Answer: Tithi is a day in chandramana. According to Chandra mana or Lunar Calender there are 12 Lunar months with 30 Lunar days in each. A Lunar day is called a Tithi. This is one among the five prime divisions of Time which are called Panchangas. (Tithi, Vara, Nakshatra, Yoga and Karana).

Of these five the first one is called Tithi. In the Astronomical terminology Tithi is defined as the name of time length that depends on the distance between the Moon and Sun. (chandra - surya - antara thithih) To an extent of 12 degrees distance between the Moon and Sun one Tithi covers. From the Thirteenth Degree the next Tithi commences. This distance between the Moon and Sun varies in span depending up on their Longitudinal Angular Distance. Accordingly the time length required to cover that distance also may be equal to 19hours to 25 or 26 hours varying depending up on their Angular phenomenal motion. So Tithi is not equal to the Days of an Week.

Svasthi

- Dr. Rani Sadasiva Murthy, Associate Professor, R.S. Vidyapeetha, Tirupati


Q142. సీతాదేవిని పెంచిన జనకుని భార్యపేరు తెలుపగలరు

Answer: జనకుని భార్యపేరు శ్రీమద్రామాయణంలో లేదు కాని వ్యాఖ్యానాలలో మాత్రం ఆమె పేరు "సునయన" అని ప్రస్తావించారు.

- Dr. Rani Sadasiva Murthy, Associate Professor, R.S. Vidyapeetha, Tirupati


Q143. శ్రీ గురుభ్యోన్నమః ! అయ్యా, మా కూతురికి (ప్రస్తుత వయస్సు ఎనిమిది ఏళ్ళు ) పుట్టుకతోనే తల మీద రెండు సుడులు ఉన్నాయి . ఇది ఏమైనా లోపమా/దోషమా . ఇలా ఉంటె అమ్మాయి వివాహ విషయంలో ఏవో జాగ్రత్తలు తీసుకోవాలని విన్నాను , అవి ఏమిటి , దయచేసి తెలుపగలరు .. ధన్యోస్మి

Answer: మీరు ప్రస్తావించిన విషయాన్ని సాముద్రికశాస్త్రవిషయం గా చెబుతుంటారు. శరీరానికి "సముద్రము" అని పేరు. అనేక ముద్రలతో (చిహ్నములతో) కూడుకొని ఉంటుంది కాబట్టి. సముద్రమునకు అంటే శరీరమునకు చెందిన ఆ ముద్రల ఫలితాలను చెప్పే, విశ్లేషించే శాస్త్రమే. సాముద్రికశాస్త్రం. నేటిరోజులలో కేవలం హస్తసాముద్రికాన్ని మాత్రమే అధ్యయన, ప్రచారాలలో అందరూ అనుసరిస్తున్నారు.. తలలో రెండు సుడులు వంటి సాముద్రిక లక్షణాలకు మాత్రం బహుళప్రచారం కలుగచేస్తున్నారు. నిజానికి తలలో రెండు సుడులు ఉన్నవారిని నేను చాలామందిని చూశాను. ప్రచారంలో ఉన్న ఫలితాలు మాత్రం నాకు ఎక్కడా తారసిల్ల లేదు.

కనుక తలలో రెండు సుడులు ఉండటం లోపమో దోషమో కాదు. మీ అమ్మాయి విషయంలో ఆమె తలలోని రెండు సుడుల విషయంలో మీరు ఏజాగ్రత్తలూ తీసుకో నవసరం లేదు. ఇంకా ఎనిమిది సంవత్సరాల వయస్సు అంటున్నారు కనుక ఆ అమ్మాయిని చక్కగా చదువుకోనివ్వండి. యుక్తవయస్సు వచ్చాక వివాహప్రయత్నం చేయండి. శుభమస్తు.

- Dr. Rani Sadasiva Murthy, Associate Professor, R.S. Vidyapeetha, Tirupati


Q144. Pranams! Dear Sir ! Kindly advice about Importance of Harathi to Iswara and why Harathi to be given.How Harathi to be offered to the Iswara.

Answer: Harati or Aarathi is the linguistic modification and the shortened form of ARATRIKAM. Aratrikam is also called Nirajanam. In the Kalpa Texts it is explained in the following manner:

दीपो हि रात्रावेव प्रदर्श्यते। इदं दिनेऽपि दर्श्यते इति तस्य तथात्वम्।

A light is lit only during night times. But Aratrikam is shown to the GODS during day time also. Hence this is called ARATRIKAM.

The following is the procedure of offering ARATRIKAM

शिरसि निहितभारं पात्रमारात्रिकस्य भ्रमयति मयि भूयस्ते कृपार्द्र: कटाक्ष:।

While offering the worshiper should keep the Aratrika vessel on his head and submit his wish to the GOD to cast His (GOD's) favourable and blessing looks on the worshiper.

ततश्च मूलमन्त्रेण दत्त्वा पुष्पाञ्जलित्रय़म्। महानीराजनं कुर्यात् महावाद्यजयस्वनै:॥

Then uttering the Aratrika Mulamantra three times Pushpanjili should be offered to the God. Then The Mahanirjana should be offered supporting it with the victorious DUM BEATS and TRUMPET Sounds.

प्रज्वालयेत्तदर्थं च कर्पूरेण घृतेन वा। आरात्रिकं शुभे पात्रे विषमानेकवर्तिकम्॥

ARATRIKA lamp should be lit either with CAMPHOR (Karpura) or Ghee. Such Aratrika should be laid down in an auspicious plate consisting of many uneven numbered wicks.

आदौ चतु: पादतले विष्णोर्द्वौ नभिदेशे मुखमण्डलमेकम्। सर्वेष्वङ्गेषु च सप्त वाराऩ् आरात्रिकं भक्तजनस्तु कुर्यात्

While showing this Aratrika either to VISHNU or any other GOD it should be shown to the GOD moving the plate in circular manner for FOUR times,, at the FEET, TWO times at the NOVEL, ONCE at the face and in all other limbs for SEVEN times.

Svasti.

- Dr. Rani Sadasiva Murthy, Associate Professor, R.S. Vidyapeetha, Tirupati


Q145. Mahasaya! Can you inform me about the inner significance of Agnihotra which I perform daily at sunrise and sunset. Are there any conditions that it cannot be performed out of India ? Similarly can Sri Gayatri purascharanam be performed when I go abroad to be with my sons now and then. I would appreciate your response. - G. N. Murthy, Pushya nakshatram, Srivatsa Gotram

According to our Dharma sastras all the countries other than Bharata Varsha are Bhoga Bhumis. Bharata Varsha is the only KARMA BHUMI. So all the Vedic Ritualistic Performances are meant for Bharata Varsha only and are fruitful only here.

1. Hence even all the Gods are eager to take birth in Bharata varsha if they want to do any Karma like - Yajna, Dana, Tapas, Dhyana etc.

2. In the Parasurama's episode also Parasurama for this reason only requests Rama to destroy his punyas and not his Svecchhagamana sakti as he wants to perform his dutiful rituals in this Bharata Varsha ONCE IN A YEAR AT LEAST as per his word given to KASYAPA PRAJAPATI.

Svasti.

- Dr. Rani Sadasiva Murthy, Associate Professor, R.S. Vidyapeetha, Tirupati


Q146. Kindly clarify the following doubts

1- At what stage "chithanyam ot Atma " enters into the physical body during pregnancy?

2. Brahmam is present in both Chara and Achara prakrithi. So we have a body in which Brahmam is present even with out life, and in addition when the chythanyam gives life to the body there is another Braham in the form of life or chythanyam in us.

So do we have two forms of Brahmam in Advaytham in a living being. one in the physical form in lifeless body and another in life or atma?

- Dr. PTC Nambiar,Lakshmipuram,PO KANKOL, KERALA

Answer: QUESTION 1- At what stage "chithanyam ot Atma " enters into the physical body during pregnancy?

ANSWER

शुक्रशोणितसंयोगादावर्तते गर्भ:...सप्तमे मासे जीवेन संयुक्तो भवति - गर्भोपनिषत्

According to this citation from Garbhopanishad and also similar readings from the Ayurvedic Texts and other Vedantic Texts it is clearly stated that -

the formation of EMBRYO is due to the union of SEMEN and OVUM..... and during the process of the gradual growth and transition of the embryo into a baby in the seventh month the embryo attains the JIVA or the life principle in it.

Here the word JIVA is mere LIFE principle and not the ATAMAN.

ATMAN or CONSCIOUSNESS is the HIGHEST, ALL PERVASIVE and ETERNAL PRINCIPLE in all living or non living beings.

The SEMEN and OVUM are the right mediums which are capable of turn together into a LIVING BEING. In their absence the formation of LIVING BEINGS is not possible.

QUESTION2. Brahmam is present in both Chara and Achara prakrithi. So we have a body in which Brahmam is present even with out life, and in addition when the chythanyam gives life to the body there is another Braham in the form of life or chythanyam in us.

Answer:

Chara and Achara are to aspects of the same ATMAN or BRAHMAN and they are not separate. This is the ESSENTIAL CONSCIOUSNESS in the body of any LIVING BEING and it should not be equated with the LIFE. IT is higher than LIFE in STATUS.

The Achara aspect of BRAHMAN enables the CHARA aspect of IT to be called a BEING ATMAN according to ADVAITA is all pervasive. It is indivisible.

Just as the same stream of electricity which starts from the POWER GENERATOR enables all the electric gadgets to function in different ways being called with different names due to its presence in different mediums the same BRAHMAN is perceived differently due to ITS simultaneous and all pervasive presence in different KSHETRAS or MEDIUMS.

QUESTION 3: So do we have two forms of Brahmam in Advaytham in a living being. one in the physical form in lifeless body and another in life or atma?

Answer:

There are no TWO forms of BRAHMAN ADVAITA Philosophy. BRAHMAN the UNIVERSAL SELF is only one and called JIVATMAN or INDIVIDUAL SELF while found in any individual being.

Svasti.

- Dr. Rani Sadasiva Murthy, Associate Professor, R.S. Vidyapeetha, Tirupati


Q147. Kindly send me the english meaning for the veda vakyam Sarvam kalvidam brahma - Adiyen j.sitalakshmi

Anwer: सर्वम् खल्विदम् ब्रह्म ब्रह्म (sarvam khalvidam brahma) means THIS (This entire visible universe) IS BRAHMA (Here Brahma is not the four-headed Brahma. This BRAHMA is the INVISIBLE CAUSE BEHIND THE UNIVERSE FROM WHICH THIS ENTIRE UNIVERSE EMERGED AND AGAIN MERGES IN THE SAME CAUSE.

Svasti.

- Dr. Rani Sadasiva Murthy, Associate Professor, R.S. Vidyapeetha, Tirupati


Q148. Kindly enlighten me as to how Parvati became the sister of Vishnu (Padmanaabha Sahodari)

Answer:

काञ्चीक्षेत्रे पुरा धाता सर्वलोकपितामह:।

श्रीदेवीदर्शनार्थाय तपस्तेपे सुदारुणम्॥

आत्मैक्यध्यानयुक्तस्य तस्य प्रतपतो मुने:।

प्रादुर्बभूव त्रिपुरा पद्महस्ता ससोदरा।

पद्मासने च तिष्ठन्ती विष्णुना जिष्णुन सह॥

According to this Pauranic citation once Brahma did a great penance to see SriDevi (Goddess Lalita). Having seen his staunch penance Goddess was pleased very much and appeared before him standing in a lotus along with Her Brother Vishnu. Hence She is called "Padmanabha Sahodari".

Besides this in Kurma purana, Ganesa purana and Vayu purana there are many references where Parvati often calls Vishnu as her Brother.

According to Vayu Purana and Siva Purana on the occasion of the marriage of Sati and Siva and Parvati and Siva there appears Vishnu as Her Brother to perform all customary deeds as Her Brother should do.

Hence Lalitha or Parvati or Sati or any of Her other Vibhutis call Vishnu as their own Brother.

Svasti.

- Dr. Rani Sadasiva Murthy, Associate Professor, R.S. Vidyapeetha, Tirupati


Q149. Reverred Sirs: Among Sukthas, Purusha Suktha assumes paramount importance. While the opening of the Hymn addresses the Paramapurusha with 1000 Heads, it hints at SAHASRAKSHA SAHASRAPAAD - mesning 1000 eyes, etc. A layman like me is not able to appreciate with 1000 heads, how HE is described to have 1000 eyes, etc. I humbly beseech your kindselves to kindly clarify this point to me.

- In the SERVICE OF THE LORD, With warm regards and respects, C. R. NARASIMHAN

Answer: Purusha Sukta is one of the 250 and more cosmological hymns of the Rgveda. Here the process of this phenomenal world's emergence from the Visvachaitanya which is otherwise called PURUSHA (Not the masculine gendered male human being but it is the name of the Visva Chaitanya or the Universal Consciousness). As this is all pervasive by nature the eyes or feet or arms all beings are identified with those of that PURUSHA. It is a metaphorical expression to say that The PURUSHA as 1000 heads/1000eyes/1000 feet. This suggests on this occasion that the Maha Purusha who is the Consciousness of the Universe is pervasive in all the living beings nad non-living beings. Hence it is not wonder to say that He has 1000eyes/eyes/feet.

Svasti.

- Dr. Rani Sadasiva Murthy, Associate Professor, R.S. Vidyapeetha, Tirupati


Q150. 1.నివీతిగా ఏమి చేయవచ్చు

2.పితృతర్పణం నివీతిగా చేసే సంప్రదాయం కొన్నికుటుంబాల్లో ఉంది. ఇది శాస్త్ర సమ్మతమేనా ? ఆపస్తమ్బ – బోధాయన సూత్రభేదంవల్ల సాంప్రదాయ భేదాలు ఉండవచ్చు కదా .

3. పవిత్రం - దర్శాదితర్పణాలలో పవిత్రం ఎన్నిదర్భలతో చేసినది ధరించాలి. అన్నింటికీ త్రిదర్భపవిత్రమేనా?

నమస్కారములు ..

- Prof. K.V. Ramakrishnamacharyulu, Former Vice-Chancellor, JRR Sanskrit University, Jaipur & Professor of Vyakarana (Retd.), R.S. Vidyapeetha, Tirupati.

Answer: 1. అథ వై భవతి “నివీతం మనుష్యాణాం ప్రాచీనావీతం పితృణాం ఉపవీతం దేవానామ్” ఇతి. కథముఖల్వేతాని విజానీయాదితి. ఉపరిష్టాదంసాభ్యాం గ్రీవాం హృదయం చ సంపరిగృహ్య హృదయస్యాదధస్తాత్ ఊర్ధ్వం నాభేః అంగుష్ఠాభ్యాం పరిగృహ్ణానితి తన్నివీతం మనుష్యాణామితి ఋషీణామితి ఏవేదముక్తం భవతి . ఏతేన కృష్ణద్వైపాయనాదయో వ్యాఖ్యాతాః తేషాం సప్తఋషయో రాజానో భవతి యే హ సంతతిస్తే మనుష్యా ఇతి

అథ నివీతకార్యాణి –

1. ఋషీణాం తర్పణం వ్యవాయః ప్రజాసంస్కారో అన్యత్ర హోమాన్ముత్ర పురీషోత్సర్గః ప్రేతోద్వహనం యాని మనుష్య కార్యాణి కణ్ఠేsవసక్తం నివీతమితి.

2. బ్రహ్మయజ్ఞమందు జీవత్పితృకులు నివీతిగానే నిత్యతర్పణము చేయవలేను. ఇక ఈ విషయంలో సూత్రభేదము వలన సంప్రదాయభేదము లేదు.

3. దర్శాది శ్రాద్ధాంగ తర్పణములలో త్రిదర్భపవిత్రమే ధరించవలేను. హేమాద్రిః –

శ్రాద్ధే గ్రాహ్యాస్త్రయస్సాగ్రాః కుశాస్సుష్షోడశాంగులాః

ద్విమూలమేకతః కుర్యాత్పవిత్రంచాగ్రమేకతః ||

ద్వ్యంగుళం మూలవలయా గ్రంథిరేకాంగులా తథా

చతురంగుళమగ్రంస్యాత్పవిత్రస్య ప్రమాణకమ్ ||

స్మృత్యర్థసారే –

సర్వేషాం వా భవేద్వాభ్యాం పవిత్రం గ్రధితం సదా

త్రిభిస్తు శాన్తికే కార్యం పౌష్టికే పంచభిస్తథా ||

స్నానకాలే చతుర్దర్భా హోమకాలే ద్విదర్భకౌ

శ్రాద్ధకాలే త్రయో దర్భా ఏకోద్దిష్టే తు ఏకకః।।

- Sri G.V. Phaniraja Sastri, Asst. Professor, Dept. of Apastamba Pourohitya, SVVU


Q151. Pujya Guruvulandariki Namaskaramu, Naku yeppatinundo oka sandeham unnadi..chala chotla anni devalayamulalo swami variki kani ammavariki kani "MAKARATHORANAM" pedataru... Asalu yenduku pedataru alamkaram kosame na leka yemana purana prasastyam unnada ani sandeham.. Naa sandehanni teerchagalaru.

Answer: వివిధ దేవాలయాలలో ద్వారతోరణమధ్యభాగంలో ఒక కనుగుడ్లు ముందుకు చొచ్చుకు వచ్చిన ఒక రాక్షసముఖం కనబడుతుంది. దానికే మకరతోరణమని పేరు. ఈ రాక్షసముఖాన్ని తోరణమధ్యంలో అలంకరించటానికి గల కారణమును గురించి స్కందమహాపురాణంలో ఒక కథ ఉన్నది.

పూర్వం "కీర్తిముఖుడ"నే రాక్షసుడు బ్రహ్మను మెప్పించి అనేకవరములను పొంది అలా వచ్చిన బలపరాక్రమాలతో సమస్తభువనములలోని సంపదలను తన సొంతం చేసుకున్నాడు. చివరకు నారదుని ప్రేరణతో పరమశివపత్ని అయిన జగన్మాతను కూడా పొందాలని ఆశపడ్డాడు. అతని దురాశను చూసి కోపించిన మహేశ్వరుడు అతనిని మ్రింగివేయమని అతిభీకరమైన అగ్నిని సృష్టించాడు. లోకాలను అన్నింటినీ మ్రింగివేస్తూ ఆ అగ్ని ఆ రాక్షసుణ్ణి తరమసాగింది. మరణంలేకుండా వరం పొందిన కీర్తిముఖుడు ఆ అగ్ని తనను ఎక్కడ దహించివేస్తుందో అని భయంతో పరుగులు తీస్తూ అన్నిలోకాలలో తిరిగి ఆ అగ్ని ప్రతాపానికి తట్టుకోలేక చివరకు పరమశివుని శరణు వేడాడు. భక్తవశంకరుడైన శివుడు ఆ రాక్షసుణ్ణి రక్షించటంకోసం ఆ అగ్నిని ఉపసంహరించి తన నుదుట మూడవకన్నుగా దానిని ధరించాడు. ఆ తరువాత కీర్తిముఖుడు తనకు తట్టుకోలేనంత ఆకలిగా ఉన్నదని తను తినటానికి ఏదైనా పదార్థాన్ని చూపమని మహాదేవుని కోరాడు. యుక్తిగా శివుడు "నిన్ను నువ్వే తిను" అని చెప్పాడు. శివుని వచనానుసారం మొసలి రూపును ధరించి ఆ కీర్తిముఖుడు తనను తాను ముందుగా తోకభాగంనుంచి తినటం మొదలు పెట్టాడు. తన శరీరాన్ని అలా తింటూ తింటూ కంఠం వరకూ తిన్నాడు. తన తలను తానే ఎలాతినాలో అతనికి తెలియలేదు. అతని ఆకలి ఇంకా తీరలేదు. శివుని ప్రార్థించాడు. నీవు ఈ నాటినుంచి సమస్తదేవతాలయాలలో తోరణాగ్రభాగాన్ని అలంకరించు. దెవతా దర్శనానినికి వచ్చే ప్రజలందరిలో ఉండే దుష్టమైన అహంకారాన్ని, ఆశను, తింటూ ఉండు. నీవు అందరికీ పూజనీయుడవు అవుతావు "అని వరమిచ్చాడు. ఆనాటినుంచి కీర్తిముఖుడు దేవతాలయాలలోని తోరణామధ్యభాగాన్ని తన రాక్షసమకరముఖంతో అధిష్ఠించి అలంకరించి భక్తులలో ఉండే దుష్టవికారాలను, అహంకారాన్ని, దురాశను కబళిస్తూ విరాజిల్లుతున్నాడు. అందుకనే దేవతామూర్తుల వెనుకనుండే తోరణానికి మకరతోరణం అని పేరు వచ్చింది.

Svasti.

- Dr. Rani Sadasiva Murthy, Associate Professor, R.S. Vidyapeetha, Tirupati


Q152. Would you please let us know the "RAKHSASA, ASURA, DANAVa" who were they ? Were they real human being -who could speak, could fight,could eat, could dance ? And finally if they were human being is there any survivor at present? If so in which Forest/Jungle and in which country.? Thanks and Regards.

Answer:ABOUT RAKSHASAS, ASURAS AND DANAVAS: All these were cousins and enemies of the GODS. These were the children respectively of Khasa, Diti and Danu the three wives of Kashyapa. Kashyapa Prajapati was one of the Manasa Putras of Brahma (Son of Brahma - born from mind).

About RAKSHASAS: According to one pauranic episode Some of the Rakshasas were produced from the foot of Brahma to protect the Waters in the Universe. Later they turned cruel and became enemies of Gods. According to Vishnupurana they were born to Kshyapa Prajapati and his wife Khasa. They are killers, cannibals, strong in twilight and so on.

About ASURAS: These were the sons and descendants of DITI and Kashyapa. These disregard and suppress the Gods. So these are called ASURAS.

About DANAVAS: These were the sons and descendants of DANU and Kashyapa. Viprachitti was the first DANAVA. After him there were several DANAVAS like - Shambara, Namuci, Puloma, Asiloma, Kesi and others who were popular in the worlds for their cruelty.

All these Rakshasas, Asuras and Danavas are commonly - Enemies of Gods, Destroyers of Yajnas and Yagas and cruel by mind.

Besides these the human beings also who possess asuri qualities as specified in the Bhagavadgita are said to have been asuric by nature.

Svasti.

- Dr. Rani Sadasiva Murthy, Associate Professor, R.S. Vidyapeetha, Tirupati


Q153. అయ్యా, మాఘ శుద్ధ సప్తమి నాడు సూర్య జయంతి కదా. అంటే అంతకుమునుపు సూర్యుడు లేడా, కాలము నిర్ణయించబడేది సూర్యోదయ మరియు సుర్యాస్తమయాలతోనే కదా. మరి సూర్యుడు పుట్టుకకు మునుపు , కాల నిర్ణయం ఎలా జరిగింది . అసలు సూర్యుడే లేనప్పుడు , సప్తమినాడు సూర్యుడు జన్మించినట్టు ఎలా నిశ్చయించారు .?

సైన్సు ప్రకారం, సూర్యుడు నిశ్చలంగా ఉంటాడు , భూమి ఇతర గ్రహాలూ సూర్యుడి చుట్టూ తిరుగుతూవుంటే పగలూ రేయి ఏర్పడతాయి కదా . మరి మన పురాణాలలో సూర్యుడు ఏడు గుర్రాల రథమును ఎక్కి తూర్పు నుండి పడమరకు ప్రయాణిస్తాడు అంటారు కదా . ఇందులో ఆంతర్యం ఏమిటి ?

సూర్యుడిని ద్వాదశాదిత్యులుగా , పేర్కొంటారు కదా , మరి మిగతా పదకొండు సూర్యులు ఎక్కడ ఉంటారు . వారి ఉనికి ఏమిటి . వీరిలో ఆదిత్యుడు నేనే అని భగవానుడు చెప్పుకొన్నాడు కదా , ఆదిత్యుడు ఎవరు.

సూర్యుడును ప్రత్యక్ష నారాయనుడని , పరబ్రహ్మము అని మోక్ష ప్రదాత అని అంటారు , కాని చంద్రుడిని , చంద్ర భగవానుడు అని అనరు ఎన్దుకు. సూర్యుడు నక్షత్రమువలె స్వయం ప్రకాషకుడు కదా, మరి సూర్యుడిని గ్రహాలలో ఒకడిగా చెబుతారు ఎందుకు?

Answer: కాలము అనంతము. అనంతకాలప్రవాహాన్ని మన వ్యవహారంకోసం రోజులుగా, వారాలుగా, నెలలుగా, యుగాలుగా, మహాయుగాలుగా, కల్పాలుగా, బ్రహ్మపరార్థాలుగా ఇలా మనం మనకు అనుకూలమైన కాలమానవిధానాన్ని తయారు చేసుకున్నాము. గ్రహ, తారక, నక్షత్రాదులతో కూడిన అనంత కోటి బ్రహ్మాండాలు కూడా ఆకాశమనే పాత్రలో పదార్థాలుగా ఉన్నాయి. వాటినన్నింటినీ పక్వం చేస్తున్నది కాలం. సూర్యోదయసూర్యాస్తమయాలు కలిపి ఒక రోజు అనేది మన వ్యవహారంకోసం ఏర్పరచుకున్న ఒక గుర్తే గాని సూర్యుని యొక్క గమనాన్ని బట్టి కాలం ఏర్పడుతున్నది అని కాదు. అలా ఒక సూర్యోదయము, ఒక సూర్యాస్తమయము కలిపి ఒక రోజు అని ఖచ్చితంగా లెక్కించవలసి వస్తే ధృవప్రాంతాలలో మన భూమి మీదనే కొన్ని రోజులపాటు సూర్యోదయమే కాదు. మరి అక్కడ ఏవిధమైన లెక్క తీసుకోవాలి? సూర్యచంద్రులు, నక్షత్రాలు, రాశులు ఇవన్నీ మానవుని, సమస్త జీవుల కాలప్రయాణంలో కొన్ని మైలురాళ్ళ లాంటివి. అంతే కాని వాటి గతులను బట్టి కాలం ఏర్పడటం లేదు.

ఇక మాఘశుద్ధ సప్తమిని సూర్యజయంతి అనటంలో ఆంతర్యం - సూర్యుడు పుట్టటానికి ముందే మన పంచాంగాలు పుట్టేశాయని కాదు. మనకు ప్రస్తుతం అలవాటులో ఉన్న శాలివాహనశకం, విక్రమ శకం, క్రీస్తుశకం వీటిద్వారా - ఆ శాలివాహనుడు, విక్రముడు, క్రీస్తు వంటి వారు పుట్టటానికి ముందు జరిగిన విషయాలను కూడా ఆ యా శకాల పరిధిలోకి తీసుకుని వచ్చి క్రీస్తు పూర్వం, విక్రమునకు ఫూర్వం అని చెబుతున్నాం కదా? అంటే ఈ శకాలాన్ని మన వ్యవహారంకోసం ఏర్పరచుకున్న అనంతకాలపు కొలబద్దలన్న మాట. సూర్య సిద్ధాంతం, బ్రహ్మసిద్ధాంతం మొదలైన పంచఖగోళశాస్త్ర సిద్ధాంతగ్రంథాలలో సృష్ట్యాదిలో సూర్యుని ఆవిర్భావదినాన్ని పౌరాణికకథలతో సంబంధం లెకుండా సృష్టి భౌతిక ఆవిర్భావక్రమాన్ని అనుసరించియే అత్యంత వైజ్ఞానిక క్రమంలో లెక్కగట్టి మన వర్తమానకాలమానక్రమంలొకి మార్చి మన వ్యవహారాని అనువుగా మనకు మాఘశుద్ధ సప్తమిగా ప్రకటించారు. కనుక ఆ గ్రంథాలను క్షుణ్ణంగా చదువుకుంటే ఆ లెక్కలను మనం అర్థం చేసుకోవచ్చు.

సూర్యుడు గ్రహమా కాదా అన్న విషయంలో -- మనం మనకున్న వ్యవహారజ్ఞానంలో కొన్ని పొరపాట్లలో ఒకటి "ప్లానెట్" అనే ఆంగ్లపదాన్ని "గ్రహమని" అనువదించుకోవటం. .సూర్యుడు నవగ్రహాలలో ఒక గ్రహమే. అయితే ప్లానెట్ కాదు.సూర్యుడు ఒక స్టార్. స్టార్ గ్రహం కాకూడదు అని సంస్కృతంలో , ప్రాచీన భారతీయ ఖగోళశాస్త్రగ్రంథాలలో మనకు చెప్పబడలేదు. అలాగే సూర్యుణ్ణి భగవంతునిగా ఆరాధించినట్టు చంద్రుణ్ణీ మనం ఆరాధిస్తున్నాం. సూర్యుని అష్టోత్తర శతనామస్త్స్తోత్రం లాగానే చంద్రునికి కూడా అష్టోత్తర శతనామస్త్స్తోత్రం కూడా ప్రాచీన కాలం నుంచి మనకు అందుబాటులో, అలవాటులో ఉన్నది. అలాగే సూర్యకవచం, చంద్రకవచం వంటి స్తోత్రాలు ఉన్నాయి. అక్కడ చెప్పిన ప్రకారం సూర్యుని లాగే చంద్రుడు కూడా భగవానుడే.

అలాగే ద్వాదశదిత్యులు అనే విషయంలో కూడా ఒక పొరపాటు ప్రచారం లోకంలో ఉన్నది. ఇక్కడ తెలుసుకోవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఆదిత్యులంటే కశ్యపుని భార్య అయిన అదితి పుత్రులు. వారు ప్రధానంగా పన్నెండు మంది. వారు - వివస్వాన్, అర్యమా, పూషన్, త్వష్ట్రా, సవితా, భగ, ధాతా, విధాతా, వరుణ, మిత్ర, శక్ర, ఉరుక్రములనే వారు. వీరికి ద్వాదశాదిత్యులనిపేరు. వీరందరూ సూర్యులు కారు. ఇక మనకు వ్యవహారంలో ఉన్న ౧౨ సూర్యనామాలు - మిత్ర, రవి, సూర్య, భాను, ఖగ, ఫూష్ణ, సవితృ, అర్క, భాస్కర, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్యులనేవి ఒకే సూర్యునికి గల పన్నెండు పేర్లు. మన భూమికి మన బ్రహ్మాండానికి ఒకే సూర్యుడు. ఇతరబ్రహ్మాండాలలో ప్రతిదానికి ఒక సూర్యుడు వంతున అనంతకోటి సూర్యులు ఉన్నారు.

Svasti.

- Dr. Rani Sadasiva Murthy, Associate Professor, R.S. Vidyapeetha, Tirupati


Q154. ayya namaskaram, Moksham anaga nemi. Prapanchamlo intamandi guruvulu inni vidanalu unnayi kada avi nijamga moksham istaya. Anaga buddudu, vivekanandudu, jainulu, shankaracharyudu moksham pondara. moksham stiti emiti, suppose gayatri mantram one crore time chaduvute moksham vastunda...etc..daya chesi cheppagalaru.

thank u, prasad tiruvallure, (kasyapasa gothram), Hyderabad

Answer: సత్యతత్త్వాన్వెషణకోసం ఆవిర్భవించినవి భారతీయ దర్శనాలు. వాటిలో వేదాన్ని పరమ ప్రమాణంగా తీసుకుని ఆవిర్భవించినవి ఆస్తిక దర్శనాలుగాను, వేదాలను ప్రమాణంగా అంగీకరించకుండా అనుమానప్రమాణంద్వారా లేక ప్రత్యక్షప్రమాణం ద్వారా సత్య తత్త్వనిరూపణం చేయటంకోసం ప్రయత్నించినవి నాస్తికదర్శనాలుగాను చెప్పబడుతున్నాయి. ఆస్తిక దర్శనాలు - న్యాయం, వైశేషికం, సాంఖ్యం, యోగం, పూర్వమీమాంసా, ఉత్తరమీమాంసా (వేదాంతం) అనేవి. నాస్తిక దర్శనాలు - బౌద్ధం, జైనం, చార్వాకం. ఈ దర్శనాలన్నింటిలో ఒక్కొక్కరు మోక్షాన్ని ఒక్కొక్క విధంగా నిర్వచించారు. వారి వారి మతాలననుసరించి వారి వారి మోక్షనిర్వచనాలన్నీ వారికి సరిఅయినవి గానే కనబడుతాయి. క్రమంగా ఆయా దర్శనాలలో మోక్షం అంటే ఏమిటో తెలుసుకుందాం.

న్యాయ - వైశేషికాలననుసరించి - మోక్షాన్ని అపవర్గం అంటారు. ఈ దర్శనాలననుసరించి ఈ జగత్తు పదార్థములచే నిర్మించబడింది. కనుక జగత్తుకు మూలభూతములైన పదార్థముల యదార్థజ్ఞానముతో పాటు నీతితో కూడిన సత్ప్రవర్తనద్వారా ఆత్మకు సంతరించిన రాగద్వేషాలు, వాంచలు, అన్నీ నశించి జనన- మరణచక్రంనుంచి బయటపడి ఆత్మ తనకు ఉన్న ప్రజ్ఞను కూడా విడిచి జడంగా నిలిచి పోతుంది. ఆ ఆత్మకు చైతన్యంకాని, ఆనందం కాని ఉండదు. ఇదీ న్యాయ - వైశేషికాల ప్రకారం మోక్షమంటే.

సాంఖ్యయోగాల ననుసరించి - మోక్షానికి కైవల్యమని పేరు. ఈ జగత్తు ప్రకృతి - పురుషతత్త్వాల కలయిక వల్ల ఏర్పడింది. ఆ రెండు తత్త్వాలు పరస్పరప్రభావం లేకుండా వేరుగా ఉండిపోతే అది కేవలభావస్థితి లేక కైవల్యస్థితి అని పేరు. ఈ కైవల్యమే సాధకుని అనుభూతిలోనికి రావటమే మోక్షమంటే.

ఇక పూర్వమీమాంసా దర్శనానుసారం - మోక్షమంటే మానవుని సత్కర్మలకు ఉత్తరావస్థ అయిన అపూర్వం ద్వారా సంభవించే అవస్థ. ఇలా కలిగే అఫూర్వం ద్వారా మానవుడు తాను పూర్వజన్మలో/జన్మలలో సంపాదించిన పుణ్య/పాపకర్మలఫలితాన్నంతటినీ నిశ్శేషంగా అనుభవించాలి. దాని ద్వారా తత్త్వజ్ణ్జానం కలుగుతుంది. ఇలా ప్రారబ్ధానుభవం నిశ్శేషంగా సమాప్తం కాగానే మానవుడు మోక్షాన్ని పొందుతాడు. ఈ దర్సనానుసారం మోక్షస్థితిలోఆత్మ తనస్వరూమయిన స్థితిలో నిలుస్జ్తుంది.

ఇక వేదాంతదర్శనాన్ని అనుసరించి దానిలోని శాఖాభేదాలలో మతభేదాలు ఉన్నప్పటికీ జగత్కారణభూతమైన ఆ పరబ్రహ్మ తత్త్వమునుంచి వచ్చినదే ఈ చరాచర లోకమంతా. ఈ లోకములోని జీవులందరూ ఏ కారణమునుంచి ఈ జగత్తులో వివిధ పశుపక్ష్యాది జన్మలనెత్తారో తమ సమస్త కర్మ సముదాయ పరిపాకానంతరం ఆకారణం లోనికి లీనం కావటమో లేక ఆ కారణాన్ని చేరుకోవటమో (వేదాంతదర్శనంలోని శాఖామతభేదాలననుసరించి) కొద్దికొద్ది మార్పులతో మోక్షంగా పిలువ బడుతుంది. ఈ సంసారబంధంలోని కర్మపాశబద్ధులనుభవించే ఈ దు:ఖమయ జీవితం నుంచి స్వేచ్చ్హను పొందటమే ముక్తి అని కొందరూ (సంసారకారణమైన దు:ఖనాశమే మోక్షమని) సమస్తజగత్తుకూ కారణభూతమైన ఆపరమాత్మతత్త్వజ్ఞానప్రాప్తియే మోక్షమని కొందరూ చెబుతూంటారు (దీనికే భావరూపమోక్షపక్షమని పేరు.)

బౌద్ధులు, జైనులు కూడా - ప్రపంచకారణభూతమైన దు:ఖనాశమే మోక్షమని చెబుతారు. చార్వాకులకు మరణమే మోక్షం. మరణాంతపర్యంతం జీవితం. ఆయా మత ప్రవర్తకులు చెప్పిన విధంగా వారందరికీ అనుభూతులు కలిగినట్లు వారి చరిత్రలు చెబుతున్నవి కనుక వారు వారి వారి మతానుసారం మోక్షాన్ని పొందినట్లే అంగీకరించాలి.

సంసారదు:ఖాలను చూసి కరిగిన మనస్సుతో అంత:పురాన్ని విడిచిపెట్టిన రాజకుమారుడు సిద్ధార్థుడు బోధివృక్షపు నీడలో జ్ఞానోదయం పొంది బుద్ధుడైనాడు. బుద్ధనిర్యాణంతో అతడు మోక్షాన్ని పొందాడని మనకు బౌద్ధం చెబుతున్నది. అలాగే శ్రీరామకృష్ణపరమహంస మార్గదర్శనంల్ మహావక్తగా ప్రవక్తగా అధ్యాత్మయుగకర్తగా మారిన శ్రీస్వామి వివేకానందుల వారు సిద్ధి పొందినట్లు ఉన్నది. వారి మోక్షవిషయం స్పష్టంగా మనకు అందుబాటులో లేదు.

శ్రీ శంకరభగవత్పాదులు సాక్షాత్తు శ్రీ శంకరభగవానుని ప్రతిరూపమని అధ్యాత్మజగత్తులో అందరు చెప్పుకునే మాట. ఆయనే మోక్షదాత. ఇక వారి మోక్శవిషయంలో చెప్పవలసింది ఏముంది? చిత్తశుద్ధితో గాయత్రీమంత్రాన్ని జపిస్తే ఆ తల్లి కూడా మోక్షాన్నిప్రసాదిస్తుంది అనేది నిర్ద్వందమైన సత్యం.

Svasti.

- Dr. Rani Sadasiva Murthy, Associate Professor, R.S. Vidyapeetha, Tirupati


Q155. శ్రీ గురుభ్యోన్నమః! అయ్యా, అతి పవిత్రమైన దేవాలయములపై అశ్లీలత-చిత్రాలు ఎందుకు ఉంటాయి

Answer: దేవాలయాలలో అశ్లీల చిత్రాలగురించి తెలుసుకోవటానికి ముందు భారతీయ - ఆలయనిర్మాణకళను గురించి తెలుసుకోవాలి. ఆలయనిర్మాణవిద్య భారతదేశమంతా ఒకే రకంగా లేదు. ఉత్తరభారతనిర్మాణకళ ఒక విధంగా ఉంటే బీహార్, రాజస్థాన్ గుజరాత్ లలో ఒక వేరు వేరు విధాలుగా ఉంది. కళింగ శైలి ఒక రకంగా ఉంటే దక్షిణభారతశైలి మరో విధంగా ఉన్నది. వీటికి అన్నింటికీ అధారభూతమైన గ్రంథాలు రెండు రకాలు. ౧. ఆగమాలు. ౨. శిల్పకళా గ్రంథాలు. ఆగమాలన్నీ ఆలయనిర్మాణం నుంచి దేవతారాధన వరకు సాధకుల అధ్యాత్మవికాసానికి అవసరమైన విషయాలను మాత్రమే ప్రస్తావించాయి. ఆగమాలలో చెప్పిన విధంగా ఆలయం అనేది కేవలం మనం ఆరాధించే అయా దేవతల ఇళ్ళు మాత్రమే కాదు. ప్రతి ఆలయం ఆ ఆరాధ్య దేవతస్వరూపమే. దేవత స్థూలరూపం ఆలయం అయితే దేవత యొక్క సూక్శ్మరూపం గర్భగుడీలో ఉండే మూర్తి. ఇకశిల్పకళాగ్రంథాలు ఆలయంలో ఉండే మూల విరాట్ విగ్రహాల నుండి పరివారదేవతలవరకూ, ఆపైన ఆలయం బాహ్య, అంత: ప్రాకారాలలో ఉండే సౌందర్యచిహ్నాలను గురించి ఎలా ఉండాలో వివరించేవే.

ఉత్తరభారత ఆలయనిర్మాణ శాస్త్రాలను పరిశీలిస్తే లాటిన, నాగర-చంద, సంధర, వారట్, భూమిజ వంటి నిర్మాణ సంప్రదాయాలు ఉన్నాయి. ఈ శైలీ విశేషాలు దేనికదే ప్రత్యేకతను సంతరించుకుని ఉంటాయి. అలాగే మధ్యభారతంలో నాగరచంద, రేఖ, భూమిజ నిర్మాణ క్రమాలు ప్రసిద్ధంగా ఉంటాయి. కళింగశైలి వీటి కంటే భిన్నంగా ఉంటుంది. ఈ భారతీయ శిల్పకళకు కొత్తమెరుగులు దిద్దినది బౌద్ధుల శిల్పకళా శాస్త్రం. ఆగ్నేయాసియా దేశాలలో వ్యాప్తిచెందిన బౌద్ధం మనదేశంలోకి ఆ యా సమీపదేశాల శిల్పకళావిశేషాలను ప్రవేశపెట్టటానికి కారణమైంది. దక్షిణభారతంలో చాళుక్యులు, రాష్ట్రకూటులు, పల్లవులు, పాండ్యులు వీరందరూ ఆలయనిర్మాణవిధానాలలో అనేక వినూత్నప్రయోగాలను చూపించి భారతీయనిర్మాణకళ ప్రపంచంలోనే అత్యంత ఆశ్చర్యకరమైన నిర్మాణకళగా ఉండేలా ఆలయాలను తీర్చిదిద్దారు. ఇలా భారతీయ ఆలయనిర్మాణ కళ ఒక సమగ్రమైన శాస్త్రంగానే వృద్ధి చెందింది.

ఈ నేపథ్యంతో ప్రస్తుత ప్రశ్నకు సమాధానం కోసం పరిశీలించాలి. ఆలయంలో ప్రవేశించగానే భక్తులకు తామారాధించే దేవతలపై భక్తి భావం ఎంతగానో ఇనుమడించాలి. అందుకనే దక్షిణభారతశైలిలో ఆయా ఆలయాలలో అతి విస్తృతకళాకౌశలంతో నానాలంకార, సుమలతాకృతిశోభితంగా, ఆలయప్రాకారాలపై ఆలయబాహ్యగోపురపర్యంతం ఉన్న నిర్మాణాలపై ఆ యా దేవతలకు చెందిన పురాణగాథలను, పాత్రలను దేవీదేవతలను, పశుపక్ష్యాదులను, లతలను, వృక్షాలను చిత్రీకరించి ఆ దేవతల చరిత్రలను ప్రచారంలోకి తేవటానికి ఎంతో శ్రద్ధ వహించారు. కొన్ని ఆలయాలలో వివిధ శాస్త్రాల విశేషాలను శిలాప్రతిమలుగా తీర్చిదిద్దారు. ఉదాహరణకు తమిళనాడులోని బృహదీశ్వరాలయం వంటి స్థలాలళో భరతనాట్యశాస్త్రంలోని నూటఎనిమిది కరణాలు, ఇతర నేత్ర, హస్త, పాదవిన్యాసభేదాలనూ, నాట్యముద్రా భేదాలను చిత్రీకరించి నాట్యశాస్త్రాన్ని లోక ప్రసిద్ధం చేశారు.

ఇలాంటి ప్రయత్నాలలోనే బౌద్ధవైదేశిక శిల్పకళరీతుల మేళవింపుగా నిర్మించిన ఆలయాలలో మాత్రమే మనకు శృంగారచిత్రసహిత శిల్పాలు కనబడుతాయి. అయితే ఇవన్నీ విశృంఖలశృంగారభంగిమలుగా కనబడవచ్చు కాని ఇవన్నీ వాత్సాయనాది కామశాస్త్రగ్రంథకర్తలు తమ గ్రంథాలలో కామసూత్రాలు, అనంగరంగం మొదలైన వాటిలో వివరించిన కొన్ని భంగిమలకు ప్రతిరూపాలు మాత్రమే. అవి మధ్యయుగంలో ఇంచుమించు ౧౦, ౧౧, ౧౨ శతాబ్దాలలో నిర్మించిన ఆలయాలలో మాత్రమే ఈ రీతులు కనబడుతాయి. ఇక్కడ గమనించ వలసిన విషయం ఈ విధమైన శిల్పకళను పోషించి ప్రోత్సహించిన రాజుల అభిరుచికి, అభీష్టానికి కూడా ఈ ఆలయాలు నిదర్శనాలుగా చెప్పాలి. బహుశా ఆరాజులు ఆలయప్రాకారాలను వివిధ శాస్త్రాల ప్రచారంలాగా కామశాస్త్రప్రచారానికి కూడా ఉపయోగించి ఉండవచ్చు. అంతే కాని ఇలాంటి శృంగారభంగిమలను ప్రోత్సహించటం భారతీయ శిల్పకళావిద్య లక్ష్యం ఏమాత్రం కాదు.

Svasti.

- Dr. Rani Sadasiva Murthy, Associate Professor, R.S. Vidyapeetha, Tirupati


Q156. శ్రీ గురుభ్యోన్నమః ! అయ్యా, శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహము తిరుమల కొండ మీద పుట్టలో దొరికిందని , తరువాత ఇప్పుడున్న స్థానంలో ''ప్రతిష్టించారని'' ఓ టీవిలో చెప్పారు నిజమేనా . ఆది శంకరాచార్యుల వారు తిరుమలలో 'ధనాకర్షణ యంత్రం మరియు జనాకర్షణ యంత్రం ' ప్రతిష్ట చేశారని చెప్పారు , అందువల్లే , స్వామికి ఈ వైభవం జరుగుతోందని ఓ చోట విన్నాను, నిజమే న, అలాగే శంకరాచార్యుల వారి కాలంలో ఈ క్షేత్రం 'శక్తి ఆలయంగా ప్రచారంలో ఉండేదని విన్నాను, నిజమేనా .

Answer: ఇంచుమించుగా ౧౧ పురాణములలో తిరుమలక్షేత్రమాహాత్మ్యమున్నది. అక్కడ ఉన్నవివిధకథలను పరిశీలిస్తే శ్రీనివాసుడు ఈ తిరుమలకు ఆ యా యుగములలో పలుమార్లు ఏతెంచి చివరకు కలియుగారంభంలో ఈ ప్రస్తుతపు ఆలయ వాసి అయినాడని తెలుస్తుంది. బ్రహ్మాండపురాణములోని ఒక సందర్బాన్ని బట్టి ఒకానొక కృతయుగంలో విష్ణుభక్తుడైన వృషభాసురుడనే రాక్షసుని కోరిక మేరకు అతనితో ద్వంద్వయుద్ధము చేసి తన చక్రాయుధముతో సంహరించి ఈ ప్రదేశమునకు వృషభాద్రి అనేపేరు వచ్చేలా వరమిచ్చాడట. అప్పుడు తొలిసారి శ్రీనివాసుని ఆగమనం జరిగింది.

త్రేతాయుగంలో ఆంజనేయుని తల్లి అయిన అంజనాదేవిని శ్రినివాసుడు అనుగ్రహించి ఈ పర్వతానికి అంజనాద్రి అనే పేరు వచ్చేలా వరమిచ్చాడట. ద్వాపరయుగంలో వైకుంఠరక్షణ చేయుచున్న ఆదిశేషునికి విష్ణుభక్తుడైన వాయుదేవునికి వచ్చిన కలహాన్ని నివారించే ప్రయత్నంలో వారిపంతం వల్ల అక్కడకు తీసుకురాబడిన మేరుపర్వతఖండమును స్వామి వారు తన నివాసముగచేసుకున్నారు. ఆమేరుఖండమే నేటి తిరుమల గిరి. ఆదిశేషునిచే రక్షింపబడుటచేత శేషాద్రి గా ప్రసిద్ధిగాంచింది.

ఇలా అనేక ఇతిహాసాలవల్ల ఈ తిరుమలకు ఇరవై పైచిలుకు పేర్లు వచ్చాయి. ఈ గిరిపై కలియుగారంభంలో భృగుమహర్షిఆగమనం వల్ల లక్ష్మీనారాయణుల మధ్యవచ్చిన కలహం కారణంగా అమ్మవారు వైకుంఠాన్ని విడిచి పెట్టి రాగా ఆమెను వెదకూ వచ్చి తాను ఈ కొండపై ఒక పుట్టలో విశ్రాంతి తీసుకుంటూండగా శ్రీనివాసుని ప్రతి రోజు ఒక ధేనువు తనక్షీరంతో సేవిస్తూండేది.

ఆ ధేనువు రక్షకుడు ఒక గోపాలుడు ఆ ధేనువును అదిలించే ప్రయత్నం చెయ్యగా ఆ దెబ్బ పుట్టలో ఉన్న శ్రీనివాసునికి తగిలినదట. అలా ఆ పుట్టలో ఉన్న శ్రీనివాసుని విషయాన్ని ఆగోపాలకుడు తొండమండలమని పిలువబడుచున్న ఈ ప్రాంతపాలకుడైన తొండమాన్ చక్రవర్తికి తెలియ జేశాడు. శ్రీవేంకటేశ్వరుని తొలిసారిగా చూసిన శ్రీ తొండమాన్ చక్రవర్తి శ్రీస్వామివారి ఆజ్ఞపై ఇక్కడ ఆలయనిర్మాణం చేయించాడట. ఇక్కడకు ఆది శంకరులు వచ్చి శ్రీయంత్రప్రతిష్ఠచేశారనే విషయం జనబాహుళ్యంలో ప్రచారంలో ఉన్న శ్రీవేంకటేశ్వరుని సప్తగిరుల ఇతిహాసం లభించే గ్రంథాలలో ఎక్కడా గ్రంథస్థమై లభించటంలేదు.

Svasti.

- Dr. Rani Sadasiva Murthy, Associate Professor, R.S. Vidyapeetha, Tirupati


Q157. వేద పండితులకు నమస్కారాలు! అయ్యా నమస్కారం, చక్కని అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. పూజ్యులు ఎంతో విలువైన తమ సమయమును కేటాయించినందుకు కృతజ్ఞతలు ... అయ్యా, ఉత్తరాయణం నే పుణ్యకాలమని ఎందుకు అంటారు ? ముఖ్యం గా ఉత్తరాయణం లో చేయవలసిన పనులు లేక విధులు ఏమి? అలాగే చేయకూడని పనులు ఏవి? - పవన్ కుమార్ భోగరాజు

Answer: వర్షస్యార్థే సూర్యస్య దక్షిణత: ఉత్తరదిగ్గమనషణ్మాసాత్మక: కాల: ఉత్తరాయణకాల: ఇత్యుచ్యతే| సంవత్సరంలో సగభాగం సూర్యుడు దక్షిణం నుంచి ఉత్తరదిక్కుకు సంచరించు కాలానికి ఉత్తరాయణమని పేరు.

కర్కటాదిష్యతే భానౌ దక్షిణాయనముచ్యతే|

ఉత్తరాయణమప్యుక్త: మకరస్థే దివాకరే||

కర్కటసంక్రమణం నుంచి మొదలు పెట్టి ఆరు నెలలకాలానికి దక్షిణాయనమని పేరు. మకరసంక్రాంతినుంచి (అనగా సూర్యుడు మకరంలో ప్రవేశించిన నాటినుంచి) ఆరు నెలల కాలానికి ఉత్తరాయణమని పేరు. యదుత్తరాయణం తదహర్దేవానామ్| దక్షిణాయనం రాత్రి:| సంవత్సర: అహోరాత్ర:" అని విష్ణుపురాణ వచనమ్ |

అనగా మానవసంవత్సరంలో ఉత్తరాయణకాలం ఆరుమాసాలు దేవతలకు ఒక పగటికాలం అవుతుంది. దక్షిణాయణకాలం ఆరుమాసాలు దేవమానంలో ఒక రాత్రి అవుతుంది. అలా మానవుల ఒకసంవత్సరం దేవతలకు ఒక రోజు (రాత్రి-పగలు) అవుతుందన్నమాట. ఈ ఉత్తరాయణపుణ్యకాలంలో మరణించిన జ్ఞానపురుషులు బ్రహ్మలోకానికి వెడతారుట.

ముఖ్యంగా ఉపనయనం వంటి సంస్కారాలకు ఉత్తరాయణమే తగినది. దేవతలకు ప్రీతికలిగించే అనేక వ్రతాలను కూడా ఉత్తరాయణంలోనే నిర్వహిస్తారు. సమస్త శుభకర్మలకూ, నూతన గృహప్రవేశాదులకు ఉత్తరాయణమే శ్రేష్ఠం కూడా.

Svasti.

- Dr. Rani Sadasiva Murthy, Associate Professor, R.S. Vidyapeetha, Tirupati


Q158. గురువు గారికి నమస్కారము, నాపేరు వి.ఎస్.గిరి ప్రసాద్ బంజారహిల్స్ వాస్తవ్యులం, నాకు సందేహాలు కోకొల్లలు,

1) నేను విశ్వబ్రాహ్మన వంశంలో పురుడు పోసుకున్నాను, మా వంశంలో కొంతమెరకు, కొన్ని కుటుంబాలవారు పౌరోహిత్యం చేస్తారు, ఐననూ మాంసాహారముస్వీకరిస్తారు, యఙ్ఞోపవీతము ధరించినవారు మాంసాహారము స్వీకరించుట ఎంతవరకు సబబు.

2) అసలు విశ్వబ్రహ్మనులు ఏకోవలోకివస్తారు, వీరు బ్రాహ్మణులేనా?, వీరికి బ్రహ్మనత్వ అర్హత ఉందా, వేదవిద్యకు వీరు అర్హులా? ఆది శంకరాచార్యులు కూడావిశ్వబ్రాహ్మనుడని అంటారు (నంబూద్రి బ్రాహ్మణుడు).

3) మా అన్నగారి కుమారుడికి రెండు సంవత్సరాలు, తనకు వేదవిద్య నేర్పంచాలని నా సంకల్పన, ఎక్కడ నేర్పంచాలో సలహా ఎవ్వమని ప్రార్దన.

4) మా వంశంలో పౌరోహిత్యం చేసారు కాని, వేదవిద్య నేర్చిన వారిని నేను ఎఱుగను, ఇంతవరకు మా ప్రవర ఏంటో నాకుతెలీదు, ఈమద్య ఒక పుస్తకములో చదివాను,మా ప్రవర ఇది అని “సానగ, సనాతన, అహంభు, ప్రత్నస, సుపర్ణ పంచ ఋషయా ప్రవరాన్విత ఋఖ్ శాఖి ఆశ్వలాయన సూత్ర సద్యోజాత ప్రవర పృథ్వితత్వ బ్రహ్మద్రవిన వసంత ఋతు త్రికోనాకుండ ఫాలాశదండ అయో వృత్తి శివ మూర్తి త్రికృత్ స్తోమ సానగ బ్రహ్మఋషు గోత్రస్య---- ఈ ప్రవర నిత్యము నేను చెప్పుకోవచా లేదా దయచేసి చెప్పండి.

5) నాకు వేదవిద్య అంటే ప్రాణం, నాకు వేదవిద్య లేనందుకు చాలాబాధపడుతుంటాను, నాకు అందుబాటులో ఉన్న పుస్తకాలతో మరియు internet ద్వారా కొన్నిమంత్రాలను నేర్చుకుంటూ ఉంటాను, నాకు గురువు గారు ఎవ్వరులేరుగనక శ్రీకృష్ణ పరమాత్మున్ని గురువుగా భావించుకుంటాను, ఇది సరియగు పద్దతియీనా? ఇది సరియగు పద్దతి కానియడల నేను ఈ వయసులో (ముప్పై సంవత్సరములు) గురుముఖతహ ఎలా నేర్చుకోగలను?

Answer: మీరు ప్రారంభంలోనే సందేహాలుకోకొల్లలు అని చెప్పారు. చెప్పినట్టుగానే చాలాప్రశ్నలను అడిగారు.

1) క్షత్రియులు, వైశ్యులు కూడా యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు. మాంసాహారాన్ని స్వీకరిస్తారు. అలాగే కళింగ బ్రాహ్మణులు్, వంగద్దేశపు బ్రాహ్మణులు కూడా మాంసాహారులే. అయితే మాంసాహారగ్రహణం వ్యక్తుల విజ్ఞతను బట్టి, వారి నియమ నిష్ఠలను బట్టి ఉండే వ్యక్తిగత విషయం

2) విశ్వబ్రాహ్మణులు అనే ప్రస్తావన ప్రసిద్ధవైదిక గ్రంథాలలో, మన్వాది ప్రసిద్ధ స్మృతులలో లభించటం లేదు. అయితే ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా లొని నూజివీడు ప్రాంతానికి చెందిన విశ్వబ్రాహ్మణ పండితులు మాత్రం ప్రాచీనకాలంలో విశ్వబ్రాహ్మణ ప్రస్తావన గురించి చాలా పుస్తకాలు వ్రాశారు. చాలా ప్రమాణాలు చూపుతున్నారు కూడా. వీరుకూడా బ్రాహ్మణులే అయినప్పుడు "బ్రాహ్మణ" శబ్దానికి ముందు "విశ్వ" శబ్దము ఎందుకు? దీనికి సమాధానం బహుశా పైన పేర్కొన్న నూజివీడు పండితుల పుస్తకాలలో దొరకవచ్చునేమో?!?! నంబూదిరి వేరు. నంపియాతిరి వేరు. వీరిలో ఎవరు విశ్వబ్రాహ్మణులో నిర్ధారణచేస్తే శ్రీ శంకరాచార్యులు ఎవరన్న విషయాన్ని మనం నిర్ధారించవచ్చునేమో!?

3) ఆ పిల్లవానికి ఇంకా రెండు సంవత్సరాలే కనుక ఉపనయనం అయ్యేవరకు వేచి ఉండండి. ఆ తరువాత ఎక్కడ ప్రవేశపెట్టాలన్న విషయం ఆలోచించ వచ్చు.

4) ఆ పుస్తకం ప్రమాణమని మీ వంశంలోని పెద్దవారెవరైనా చెబుతే అలా పాటించి ఆ ప్రవరను కొనసాగించండి.

5)వేదవిద్య గురుముఖంగా నేర్చుకోవలసిందే కాని ఇన్టర్ నెట్ ద్వారానో సి.డి లద్వారానో నేర్చుకోవలసింది కాదు. వేదాలకు స్వరం ప్రధానం. అది గురుముఖుత: నేర్చుకోవలసిందే. మీకు తగిన గురువును మీరు అన్వేషించి ఆయన వద్ద నేర్చుకోండి.

Svasti.

- Dr. Rani Sadasiva Murthy, Associate Professor, R.S. Vidyapeetha, Tirupati


Q159. శ్రీ గురుభ్యోన్నమః! అయ్యా, భద్రాచలంలో శ్రీరాముడు శంఖ చక్రాలను అటునిటుగా ధరించాడు, ఎన్దుకు.

Answer: బ్రహ్మాండపురాణంలో గౌతమీఖండంలో శ్రీభద్రాచలక్షేత్రమాహాత్మ్యం ఉన్నదని స్థలపురాణం చెబుతున్నది. అక్కడ ప్రస్తావించిన ప్రకారం శ్రీరాములవారు తన భక్తుడైన భద్రుని అనుగ్రహించటంకోసం శ్రీమహావిష్ణురూపంలో నిలిచారట. అప్పుడు భ్ద్దద్రునికి జ్ఞానాన్ని, మోక్షాన్ని ప్రసాదించాలనే కోరికతో ఆయన మోక్షప్రదాయకమైన శంఖాన్ని కుడిచేతిలోనికి, శత్రుసంహారకమైన చక్రాన్ని ఎడమచేతిలోనికి మార్చుకుని తాను రామునిగానే ఉండి తన ఎడమ తొడపై సీతమ్మవారిని కూర్చుండజేసుకుని, ప్రక్కన లక్ష్మణాదులతో కూడి భద్రునికి దర్శనమిచ్చారట. అది శ్రీరాములవారిచేతిలో భద్రాద్రిలో శంఖచక్రాలు తారుమారు అవటానికి కారణం అని స్థలపురాణం ద్వారా తెలుస్తున్నది.

Svasti.

- Dr. Rani Sadasiva Murthy, Associate Professor, R.S. Vidyapeetha, Tirupati


Q160. పూజ్యులైన పెద్దల పాద పద్మములకు సాంజలి బందకంగా నమస్కరించి విన్నవించుకొనునది ఏమనగా, అయ్యా, నా యందు దయతో క్రింద విషయములు తెలుపగలరని ప్రార్దిస్తున్నాను,

1) అష్టాదశ పురాణాలను {బ్రహ్మ, పద్మ, విష్ణు, శివ, లింగ . . . . .} మరియు ఉపపురాణాలను {సనత్కుమార, నరసింహ, శివధర్మ, దౌర్వాస, నారదీయ . . . . .} రచంచిన మూల కవి పేరు + తెలుగులో రచంచిన(అనువాద కవి)వారి పేరు + ఆ పురాణములు దొరుకు స్థలము,

2) ఏ పురాణము లేదా ఏ ఉపపురాణములో మానవులకు కావలసిన నిత్య మరియు నయిమిత్తిక కర్మలు గురించి పూర్తిగా వివరింపబదినది? - మీ అమూల్యమైన జవాబు కొరకు అనేక కన్నులతో ఎదురుచూస్తూ, వేంకట ఫణీష్ డి.

Answer: సంస్కృతవాఙ్మయంలో ౧౮ మహాపురాణములు, ౧౮ ఉపపురాణములు, ౧౮ ఔపపురాణములు - వెరసి ౫౪ (యాబదినాలుగు పురాణములు) ఉన్నవి. వీటి పేర్లు విష్ణు, మార్కండేయాది పురాణములలో ఇలా చెప్పబడ్డాయి.

అష్టాదశ పురాణాని యాని ప్రాహ పితామహ:|

బ్రాహ్మం పాద్మం వైష్ణవం చ శైవం భాగవతం తథా||

షష్ఠం భవేన్నారదీయం మార్కండేయం చ సప్తమమ్|

ఆగ్నేయమష్టమం చైవ భవిష్యం నవమం తథా|

దశమం బ్రహ్మవైవర్తం లైంగమేకాదశం స్మృతమ్||

వారాహం ద్వాదశం ప్రోక్తం స్కాందమత్ర త్రయోదశ|

చతుర్దశం వామనం చ కౌర్మం పంచదశం స్మృతమ్||

మాత్స్యం చ గారుడం చైవ బ్రహ్మాండం వాయవీయకమ్|

అష్టాదశ పురాణానాం నామధేయాని తాని వై|| - ఇతి మార్కండేయ పురాణే ౧౪౯ అధ్యాయే

ఇక్కడ చెప్పిన విధంగా బ్రహ్మపురాణం, పద్మపురాణం, విష్ణుపురాణం, శివపురాణం, భాగవతం, నారదపురాణం, మార్కండేయపురాణం, అగ్నిపురాణం, భవిష్యత్ పురాణం, బ్రహ్మవైవర్తపురాణం, లింగపురాణం, వరాహ పురాణం, స్కందపురాణం, వామన పురాణం, కూర్మపురాణం, మత్స్యపురాణం, గరుడ పురాణం, బ్రహ్మాండపురాణం, వాయు పురాణం - అనేవి పదునెనిమిది మహాపురాణాలు. పై ప్రామాణిక శ్లోకాన్ని అనుసరించి ఈ ౧౮ పురాణాలు తొలుత సృష్టికర్త అయిన చతుర్ముఖబ్రహ్మ చేత చెప్పబడినవి. ఆ తరువాత -

అష్టాదశ పురాణానాం కర్తా సత్యవతీసుత:| అన్న ప్రమాణ వచనానుసారం, ఈ పదునెనిమిది పురాణాలను వ్యాసభగవానుడు గ్రంథములుగా మానవాళికి అందించారు. అన్నది భారతీయ సంప్రదాయం నొక్కి వక్కాణించే విషయం. కాని పరిమిత లేఖనసామర్థ్యముమాత్రమే ఉన్న పాశ్చాత్యభావదాస్యప్రభావితులైన ఆధునిక పరిశోధకులు మాత్రం మేమెవ్వరమూ ఒక జీవితకాలంలో అన్ని గ్రంథములను వ్రాయలేము కనుక వ్యాసుడు కూడా ఒక్కడే అన్ని పురాణములను వ్రాసి ఉండకపోవచ్చును. అని సందేహమును వెలిబుచ్చి వ్యాసుడు ఒక వ్యక్తికాదు. అది ఒక ఫీఠము. ఆ పీఠమునకు చెందిన గ్రంథకర్తలందరూ వ్యాసులే అని చెబుతున్నారు. అయితే వ్యాస నామము పీఠమన్న విషయానికి మాత్రం వీరి వద్ద ప్రమాణం లేదు. ఇక ఉపపురాణముల పేర్లు -

సనత్కుమార, నారసింహ, నారదీయ, శివ, దౌర్వాసస, కాపిల, మానవ, ఔశనస, వారుణ, కాలికా, సాంబ, సౌర, ఆదిత్య, మాహేశ్వర, వాసిష్ఠ, నందికృత, పారాశర, భాగవత, శివధర్మ పురాణములు పదునెనిమిది - ఉపపురాణములుగా చెప్పబడుతున్నవి. కల్కి పురాణం, భార్గవపురాణం, ముద్గలపురాణం, దేవీపురాణం, బృహద్ధర్మపురాణం, సనత్కుమారం, (లఘు) నారదీయం, నందికేశ్వరపురాణం, ఆదిత్యపురాణం, పశుపతిపురాణం, వహ్నిపురాణం (ఇది అగ్నిమహాపురాణంకన్న వేరైనది), హరివంశం, మనుపురాణం, వశిష్ఠపురాణం,భాగవతం, కౌర్మపురాణం (ఇది కూర్మమహాపురాణం కన్న వేరు). ఇవన్నీ ఔపపురాణములని చెప్పబడుచున్నవి. వీటికర్తలెవరన్న విషయం ఇంకనూ నిర్ధారణ కావల్సిన విషయమే. అయితే వీటిలో చాలవరకూ వ్యాసప్రోక్తములే అను సంప్రదాయిక వచనము మాత్రము లోకప్రసిద్ధిలో ఉన్నది.

ఇక అనువాదములవిషయానికి వస్తే - పద్యరూపంలో అన్ని పురాణములకు అనువాదములు ముద్రణలో లేవు కాని - వచనములో మాత్రం పదునెనిమిది పురాణములకూ అనువాదములు లభించుచున్నవి. అయితే తెలుగులో ప్రామాణిక అనువాదములు మాత్రము అందుబాటులో లేవు. అనువాదములు చేసినవారిలో చాలామంది ఈ పురాణముల హిందీ అనువాదములను, ఆంగ్లానువాదములను దగ్గర పెట్టుకుని అనువాదము చేసిన వారే కాని మూలసంస్కృతపురాణములను యథామూలం అనువాదం చేసిన వారు అరుదుగానున్నారు. వారి అనువాదములను వెతికి చూడవలసినదే.

ఇక మనం చేయవలసిన నిత్యనైమిత్తిక కృత్యములగురించి అన్ని పురాణములలోనూ ప్రాస్తావికంగా చాలా విశదంగా చెప్పి ఉన్నారు. అయితే నారదపురాణంలో మాత్రం చాలా విస్తరంగా ఈ విషయంలో చెప్పబడి ఉన్నది. ఆ పురాణంలో చూడవచ్చు.

Svasti.

- Dr. Rani Sadasiva Murthy, Associate Professor, R.S. Vidyapeetha, Tirupati


Q161. Sir i am studying btech aerospace engineering. Recently I came to know about our vedic knowledge on flying machines. Are there any machines described in atharvana veda. Also please tell me about 'yantra sarvasva' written by maharshi bharadwaja. If possible please send me the translated version of atharvana veda in telugu to my mail id. Also please give the list of all scientific books written by our sages and their translated versions in telugu. Please give detail information about "YANTRA SARVASVA" book.

Answer: Yantra Sarvasva is a large book in 96 Adhikaranas. As the sources say it is available in MSS form in the Gaikwad Oriental Library, Baroda.

Vaimanika Sastra was printed from two sources:

1. This is with English Translation . It was Translated and Published by GR Josyer, Hon. Director, International Academy of Sanskrit Research, Mysore -4 in the year 1973.

2. This is with Hindi Translation., Translated and Edited by Swami brahmamuni Parivrajak of Gurukul KangadI, Haridvaar. This was publised in 1959 from Saarvadeshika ARya paratinidhi Saha, Dayaananda Bhavan, New Delhi 1 Both are out of stock in the present times.

Regarding other scientific works in Sanskrit serious pursuits are going on all over India. As the sources say the scientific works are not available in independent book form. They are to be searched for with serious intention and keen interest in the volumes of The Four Vedas, Vedangas, 18 Puranas, Astronomical and Astrological Texts and other plethora of books in the Classical Sanskrit Literature.

The Available Telugu or English Translations of Atharva Veda won't help you for your scientific pursuits. To understand and appreciate the contents of it you must learn Sanskrit both Vedic and Classical and .should start understanding for your chosen purpose.

Svasti.

- Dr. Rani Sadasiva Murthy, Associate Professor, R.S. Vidyapeetha, Tirupati


Q162. Gothra: Parashara, Nakshtra: Uttarashada, Name: ShridharaMurthy. Hari Oom, Respected Sir,I am from Mysore District of Karnataka, in our home there are two Saligramas, can you please explain us about the good method of pooja to be performed to Saligramas and also inform the necessary mantras to be chanted at the time of Saligrama Pooja. I heard that next Pushkara would be at Godavari River, can you please tell the date of Pushkara and the steps to be followed at the time of Pushkara. Kindly answer to this questions either in Kannada or in English.

- Thanking you, HRS Murthy

Answer: Before worshiping the Saligrama we should determine whether the saligrama we possess is a good one or not. Its color and other characteristics. Usually a Saligrama is available in four colours. If it is in WHITE color it REMOVES SINS. If it is YELLOW in color it bestows MALE CHILDREN. If it is in BLACK color it fetches WEALTH. If it is RED in color it causes diseases. IF it is coarse in touch with broken sides or face one should not possess it with him. If it is not a plain one and crooked in shape it results in dreadful poverty.

There are different Saligramas with names depending on the number of Chakras in it : 1.Sudarsana saligrama, (with one Chakra) 2. LakshmiNarayana Saligrama, (With two Chakras) 3. Acchyuta Saligrama, (With Three Chakras) 4. Janardana Saligrama, (With Four Chakras) 5. Vasudeva sAligrama, (With Five Chakras) 6. Pradyumna Saligrama, (With Six Chakras)7. Sankarshana (7 Chakras) 8.Purushottama, (8 Chakras) 9. Navavyuha (9 Chakras) 10. Dasatmaka (10 Chakras) 11. Aniruddha (11 Chakras) 12. Dvadasaatmaka (12 Chakras). 13. Anatha (If it has more than 12 to any number of Chakras).

The Worshiping process also varies from one type to the other. It should be known from your nearest Veda pandits.

Godavari Pushkarams begin on 14th of July 2015. In the Godavari Pushkara time 1. Sankapla , 2. Snaanam in the River Godavari 3. Suvarna Danam are the three best things to be done with the help of any reliable priest.

Svasti.

- Dr. Rani Sadasiva Murthy, Associate Professor, R.S. Vidyapeetha, Tirupati


Q163. Where do we have to bath on the day of Magh Maasam Pournami at Venkatachala Kshetram. Is it Kumara Dhara or Rama Krishna Theerdam? Please clarify my Doubt. - Thanks, Karthik Kanumuri

Answer: According to Vashnava Agamas On the Purnima Day with Makha Star in the Kumbha Masa one should take his/her sacred Bathings in Kumara Dhara Tirtham. On that day all the 3 and half crores of Tirthas in the entire Universe come and join in Kumara Dhara Tirtha. Hence this occasion is called as Kumara Dhara Tirtha Mukkoti. So after a Holy Bath on this occasion in this Tirtha one should perform DANAM to Deserved and have the Darsan of Srivenkateswara at Tirumala.

Svasti.

- Dr. Rani Sadasiva Murthy, Associate Professor, R.S. Vidyapeetha, Tirupati


Q164. వేదవిచారసరణి కోఆర్డినేటర్ గారికి నమస్కారం. మీ వేదవిశ్వవిద్యాలయం వేదవిచారసరణిద్వారా జ్ఞానాన్ని పంచిపెడుతోంది అనటంలో సందేహంలేదు. నాకు ఉన్న ఈ ప్రశ్నలకు సమాధానాలను అందజేయగలరని ఆశిస్తున్నాను.

౧. సంకల్పంలో జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అని చెబుతారు కదా .. వాటి హద్దులేమిటి? ఎన్నిద్వీపాలు ఉన్నాయి? ఎన్ని వర్షాలు ఉన్నాయి? చెప్పగలరు?

౨. సంకల్పంలో చెప్పుకునే కాలమానం వివరాలు తెలియజేయగలరు?

౩. పంచాంగం అంటే తిథి, వారం మొదలగు వివరాలు ఉండేవి అంటారు కదా? మనం ఏదైనా కొత్త పని మొదలు పెట్టేటప్పుడు తిథి చూడాలా? వారం చూడాలా? ఏది ఎక్కువ ముఖ్యం? దుర్ముహూర్తాలలో శుభకార్యాలు చేస్తే ఏమవుతుంది?

దయచేసి ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలరు. - ఇట్లు, కౌముది స్వయంపాకుల, విజయవాడ

Answer: మీరు ఒకే లేఖలో చాలా దీర్ఘ ప్రశ్నలు అడిగారు. ఒక్కొక్క ప్రశ్నకు సమాధానాలు ఇలా చూడవచ్చు.

౧. మన పురాణములలో బ్రహ్మాండవివరణము గురించి విస్తారంగా ఉన్నది. అక్కడ భువనకోశాధ్యాయంలో చెప్పిన విధంగా - జంబూద్వీపము, శాకద్వీపము, కుశద్వీపము, శాల్మలిద్వీపము, క్రౌంచద్వీపము, గోమేదద్వీపము, పుష్కరద్వీపము అని ఏడుద్వీపములతో కూడినది ధృవమండలపర్యంతమూ వ్యాప్తమైన ఈవిశ్వము. దీనికే మహాభూమి అని పేరు. మనము నివసించుచున్న భూమినుండి మొదలు పెట్టి ధృవమండలము వరకూ గల ఈ మహాభూమికి ఇరుసుకీల వలె ఈ సప్తద్వీపములగుండా వ్యాపించి ఉన్నది మేరు పర్వతము. ఆ పర్వతమున అగ్రభాగమున ధృవమండలమును దాటి ఉన్నవి కైలాసము, సత్యలోకము, వైకుంఠము మరియు జగన్మాత శ్రీపురము. ఆ వర్ణనమే మనకు బ్రహ్మాండపురాణములో కూడా ఉన్నది. "సుమేరుశృంగమధ్యస్థా శ్రీమన్నగరనాయికా" అన్న లలితా సహస్రనామ హృదయం కూడా ఇదే.

ఈ ఏడు ద్వీపములకూ చుట్టూ క్రమంగా - లవణ సముద్రము, ఇక్షుసముద్రము, సురా సముద్రము, నేతి సముద్రము, దధి సముద్రము, పాల సముద్రము, శుద్ధజలసముద్రము ఉన్నవని పురాణములు చెప్పుచున్నవి. ఈ ఏడు ద్వీపములు మనము నివశిస్తున్న భూమండలంలోనే ఉన్నాయని కొందరి పండితుల అభిప్రాయం. అయితే ఇక్కడ ఆలోచింపవలసిన విషయం ఒకటి ఉన్నది.

ఏకేన సముద్రేన వలయిత: ఏక: ద్వీప: అని పురాణములు ద్వీపములకి ఇచ్చిన నిర్వచనం. దాని ప్రకారం మన భూమండలం చుట్టూ కేవలం లవణసముద్రమే ఉన్నది కాని ఇతర సముద్రములు లేవు. కనుకనే కాశీమొదలైన పుణ్యక్షేత్రాలలో పండితులు నిత్య సంకల్పంలో "జంబూద్వీపే భూలోకే భరతవర్షే భరతఖండే..."అని చెబుతారు. వారి అబిప్రాయప్రకారం భూలోకంలో జంబూద్వీపం లేదు. జంబూద్వీపంలోనే భూలోకం ఉన్నది. ఇక జంబూద్వీపంలోని ప్రధాన విభాగములకు వర్షములు అని పేరు. అవి తొమ్మిది.

భరతవర్షము, హరివర్షము, కింపురుష వర్షము, కేతుమాల వర్షము, భద్రాశ్వవర్షము, ఉత్తరకురువర్షము, రమ్యకవర్శము, హైరణ్యకవర్షము, - ఈ ఎనిమిది వర్షములకు మధ్యలో ఇలా వృతవర్షము అనేవి ఉన్నవి. వీటిలో భరతవర్షంలో - ఇంద్రద్వీపము, కశేరు ద్వీపము, తామ్రపర్ణిద్వీపము, గభస్తిమాన్ ద్వీపము, నాగద్వీపము, సౌమ్యద్వీపము, వారునద్వీపము, గంధర్వద్వీపము, వారుణద్వీపము, భరతద్వీపము అనేవి తొమ్మిది ఉన్నవి. భారతవర్షములోని ఈ తొమ్మిది ద్వీపములకే ఖండములని పేరు. వీటిలో ప్రధానమైనది భారతీయులమైన మనం నివసించుచున్నది భరతఖండం. ఇది ఉత్తరమున కిరాతదేశము హద్దుగా కలిగిన హిమవత్పర్వతములనుండి దక్షిణమున సింహళద్వీపము వరకు గల భూభాగమునకు భరతఖండమని పేరు. ఇది మాత్రమే సమస్త బ్రహ్మాండములలో కర్మభూమిగా ప్రసిద్ధి చెందినది. మిగిలినవన్నీ భోగభూములు మాత్రమే. ఈ భరతఖండములో చేసిన పుణ్యకార్యములు మాత్రమే అనంతసత్ఫలదాయకములని పురాణములు, ధర్మశాస్త్రములు భోధించుచున్నవి.

మనం నిత్యకర్మలలో చెప్పుకునే సంకల్పంలో దేశ సంకీర్తనం తరువాత ప్రస్తావించుకునేది కాలసంకీర్తనం. ఒక రెప్పపాటు కాలం అతి చిన్న కాలప్రమాణమయితే -

౨౪ రెప్పపాటులు - ౧ విఘడియ

౬౦ విఘడియలు ౧ ఘడియ (౨౪ నిముషాలు)

౬౦ ఘడియలు - ౧ రోజు

౭ రోజులు - ౧ సప్తాహం

౧౫ రోజులు - ౧ పక్షం

౩౦ రోజులు - ఒక మాసం

౧౨ మాసములు - ౧ సంవత్సరం లేక రెండు అయనములు (ఉత్తరాయణం, దక్షిణాయనం కలిపి)

౪,౩౨,౦౦౦ సంవత్సరాలు - కలియుగం ౮,౬౪,౦౦౦ సంవత్సరాలు - ద్వాపరయుగం,

౧౨,౯౬,౦౦౦ సంవత్సరాలు - త్రేతాయుగం, ౧౭,౨౮,౦౦౦ సంవత్సరాలు - కృతయుగం

ఈ నాలుగు యుగాలు కలిపి - ౪౩,౨౦,౦౦౦ సంవత్సరాలు - ౧ మహాయుగం

౧౦౦౦ మహాయుగాలు బ్రహ్మకు ఒక పగటికాలం. దీనికే ఒక కల్పమని పేరు.

బ్రహ్మగారి పగటికి సమానమైన కాలం బ్రహ్మకు ఒక రాత్రి.

కనుక బ్రహ్మమానంలో ఒక అహోరాత్రమంటే ౨౦౦౦ మహాయుగాలన్నమాట.

ఇలాంటి అహోరాత్రాలు ౩౬౦ అయితే బ్రహ్మకు ౧ సంవత్సరం. ఇలాంటివి ౫౦ బ్రహ్మసంవత్సరాలైతే బ్రహ్మా ఆయుర్దాయంలో ఒక పరార్థం. ఇప్పుడు మనం బ్రహ్మ ఆయుర్దాయంలో ద్వితీయ పరార్థఆరంభంలో ఉన్నాం. అంటే బ్రహ్మగారి ఆయుర్దాయంలో ౫౧ వ సంవత్సర ప్రారంభంలో ఉన్నాము. ఇదీ మన సంకల్పంలోనీ కాల సంకీర్తనం. ఇక మీరడిగిన ముహూర్తవిషయానికి ప్రత్యేకంగా సమాధానం మరొక ప్రశ్నగా ఇస్తాం.

Svasti.

- Dr. Rani Sadasiva Murthy, Associate Professor, R.S. Vidyapeetha, Tirupati


Q165. Dear Sir, When I was watching TTD channel I read the captioned advertisement. Gowsamrakshaka, BIRD and Veda Patshala I had sent small donations I had also read that doubts are clarified. Kindly tell us something to relieve from one serious problem My second daughter's marriage has lot of hurdles though she is beautiful, intelligent and hold's good job. Whenever we go for marriage some obstruction occurs. We have visited lot of temples etc We did't get good result. This is my first query. Second query for my second daughter any good mantras to be recited during pregnancy. - With regards and pranams, S Hemavathy

Answer: Regular recitation of Sitakalyana Sarga of Valmiki Ramayana (in Sanskrit Original) and the recitation of the Rukmini Kalyana Ghattam of Sri Potana's Andhra Bhagavatam may help for the marriage of your daughter with out any hurdles. It is proved in many houses in similar instances.

Sri Durga Apaduddharaka Stotra parayanam and Sri Sundarakanda parayanam for forty days will remove all kinds of obstacles and any kinds of Problems related to pregnancy also.

Svasti.

- Dr. Rani Sadasiva Murthy, Associate Professor, R.S. Vidyapeetha, Tirupati


Q166. sir what is brahma sutra.Recently i saw a video of islam claiming that both islam and hinduism are alike as islam says to worship only one god and he gave the same meaning of a sloka \93Ekam Evadvitiyam" and "Ekam Brahm, dvitiya naste neh na naste kinchan\94 and he also says that allah is mentioned in alo upanishad.Are these things true.Is allah mentioned in vedas or upanishads.Do our vedas are against idol worship.Please share the actual facts in vedas.is the word MATAM mentioned in our sacred texts.How did this word emerge. - Thank You

Answer: To answer this question one has to take many aspects into consideration. Mere resemblance in thoughts does not support oneness of any two things. Monotheism and Polytheism are commonly seen in many world civilized traditions such as Greek and other places too. Just because of such similarities Islam and Veda Dharma need not be said to be the same. Even if both have several similarities neither of the too does accept the domination or agreement of the other one. Allopanishad is not an old writing. The word ALLAH is nowhere clearly spoken of in the Vedic literature. As far as the word MATAM is related it stands for any religious Doctrine or Tenet or Creed or Religious Belief. Can any muslims are ready to accept the Vedic Rituals and teachings just because of the similarity in Thoughts?

Svasti.

- Dr. Rani Sadasiva Murthy, Associate Professor, R.S. Vidyapeetha, Tirupati


Q167. శ్రీ గురుభ్యోన్నమః! అయ్యా, నారాయణ-అష్టాక్షరి కాని శివ-పంచాక్షరి కాని , జపము చేయడానికి సమయము, కాలము, ఆసనము మరియు శౌచము అవసరమా . లేక ఎప్పుడైనా ఎలాగైనా అంటే నడుస్తూ , పనిచేస్తూ స్మరించవచ్చా

Answer: శ్రీమన్నారాయణ అష్టాక్షరి, శివపంచాక్షరి బీజాక్శరసమన్వితంగా గురుముఖంగా ఉపదేశింపబడితే అప్పుడు నిర్ణీత కాలంలో, శుచి అయిన ప్రదేశంలో స్నాన, సంధ్యావందనాది విధులను నిర్వర్తించి ఆ పైన జప ప్రక్రియలో జపించాలి. మంచాన పడినవారైతే ఎప్పుడైనా చెయ్యవచ్చు. వారి జపవిధానాన్ని ’ఆతురీ" జపమని చెబుతారు. ప్రయాణంలో ఉన్నవారు కూడా తమకు అందినంతవరకు సామగ్రిని సిద్ధంచేసుకుని జపం చెయ్యాలి. ఆ జపాన్ని సాధనా భావనీ అంటారు. భయస్థులు పులుల వల్లనో, లేక దుష్టమృగాలవల్లనో భయం ఏర్పడితే పరుగెడుతూ కూడా జపించ వచ్చునట. ఆ విధమైన భయాన్ని "త్రాసీ" అంటారు. ఆరోగ్యంగా ఉన్నవారు మాత్రం త్రిసంధ్యలలో నియమబద్ధంగానే జపమాచరింపాలి.

Svasti.

- Dr. Rani Sadasiva Murthy, Associate Professor, R.S. Vidyapeetha, Tirupati


Q168. Sir Namaste! I am Lalam Venkata Satya Trinadh from Hyderabad, want to know that I have a doubt from very long, while watching the svvb chanel there is a scrolling that any doubt can be send for clarity. I have a doubt that "From the Stone age or before how the people worship the god. is there any evidence. from appe to human being stage how people pray, even they do not know any thing or to think for god that stage, when did our Puranas and guru's vishwamitra and vedvyasa came. after getting civilize only the mantras and vedas born or before". Please clarify me. I am purely hindu and I am dharmik person, and I am not criticizing anybody. just want to know above the said. Please reply me as earliest to this mail id. -Thank you sir, Regards, L V S Trinadh

Answer: In your question two historical theories of two different traditions are clubbed together. This causes lot of confusion. The Ice Age, Axial Age, Stone Age, Paleolithic Age, Neolithic Age etc. are some stages in human development according to Western Anthropology and Western historical divisions. According to the Theory of Evolution of Darwin The Ape of ancient times transformed into a man. But the later and the latest Anthropologists of West in very clear terms deny the validity of this Darwinian Theory. Basing on such invalid Darwinian Theory if we have to say that the Man of present is the heir of the Apes of Stone Age we may have to answer many questions in this direction.

According to our Indian system of historical theories available in the Vedic, Pauranic and Epic sections the present creation, in which we are all parts and parcels, took place 197 crores of years ago and will still continue to an extent of 203 crores of years further. This calculation of our ancient seers has a very clear agreement with the TIME LINE OF BIG BANG THEORY of modern scientists.

So according to our ancient traditional theories VISVAMITRA belongs to Treta Yuga and VYASA belongs to Dvapara Yuga according to Ancient Indian TIME SCALE. Human civilization from Indian view point is as old as the creation. Ape to Man transformation is not an accepted notion. Manu the Son of the Sun who was the first human being in the universe wrote MANUSMRITI the HUMAN CODE of CONDUCT which ever-astonishing treatise guiding the human civilization of all times belongs to the beginning of the present Creation. That old was our Indian civilization.

Svasti.

- Dr. Rani Sadasiva Murthy, Associate Professor, R.S. Vidyapeetha, Tirupati


Q169. Respected Sir, In which Khandam of Ramayan we can see Rama Geetha. What it deals with and to whom it is preached. How many shlokas are there in it? What is the substance of Rama Geetha, whether any similiarity with Bhavath Geetha? Kindly enlighten me Sir. - Thanking you, RAGHAVAN, Bangalore, Karnataka.

Rama Gita is not a part of Valmiki Ramayana. But it is the 5th Chapter of Uttarakanada of Adhyatma Ramayana. It has totally 62 Slokas in it. It is a very small work on Vedanta doctrine. It was the spiritual discourse by Rama imparting the knowledge highest to his younger brother Lakshmana. In this tiny treatise an excellent way of attaining Moksha through a logical sequence of steps to be followed by a Moksha seeker are explained. Though there is verbal agreement between Bhagavadgita and Ramagita regarding the words like Youga, Pranava, Moksha, Jiva, Parmatman etc., this text has no resemblance with Bhagavadgita in its purport. This is an excellent elucidation of Karma, Yoga, Dhyana,Bhakti and Jnana in attaining Moksha.

Svasti.

- Dr. Rani Sadasiva Murthy, Associate Professor, R.S. Vidyapeetha, Tirupati


Q170. Swamina:! Ananta saashtaanga pranamas. this is indeed an excellent initiative and i welcome the same. i have a small question. Yajur Brahmanam says "Tasmaat samudrasya na pibanti". could you please enlighten me as to why the waters of the sea should not be drunk? i am unable to understand the sentences which precede the aforesaid vaakyam. i shall be grateful for your clarification. - dasan, sadagopan

Answer: యజుర్వేదమందు జగత్సృష్టిప్రస్తావమునందు సముద్రోత్పత్తిగురించి చెప్పబడింది, అక్కడ ప్రాసంగికముగా తస్మాత్ సముద్రస్య న పిబంతి అని వాక్యముకలదు, దానికి ఇది భావము –

పరమేశ్వరుడు జగత్సృష్టి చేయదలచి అందు నిమిత్తము తీవ్రమైన తపస్సు చేసెను, తపఃప్రభావముచేత స్వసంకల్పానుసారం మొదట ధూమము జనించెను, తరువాత అగ్ని, ప్రకాశము,జ్వాల మొదలగునవి జనించెను. ఇవన్నీ కలిసి సంఘాతము ఘనీభూతమైనది, ఈ ఘనీభూతమైన వస్తువు పరమాత్మకు మూత్రాశయముతో సమానమాయొను. సృష్టికి పూర్వము దానినుండి పయల్పడిన నీరు సముద్రముగా ఆవిర్భవించెను గాన శిష్టులు సముద్రజలమును శిశుజననమునకు ముందు వచ్చు గర్భాశమునందు జలమువలే అస్పృశ్యముగాభావించి సేవించదగనిదిగా పరిగణించెదరు, కాని ఇదిచూచి సముద్రము, సముద్రోదకమును హేయముగా భావించరాదు. సముద్రమునుగురించి చాలా వైజ్ఞానికమైన వృత్తాంతము వేదములయందు నిగూఢముగా వున్నది. సముద్రములు, సముద్రజలములు మొత్తంజగత్తుసృష్టికి కారణములు, సముద్రములు ఏడు విధములు వాటియొక్క ఘనీభూతాంశములే సప్తద్వీపములాయెను అవి ఎలా అయినవి అని ఈ చిన్నలేఖలో వివరించ వీలుకాదు మొత్తంమీద క్షీర,దధి,ఘృత, మధు,లవణాది సముద్రములు ఆవిర్భవించెను, వానిలో లవణసముద్రజలము మాత్రమే పానార్హము కాదు. వేదవాక్యములోని సారాంశములు అనంతముగా ఉండును మరియు అతి నిగూఢము అతిగంభీరములుగా ఉండును సమస్తవిజ్ఞానము వేదమునుండియే విచ్చినది గనుక మీకు అపేక్షితమైనంతవరకు ఇందు గ్రహించి తరించగలరు.

- Dr.K.V.Hanumanth Sharma, SVVU, Tirupati


Q171. వేదవిచారసరణి కోఆర్డినేటర్ గారికి నమస్కారం. మీ వేదవిశ్వవిద్యాలయం వేదవిచారసరణిద్వారా జ్ఞానాన్ని పంచిపెడుతోంది అనటంలో సందేహంలేదు. నాకు ఉన్న ఈ ప్రశ్నలకు సమాధానాలను అందజేయగలరని ఆశిస్తున్నాను.

౧. సంకల్పంలో జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అని చెబుతారు కదా .. వాటి హద్దులేమిటి? ఎన్నిద్వీపాలు ఉన్నాయి? ఎన్ని వర్షాలు ఉన్నాయి? చెప్పగలరు?

౨. సంకల్పంలో చెప్పుకునే కాలమానం వివరాలు తెలియజేయగలరు?

౩. పంచాంగం అంటే తిథి, వారం మొదలగు వివరాలు ఉండేవి అంటారు కదా? మనం ఏదైనా కొత్త పని మొదలు పెట్టేటప్పుడు తిథి చూడాలా? వారం చూడాలా? ఏది ఎక్కువ ముఖ్యం? దుర్ముహూర్తాలలో శుభకార్యాలు చేస్తే ఏమవుతుంది?

దయచేసి ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలరు. - ఇట్లు, కౌముది స్వయంపాకుల, విజయవాడ

Answer: మీరు అడిగిన రెండు ప్రశ్నలకు ముందుగా సమాధానం చెప్పి ఉన్నాం. మీ మూడవ ప్రశ్నకు సమాధానం ఇక్కడ తెలుసుకుందాం. పంచాంగం అంటే తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణమనే అయిదింటికి సమష్టి నామధేయం. మనకు కన్ను, ముక్కు, నోరు, ఇతర అవయవాలలో ఏ అవయవం ముఖ్యం, ఏ అవయవం ముఖ్యం కాదు అంటే మనం ఏం సమాధానమిస్తాం? అలాగే కాలపురుషునికి కూడా ఈ పంచాంగములు ముఖ్యమే. అయితే మనం చేసే పనులను బట్టి కొన్నిచోట్ల వారం ప్రధానం. కొన్ని చోట్ల తిథి ప్రధానం. కొన్నిచోట్ల నక్షత్రం ప్రధానం. అలాగే యోగకరణాలుకూడా మనం చేసే పనులమీద ప్రభావాన్ని చూపుతాయి. అయితే తిథి, నక్షత్రం, లగ్నాలవిషయంలో మాత్రం - తిథిరేకగుణం ప్రోక్తం, నక్షత్రం దశగుణాన్వితం.. లగ్నంతు కోటి గుణితమ్... ఇత్యాది శాస్త్రవాక్యంలో చెప్పిన విధంగా తిథి ప్రభావం ఒక పాలైతే మంచి నక్షత్రం దానికన్న ౧౦ రెట్లు గొప్పదట. మంచి లగ్నం ఈ రెండింటికన్న కోటి రెట్లు గొప్పదట. అందుచేత వివాహాదులలో నక్షత్రం బాగుండకపోయినా, తిథి సామాన్యంగా ఉన్నా లగ్నం కనుక అత్యుత్తమంగా ఉంటే అది గొప్పదిగా వర్ణించారు. అందుచేతనే సామాన్యులలో కూడ పెళ్ళీ విషయం లో ముహూర్తాలను లగ్గసరులు అంటారు.

ఇక వారాలు, తిథుల విషయం లో చూస్తే మంచివారం, మంచి తిథి రెండూ అవసరమే. అయితే తిథి ఎంతబాగున్నా బుధవారం నాడు మాత్రం దీర్ఘవ్యాధులతో బాధపడేవారు చికిత్సనిమిత్తం ఆస్పత్రిలో చేరకూడదని శాస్త్రం చెబుతున్నది. అలా చేరితే ఆ రోగి ఇంటికి తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువ. అలాగే తిథి బాగున్నా ఆది, సోమ, మంగళ, శని వారాలలో కొత్తబట్టలు కట్టుకోకూడదు. ఆదివారంనాడు కట్టుకుంటే ఆ వస్త్రం త్వరగా వెలిసి పోతుందట. సోమవారం నాడు కట్టిన బట్ట ఎప్పుడూ నీటిలో నానుతూనే ఉంటుందట. మంగళవారం నాడు కట్టుకుంటే ఆ వస్త్రం త్వరగా చిరిగిపోతుందట. లేదా కొర్రులు పడుతుందట. శనివారం నాడు కట్టుకుంటే అది ఎప్పుడూ మాసిపోతూనే ఉంటుంది. ఇలా వారానికి కొన్ని మంచి పనులకూ సంబంధం ఉన్నది. సాధారణంగా అన్ని శుభకార్యాలకు విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశీ, త్రయోదశీ మంచివని శాస్త్రం చెబుతున్నది. మిగిలిన తిథులలో పని చేసే టప్పుడు ఇతరవిషయాలను దృష్టిలో ఉంచుకుని చేస్తే మంచిది. ఇక దుర్ముహూర్తంలో శుభకార్యం చేస్తే ఏమవుతుంది? అనే చివరి ప్రశ్నకు సమాధానం. ఆ దుర్ముహూర్తం ఎంతతీవ్రంగా ఉన్నది అనే అంశం పై ఫలితం ఆధారపడిఉంటుంది. ముహూర్తం తీవ్రంగా ఉంటే ప్రాణాపాయం కూడా కలుగవచ్చు. ఒక మాదిరి తీవ్రంగా ఉంటే మనకు జరిగే హాని వల్ల శత్రువులు ఆనందిస్తారు. సామాన్యంగా ఉంటే కార్యవిలంబం ఉంటుంది. ఇవన్నీ దైవజ్ఞులనుంచి తెలుసుకుని మనం పనులను చేస్తూ ఉండాలి.

Svasti.

- Dr. Rani Sadasiva Murthy, Associate Professor, R.S. Vidyapeetha, Tirupati


Q172. Sirs, Even SAstragna-s seem to differ on the AdhikAra of ladies to chant VishnusahasranAmam. Shri Sundarakumar, PourAnika has stated that ladies can not chant VishnusahasranAmam, whereas Kesava Dikshitar( grand son of AnantarAma Dikshitar) says there is no bar on ladies chanting VishnusahasranAmam. What is the correct position in the matter? Pl. elucidate.

- G.Balasubramanian

Answer: The following are the reasons on the basis of which the Adhikara of Women to recite Vishunsahasranama can be supported.

1. Vishnusahasranama is a part of Mahabharata of Bhagavan Veda Vyasa. Mahabharata is one of the two Itihasas of our tradition.The Two Itihasas and 18 Puranas are meant for the regular recital of all including women. Hence as a part of the Mahabharata Vishnu Sahasra Nama also can be recited by women.

2. As it was explained in the Phala Sruti Vishnu Sahasara Nama Stotram was imparted to Parvati by Siva. If women were prohibited from the recital of Vishnu Sahasra Nama how could it be imparted to Her?

3. Perhaps the lines like:

యద్భక్త్యా పుండరీకాక్షం స్తవైరర్చేన్నర: సదా

య ఇదం శృణుయాన్నిత్యం యశ్చాపి పరికీర్తయేత్ |

నాశుభం ప్రాప్నుయాత్ కించిత్ సో౭ముత్రే హ చ మానవ:||

might have misled the people to declare that these are meant for men only. But here the words Nara and Manava are gender free. So this meant for all human beings.

4. Nowhere in the Vishnu sahasranama stotra there is any prohibition of This Stotra from being recited by women.

So women can recite this.

Svasti.

- Dr. Rani Sadasiva Murthy, Associate Professor, R.S. Vidyapeetha, Tirupati


Q173. I would like to know the name of mrs. mandanamithra who was participated as compititor with Adi shankara plz. reply/respond - K. Ramakrishna

Answer: First there is a correction in the name of her Husband. He is MANDANA MISHRA and not MANDANA MITHRA. And her name as found in Sankara Digvijaya of Sri Madhavacharya is SARADA. In some Telugu Translations her name is mentioned as Ubhaya Bharati Devi. She is said to be the incarnation of Goddess Sarasvati. So SARADA or BHARATHI are both befitting to her.

Svasti.

- Dr. Rani Sadasiva Murthy, Associate Professor, R.S. Vidyapeetha, Tirupati


Q174. Poojyalina Sastrygariki Padabivandanamulu

I came to know that, Srivari Sahastranamamu is published in OCTOBER 2007 ( this is different than Sri Vishnu Sahasranamamu). I will be very much thankful to you if you can arrange to send the same.

In some Sri Venkateswara Temple Kalyanotsava is done with Godess Mahalakshmi as well as Padmavathi. In some temples Lord Sri Venkateswara is arranged already with two godesses and kalyanotsava is done with other Godess (3rd Godess) please clarify

for Lord Srinivasa Star is told as Sravana and Rushi as Bharadwaja What about Godess Sridevi and Boodevi please inform

For Lord Varaha, Narasimha, Vadiraja, Ranganatha (Lord Vishnu Avathara Gods) they will be mentioning Sree Devi and Bhudevi as Godess. Sreedevi referred as Mahalakshmi. Clarify for Bhudevi

Why Sudarshana Chakrattalvar alone immersed in Pushkarani Tirtham. Lord Srinivasa, Padmavathi and Mahalakshmi are not taken for immersing

it is published that Abishekham for lord Srinivasa on Friday only. Why only one day is selected, whether other days of the week abhishekham is done or not

What is the mythological importance of MIRIYALU in Srivari Prasadams

Answer: In this question there are again many supplementary questions.

1. Sri Venkateswara Sahasra Namavali. This book was published by TTD and is available in TTD publications. You can try through any individuals you know in Tirupati. Yes... Sri Venkateswara Sahasra namavali is different from Sri Vishnu Sahasra nama stotra.

2. In different temples they may celebrate Srinivasa Kalyana in different ways. But the way in which Tirumala it is celebrated is authentic. There the Kalyanotsava is performed for Sri Venkateswara Swami varu with Sri Devi and Bhu Devi.

3. The Gotra Pravaras of Srinivasa, Sri Devi and Bhudevi are:

a) Of Srinivasa - Aangirasa, Baarhspatya, Bhaaradhvaja trayaarSheya Pravaranvitah Bhaaradhvajasa gotrah - Srinivasah.

b) Bhaargava - Chyaavana - Aapnava - Aurva - Vaidala - pancharsheya pravaraanvitaa - Bhaargava sagotrodbhavaa - Sri Devi

c) Kaasyapa - Aavatsaara - Naidhrva - trayaarsheya pravaraanvitaa - Kashyapasagotrodbhavaa - Bhu Devi

4. In the year 614 AD on FRIDAY The Queen of Pallavas SAMAVAI or PERINDEVI offered the Silver Idol of BHOGA SRINIVASA MURTI to the TIRUMALA TEMPLE. Ever since on every Friday they used to perform Abhisheka Snana to MULA VIRAAT along with Bhoga Srinivasa.

This tradition was after a few centuries during the visit of Bhagavad Ramanuja Acharya revived on an occasion when SWAMIJI offered THE GOLDEN IDOL of ALARMEL MANGAMMA. Ever since till date on every FRIDAY the performance of ABHISHEKA to MULA VIRAAT or DHRVA BERA has become a regular feature in the temple.

5. Chakra snana: During Brahmotsavas and on Ratha saptami the festival of Chakra Snana is celebrated on the Tirumala Hills. The reason as found in the Puranas is that - Sri Sudarsana very faithfully serves Lord Sri Venkateswara and also protects the true devotees of Srinivasa through out the year who ever reaches the Tirumala Hills. So Srinivasa was very much pleased with the services of Sri Sudarsana and graced him with the boon that on some special occasions on the banks of Svami Pushkarini whenever there is Abhiseka of Srinivasa along with Sridevi and Bhudevi there will be Abhisheka Vidhi to Sudarsana Chakrattalvar also and after the Abhisheka Vidhi Sri Sudarsana Svami will have a holy dip in the Pushkarini to purify the sinful pollution of the Pushkarini that has been accumulated through the snanavidhi of thousands of Bhaktas.

Svasti.

- Dr. Rani Sadasiva Murthy, Associate Professor, R.S. Vidyapeetha, Tirupati


Q175. what is nirnaya sindhu? does it apply common to all siddhanthas or particular siddhantha? please also explain dharma connection to arrive a point of nirnaya sindhu. tks. in anticipation regards. a sadhak - Raghavendra

Answer: Nirnaya Sindhu is a Dharma Sastra Text written by Sri Kamalakara Bhatta. It is compilation with authentic quotations from all earlier Dharma Sastra Texts to guide all kinds of socio-ritualistic needs. It helps in clearing all kinds of differences of opinions in connection with Tithi, Vara, Nakshatra and other aspects of celebrating different festivals. Further it helps in giving us the process of all the Sixteen Samskaras. Similarly it clears all doubts pertaining to Code of Conduct in Brahmacarya (Celibacy) , Garhasthya (House Holders' Stage) , Vanaprastha (Forest Dwelling ) and Sanyasa (Monkhood) Stages of life.

Svasti.

- Dr. Rani Sadasiva Murthy, Associate Professor, R.S. Vidyapeetha, Tirupati


Q176. Sir, namasthe. This is praveen kumar from hyd. My doubt is what is agamam. Is their any difference between smartha agamam and shiva agamam. A brahmin poojari is eligible to do shiva pooja or not. Sir plz clarify my doubts. If there is possibility plz send me the mail.

- praveen kumar

Answer: ఆగమములు మూడు విధములు. శైవ, వైఖానస,పాంచరాత్ర,ఆగమములు ప్రాచురములోనున్నవి – శాక్తేయవిధానము తంత్రసారములు కూడా కలవు. పై ఆగమోక్తదేవాలయములందు ఆగమములద్వారా ప్రతిష్ఠింపబడిన బింబములకు ఆయా ఆగమోక్త విధానముగా నిత్య పూజ,విశేష ఉత్సవాదులను నిర్వహించవలెను. కనుక ఆయా ఆగమసంబంధము కల అర్చకులే ఆయా అర్చనాదులు నిర్వహించగలరు –

ఇక వైదికపద్దతిద్వారా బోధాయన,పరాశరాది మహార్షులద్వారా సూత్రములయందు, స్మృతిగ్రన్థములయందు – పేర్కోనబడిన విధముగా ప్రతిష్ఠించిన బింబములందు –వైదిక పద్దతిద్వారా విధివిధానములు తెలుసుకొని అర్చనాదులు నిర్వహించ వచ్చును.

పైవిషయములు దేవాలయ సంబంధములు. గృహములో అర్చనకొరకు ఎవరిసాంప్రదాయముననుసరించి వారు సాలగ్రామ, ప్రతిమ,చిత్ర, పుస్తకాదులయందు ఆ యాదేవతలను పూజించవచ్చును.

Svasti.

- Dr. Rani Sadasiva Murthy, Associate Professor, R.S. Vidyapeetha, Tirupati


Q177. 1. పితృదేవతలు హోమములు గురించి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మగారు స్వధానమస్తర్పయామి అని చెప్పినారు. వారు 30 మంది దేవతలు యున్నారట. మరియు ఆ దేవతల తాలూకా పేర్లు వారికి హోమములు చేయవలెను అన్నా ఏ విధముగా చేయవలయును.

2. నచికేతాగ్ని ఏ విధముగా చేయవలయును, ఆ విషయము కఠోపనిషత్తులో యమధర్మరాజు నచికేతునుకి సంవాదములో విరముఇచ్చినారు . ఇవి కూడా ఏ మంత్రములు ,ఏ విధముగా చేయవలయును.

ది చైర్మన్, శ్రీ సీతారామ దేవస్థానము, సాలూరు, విజయనగరం జిల్లా

Answer:

వసుసత్యౌ క్రతుదక్షౌ కాలకామౌ ధృతి: కురు:|

పురూరవా మాద్రవాశ్చ విశ్వేదేవా ప్రకీర్తితా:||

అని భరతవచనం

వసువు, సత్యము, క్రతువు, దక్షుడు, కాలుడు, కాముడు, ధృతి, కురువు, పురూరవులు, మాద్రవులు అనుపదిమందికి విశ్వేదేవతలని పేరు. వీరికి తోడు లోచీమని లేక రోచనుడు మరియు ధూర్వి అని మరి ఇద్దరు కూడ విశ్వే దేవతలుగా కీర్తింపబడుతున్నారు. దక్షుని కుమార్తె అగు విశ్వా అను నామె సంతానము కనుక వీరికి విశ్వే దేవతలు అని పేరు వచ్చినది.

వీరిలో - కాలుడు - ప్రేతకార్యమందు; కాముకుడు - ప్రేతకార్యపూజయందు; పురూరవ - ప్రత్యాబ్దికములందు; ఆర్ద్రవ లేక మాద్రవ - ప్రత్యాబ్దికములందు; ధూర్వి - మహాలయ శ్రాద్ధమునందు; లోచీమని - మహాలయ శ్రాద్ధమందు; సత్యుడు - నాందీశ్రాద్ధమందు; వసుడు - నాందీ శ్రాద్ధపూజలోను; క్రతుడు - యజ్ఞమునందు; దక్షుడు - యజ్ఞపూజలోను అర్చింపబడుతున్నారు.

వీరుకాక మరి ౩౩ మంది కూడా విశ్వే దెవతలని పిలువ బడుతున్నారు. వీరు సమస్త విశ్వానికి ప్రధాన దేవతలు కనుక వీరిని విశ్వేదేవతలని వ్యవహరిస్తున్నారు.

౧. వరుణుడు ౨. ఋషభుడు ౩. నహుషుడు ౪. ప్రత్యూషుడు ౫. జయుడు ౬. అనిలుడు ౭. విష్ణుడు ౮. ప్రభాసుడు ౯. అజైకపాత్ ౧౦. అహిర్బుధ్న్యుడు ౧౧. విరూపాక్షుడు ౧౨. సురేశ్వరుడు ౧౩. జయంతరుద్రుడు ౧౪. బహురూపరుద్రుడు ౧౫. త్ర్యంబకుడు ౧౬. అపరాజితుడు ౧౭. వైవస్వతరుద్రుడు ౧౮. అర్యముడు ౧౯. మిత్రుడు ౨౦. ఖగుడు ౨౧. అర్కుడు ౨౨. భగుడు ౨౩. ఇంద్రుడు ౨౪.భాస్కరుడు ౨౫. పూషుడు ౨౬. పర్జన్యుడు ౨౭. తృష్ణ ౨౮. విష్ణువు ౨౯. అజుడు ౩౦. ఆదిత్యుడు ౩౧. ప్రజాపతి ౩౨. పావిత్రుడు ౩౩. హరుడు అను వారు.

వీరే కాక మరి పది విధములైన విశ్వేదేవతలు ఉన్నారు. వారు:

యక్షులు, రాక్షసులు, పిశాచములు, గంధర్వులు, అప్సరసలు, అసురులు, నాగులు, సర్పములు, సుపర్ణులు, పితరులు అని.

వీరిలో పితృకార్యములందు విశేషించి ప్రత్యాబ్దికములందు పూజింపబడు వారు పురూరవ్ - ఆర్ద్రవులనబడే వారు మాత్రమే.

Svasti.

- Dr. Rani Sadasiva Murthy, Associate Professor, R.S. Vidyapeetha, Tirupati


Q178. అయ్యా నమస్కారములు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల పుట్టుక ఎలా అయ్యింది . ఎ ఎ పురాణాలలో ఏది వివరివ్చ బడింది. మరియు గోలోకం గురించి వివరింగా తెలియజేయండి - మీ, వేంకటరమణ

Answer: రహ్మ, విష్ణువు, మహేశ్వరుల ఆవిర్భావమును గురించి - మార్కండేయపురాణంలోని దేవీమాహాత్మ్యంలోను, శివమహాపురాణంలో శ్రీవిద్యేశ్వరసంహితలో బ్రహ్మావిష్ణువుల యుద్ధసమయంలో జ్యోతిర్లింగస్వరూపునిగా మహేశ్వరుని ఆవిర్భావసందర్భంలో, దేవీభాగవతంలో మూడవస్కంధము యొక్క ప్రారంభంలోను, స్కందమహాపురాణంలోనూ చాలా విస్తారంగా వర్ణింపబడి ఉన్నది. ఇవికాక సృష్టి విషయంలో అగ్ని, కూర్మ, గరుడ, విష్ణు, లింగ, వామన, నారద, పద్మ, బ్రహ్మ, బ్రహ్మండ, మత్స్యాదిపురాణాలలో చాలా విశదంగా ప్రస్తావించబడింది. ఆ సమయంలో త్రిమూర్తుల అవిర్భావాన్ని గురించి కూడా అక్కడ వివరించబడి ఉన్నది.

గోలోకం గురించి కావాలంటే బ్రహ్మవైవర్తపురాణంలోనూ, హరివంశంలోనూ చూడగలరు. ఇక స్నానప్రాశస్త్యం గురించి ధర్మశాస్త్రగ్రంథాలలో - లఘు హారీతస్మృతిలోనూ, లఘు యమస్మృతిలోనూ, కాత్యాయన స్మృతిలోనూ, శంఖస్మృతిలోను, దక్షస్మృతిలోనూ - మాంత్రస్నానం, ఆగ్నేయ స్నానం, దివ్యస్నానం, భౌమస్నానం, మృత్తికా స్నానం, వాయవీయ స్నానం, కటిపర్యంత, కంఠపర్యంత, శిర: పర్యంత స్నానప్రకారాలు, వాటి విశేషాలు, ఫలాలు, అభ్యంగన స్నానవిధి మొదలైన విశేషాలు వర్ణింపబడిఉన్నాయి.

స్త్రీలు తలస్నానం గంగాది పుణ్యనదులలో సభర్తృకలుగా చేయవచ్చును. అక్కడ రోజుతో నిమిత్తం లేదు. నిత్యస్నానవిధులలో ముత్తయిదువులుగా దీర్ఘకాలం జీవించాలనుకునే మహిళలు శుక్రవారం తలస్నానం చేయాలి అనేది పై స్మృతులలో చెప్పిన మాట. శ్రోత్రియులైన విప్రులు ప్రతినిత్యం శిర:స్నానం చేయవలసిందే. కేవలం రోగాతురులు మాత్రం వారి శక్తిని బట్టి స్నానం చేయవచ్చునని స్మృతులు చెబుతున్నవి. ధర్మసింధువు, నిర్ణయసింధువులలో కూడా స్నానవిశేషాలగురించి తగువిధంగా చెప్పి ఉన్నారు. విశేషించి ఆయుర్వేద గ్రంథాలైన చరకంలో, సుశ్రుతంలో, వాగ్భటంలో కూడా తైల స్నానం, ఓషధీయస్నానవిధి, మొదలైన విశేషాలు చెప్పారు.

Svasti.

- Dr. Rani Sadasiva Murthy, Associate Professor, R.S. Vidyapeetha, Tirupati


Q179. Dear sir, Namasthey.. I saw two types of Dasa.avataram names, especially for 9t. In some books, it is written as Budha, and in some books it is written as Balarama? which one is correct?

As per my knowledge, Balarama is an elder brother of Lord Krishna, how it could be both avataras' in same time.?

If Budha is correct, how it got separated from Hinduism and developed as another religion? or this Budha is different from that Budha?

And also that, though Lord venkateswara is not included in 10.avataras, many of gurus are expressing that Lord venkateswara is after Lord krishna. How it could be?

Regards, Sai Krishna, Visakhapatnam

Answer: Already this question was answered in past with all details but in Telugu. Please find the answer of 60th Question in Vedavicara Sarani. Your doubts can be cleared if you read that answer.

Lord Sri Venkateswara is a separate Avatara from this list. We have the detailed account of Sri Venkateswara Swami in 11 out of 18 Puranas. But no where it is mentioned that Sri Venkateswara is one of the ten popular avataras of Visnu.

Svasti.

- Dr. Rani Sadasiva Murthy, Associate Professor, R.S. Vidyapeetha, Tirupati


Q180. శ్రీమద్ విఖనస గురుభ్యోమ్ నమః! ఆగమ పండితులకు నమస్కారములు. అయ్య, ధనుర్మాసము ప్రారంభించే రోజును కొన్ని ప్రాంతాలలో "నెల గంట పెట్టుట" లేదా "నెల పట్టుట" అని పిలుస్తారు కదా! అసలు "నెల గంట పెట్టుట" లేదా "నెల పట్టుట" అంటే ఏమిటి? ఆమాట ఎలా వచ్చింది?

Answer: రవి ధనూరాశి ప్రవేశము నుండి మకరరాశి ప్రవేశము వరకు గల నెల రోజులు ధనుర్మాసవ్రతం ప్రారంభించుట. దీనినే నెల పట్టుట అని ప్రాంతీయంగా అంటారు. వైష్ణవ ఆలయాలలో వేకువజామున ఘంటారావము చేసి తీర్థపుబిందె తెచ్చి ఆరాధన చేయు ఆచారము కలదు. మంగళ వాద్యములు సమకూర్చుకొనలేని ఆలయాలలో ఘంటారావముతోనే ఈ తీర్థాహరణముచేయుదురు. కాన ప్రాంతీయముగా దీనినే నెలగంట కొట్టుట లేక పెట్టుట అను పేరుతో పిలుచుదురు.

- Prof. Agnihotram Srinivasacharyulu, Dean (Academic Affairs), SVVU, Tirupati


Q181. Sir, namasthe. This is praveen kumar from hyd. My doubt is what is agamam. Is there any difference between smartha agamam and shiva agamam. A brahmin poojari is eligible to do shiva pooja or not. Sir plz clarify my doubts. If there is possibility plz send me the mail.

Answer: ఆగమములు మూడు విధములు. శైవ, వైఖానస,పాంచరాత్ర,ఆగమములు ప్రాచురములోనున్నవి – శాక్తేయవిధానము తంత్రసారములు కూడా కలవు. పై ఆగమోక్తదేవాలయములందు ఆగమములద్వారా ప్రతిష్ఠింపబడిన బింబములకు ఆయా ఆగమోక్త విధానముగా నిత్య పూజ,విశేష ఉత్సవాదులను నిర్వహించవలెను. కనుక ఆయా ఆగమసంబంధము కల అర్చకులే ఆయా అర్చనాదులు నిర్వహించగలరు

ఇక వైదికపద్దతిద్వారా బోధాయన,పరాశరాది మహార్షులద్వారా సూత్రములయందు స్మృతిగ్రన్థములందు – పేర్కోనబడిన విధానము గా ప్రతిష్ఠించిన బింబములందు –వైదిక పద్దతిద్వారా విధి విధానములు తెలుసుకొని అర్చనాదులు నిర్వహించవచ్చును. పైవిషయములు దేవాలయ సంబంధములు, గృహములో అర్చనకొరకు ఎవరిసాంప్రదాయముననుసరించి వారు సాలగ్రామ, ప్రతిమ,చిత్ర,పుస్తకాదులయందు ఆ యాదేవతలను పూజించవచ్చును.

- Sri G.V. Subrahmanya Sarma, Dean (Pourohitya), SVVU, Tirupati


Q182. శ్రీ గురుభ్యో నమః! దంపతులు తమ పిల్లలతో కలిసి నిద్రపోయేటప్పుడు ఆధునిక కాలములో శయన మందిరములో (Bed Room) ఒక పెద్ద మంచానికి బదులుగా అనువుగా ఉండడం కోసం రెండు చిన్న పరిమాణపు మంచాలు జోడించి, దగ్గరగా ఉంచి ఒకే మంచముగా భావించి వాడుతున్నారు. ఇలా రెండు మంచాలు దంపతులకు పనికిరాదని ఒకే తల్పం ఉండాలని శాస్త్ర విహితమైన నియమము ఏమైనా ఉంటే దయతో తెలుపగలరు. పైన చెప్పిన పద్ధతులలో ఏది శాంతియుత దాంపత్య జీవనమునకు శ్రేయస్కరము?

- ధన్యోస్మి, కూర్మనాథ శర్మ, బెంగళూరు

Answer:

యావత్సన్నిపాతంచైవ సహశయ్యా|

తతో నానా|(ఆపస్తంబ ధర్మసూత్రము 0-2-1-21,22)

దాంపత్యకాలమందు మాత్రమే దంపతులు ఏకశయ్యాగతులు (ఒకే మంచంపైశయనించవలెను) తరువాత విడివిడిగా పడుకొనవలెను. అనునియమను స్మృతులు తెలియజేయుచున్నవి. మంచముయొక్క లక్షణములకు ప్రస్తుతకాలములోని మంచముకు అన్వయిచలేము. పూర్వకాలమున పట్టేమంచము అని వేరుగామవుండేది. కాలమానానుసారం సౌకర్యాన్ని అవకాశాన్నిబట్టి వాడుకునేవానికి శాస్త్రప్రమాణమును నిరూపించుట అవివేకమగుచున్నది.

- Sri G.V. Subrahmanya Sarma, Dean (Pourohitya), SVVU, Tirupati


Q183. 1 భీమరధ శాన్తి గురుంచి వివరముగా తెలియ చేయగలరు. ప్రక్రియ, కార్యక్రమమును వివరముగా చెప్పిన నావందనములు ..

2. ఒకెరొజులొ అంతయు చేయగలమా

3. చివరగా 69yrs పూర్తి అయిన వెంటనేన or 70yrs పూర్తి గా complete అయ్యే లోపు చేసుకొనవచ్చ

-Vishnubhotla Radhakrishna Murtyy, Plt 694, VV Nagar, kukatpally, Hyderabad - 72

Answer: భీమరథ శాన్తిని 69 నుండి 70 సంవిత్సరం ప్రారంభం నుండి 6 మాసములలోపు చేసుకొనవచ్చును, భీమరథ శాన్తి ఒకరోజులో చేయుకార్యక్రమమే. షష్ఠిపూర్తికూడా ఒకేరోజు చేయవచ్చు. మరిన్నివివములకు శాంతికమలాకము అను గ్రంథమును చూడగలరు.

- Sri G.V. Subrahmanya Sarma, Dean (Pourohitya), SVVU, Tirupati


Q184. అయ్యా నమస్కారములు, సిద్ధులు సముద్రం దాటచ్చా! అలా దాటితే ఏమి చెయ్యాలి.వేదము లో ఎక్కడ దీన్ని గురించి విసిదీకరిమ్పబడింది వివరించగలరు. అలాగే ఇప్పుడు ఉపనయనం అయి ఉద్యోగా రీత్యా సముద్రం దాటి,అక్కడ కొన్నాళ్ళు నివాసము వుండి తిరిగి స్వదేశం వచ్చినప్పుడు ఏదైనా దైవకార్యం లో పాల్గోవాలంటే ఏదైన ప్రాయశ్చిత్తము చేసి చేసుకోవాలా దయ చేసి చెప్ప గలరు.

- REGARDS, BH.VENKATA RAMANA

Answer: 1.సిద్ధులు, జ్ఞానులు,యోగులు మొదలగువారినియమములు వారివిధానాన్ననుసురించి వేరువేరుగానుండును. సామాన్యమానవధర్మములు వారికి వర్తించవు. వారు కష్ట,సుఖములు మొదలైనద్వంద్వములకు అతీతులుగా సుందురుకనుక – 2.సముద్రయానవిశయంలో – పునరుపనయనం ప్రాయశ్చిత్తంగా చెప్పబడినది. మరల మరల వెళ్ళేవారికి కాదు ఈ ప్రాయశ్చిత్తమనినది కర్మానుష్ఠానపరులకు కర్మలోపంవలన పునః కర్మసిద్ధకొరకు ఉద్ధేశింపబడినది. కర్మాచరణలేనివారికి ప్రాయశ్చిత్తంతో అవసరము ఏమి? తాత్కాలిక ప్రాయశ్చిత్తమై, సముద్ర,నదీస్నానము,కృచ్ఛ్రములు, పంచగవ్య ప్రాశనము,పాహిత్రయోదశ హోమం ఆచరించవచ్చునని ఒక అభిప్రాయం దీనియందు అనేక మతభేదములు కలవు

- Sri G.V. Subrahmanya Sarma, Dean (Pourohitya), SVVU, Tirupati


Q185. Why did dharmaraju play 'JUDAM' though he knew that it was mentioned in the list of 7 evil habits?Is it really adharma to practice it?/p>

Answer: Gambling is one of the seven evils according to Niti Sastra. All except the kings should consider it as an evil only. As far as the King or a Kshatriya Ruler is considered as he should not step back in the war field he should not say no if he is invited for playing with Dice. It is Raja Dharma. Hence Dharma Raja gambled though he knows that it is an evil.

After the victory of Dharmaraja in the Kurukshetra War he hesitates to see the fallen Bhishma listing out all his mistakes which make him feel shy to see his Grand Father. One among his mistakes as enlisted by Dharmaraja was Gambling. Then Bhishma consoles him saying that a Kshatriya should not say no if he is invited to play with dice. Hence he concludes that it was not a mistake on the part of Dharmaraja to play with dice in that situation.

Svasti.

- Dr. Rani Sadasiva Murthy, Associate Professor, R.S. Vidyapeetha, Tirupati


Q186. Guruvu gaariki pranaamamulu! Naaku oka dharma sandheyham Vishnu sahasra naamam, lalitha sahasra naamam .. Raatri bhojanam ina taruvaatha( nidraku mundu) paaraayana cheyya vacchha? Dayatho naa ee sandheyha nivrutti teercha gala rani

itlu, mee videyyudu, suresh kumar

Answer: పూజాంగంగా చదివేటప్పుడు విష్ణు, లలితాది సహస్రనామావళిని ప్రాత:కాలం పూజాసమయంలో, సాయంకాల పూజాసమయంలోనూ చదవాలి. ఇతరసమయాలలో శుచిగా, భక్తిగా చదువుకుంటే తప్పులేదు. చదివితే ఏమౌతుంది అనే పరీక్షకోసమో, అవహేళన కోసమో ఎప్పుడూ చదువకూడదు.

భయగ్రస్తులు, రోగగ్రస్తులు, కష్టాలలో ఉన్నవారు రోజుకు ఎన్నిసార్లయినా చదువవచ్చు. అలా చదవటం వల్ల మంచి జరుగుతుంది కూడా. అయితే ఎప్పుడు చదివినా శుచిగా చదువుకోవాలి. ముఖ్యంగా లలితా సహస్రనామస్తోత్రం చదవాలంటే ముందుగా - బాలామంత్రం కాని, పంచదశి కాని అమ్మవారి మరేఇతరమహామంత్రములలో ఒక మంత్రాన్ని గురువుద్వారా ఉపదేశరూపంలొ గ్రహించి ఉండాలి.

Svasti.

- Dr. Rani Sadasiva Murthy, Associate Professor, R.S. Vidyapeetha, Tirupati


Q187. Demullu andaru vokkte ani antarukada! mari vokkapanikosamu vokkakka demudini poojimchamani antarenduku? udaharanaku :- Aarogyam kosamu Aaditya devuni poojinchuta.

Answer: మనుషులంతా ఒక్కటే అన్నది నిజమా? అసత్యమా? స్థూలదృష్టిలో మనుషులు వేరు. వేరు. ఒక్కొక్క పనికి ఒక్కొక్క మనిషి. అందరూ అన్ని పనులూ చేయలేరు. కాని మానవతా దృష్ట్యా సూక్ష్మంగా చూస్తే మానవజాతి అంతా ఒక్కటే కదా. అలాగే దేవతలు కూడా. మానవుల అభిరుచులను, ఇష్టాలను బట్టి పరబ్రహ్మస్వరూపమైన పరమాత్మ - విష్ణువుగా, శివునిగా, గణపతిగా, సరస్వతిగా, లక్ష్మిగా, పార్వతిగా, ఇలా అనేకరూపాలలో జగత్తును కాపాడుతున్నాడు.

Svasti.

- Dr. Rani Sadasiva Murthy, Associate Professor, R.S. Vidyapeetha, Tirupati


Q188. Dear Swamin, Can you please confirm if Vyasa has told in either Mahabharata or its appendix the HariVasma the following Shloka (Need exact reference for the Shloka):

नास्ति नारायण समं न भूतं न भविष्यति

एतेन सत्य वाक्येन सर्वार्थान साधयाम्यहम्

wherein he establishes Narayana as unparalleled.

Dasosmi,

Venugopala Ramanuja Dasan (Vivek)

Answer: This is in the Anukramanika Parva (The first Chapter of Adi parva). But there is a slight variation in the text from which was given in the question. Here are the28th and 29th Slokas from the Anukramanika Parva (I Adhyaya of Adi Parva). In your question the latter half 28th sloka and the first half of 29th sloka are given as sloka. But this is the text as per the source.

न तथा फलदं लोके नारायणकथा यथा।

नास्ति नारायणसमो न भूतो न भविष्यति॥ 1-1-28

एतेन सत्यवाक्येन सर्वार्थान्साधयाम्यहम्।

आचख्युः कवयः केचित्सम्प्रत्याचक्षते परे॥ 1-1-29

Svasti.

- Dr. Rani Sadasiva Murthy, Associate Professor, R.S. Vidyapeetha, Tirupati


Q189. Namaskaramulu! ( ei prasna tapuuga anipiste site lo pettdu,answer naku mail cheyagalaru) Gruhastudu bharya tho ekantamu ga gadipina marusati roju alaya archanaadi karya krmamulalo palgona vachha? palgona valasi vasthe prayachittam edaeina unda? telupagalaru. Dhanyavadamulu!

Answer: ధర్మార్థకామములు మోక్షమునకు మానవుని చేర్చగల సాధనములు. ధర్మపత్నితో ధర్మబద్ధమైనయోగము ధర్మబద్ధమైనకాలమునందు కలుగుట ఎటువంటి తప్పుకాదు. కానీ దేవాలయ ప్రతిష్ఠా, విశేష ఉత్సవసమయములలో

స్త్రీశూద్రాభ్యాం అనభిభాష్య దర్భాస్తరణ శాయినః

అనియున్నందున విశేషసందర్భములలో కఠిననియమములలో ఉండాల్సినదిగా శాస్త్రం చబుచున్నది. సాధారణంగా యోగ్యకాలమందు స్త్రీసౌఖ్యము తప్పుకాదుగనుక సాధారణ అర్చనాదులు నిర్వర్తించుటకు ఇబ్బంది లేదు. కానీ విశేషకార్యక్రమములయందు దీక్షానియములు పాటించాలి.

రక్షాబంధనం చేసినపిదప బ్రహ్మచర్యంతోనే ఉండాలి. ఈ దీక్ష భంగమునకు ప్రాయశ్చిత్తముగా చాంద్రాయణవ్రతమని చెప్పబడినది. చాంద్రాయనమనగా చంద్రసిద్ధిననుసరించి అనగా శుద్ధపాడ్యమి మొదలు చంద్రుని వృద్ధిని అనుసరించి ప్రతీరోజు ఒక కబలం ( ఒక ముద్ధ) భగవత్ప్రసాదము, రెండవ రోజు 2 కబలములు ఇలా క్రమవృద్ధి కృష్ణపక్షమున క్రమహీనతను అనుసరించాలి .

Svasti.

- Sri G. Ramakrishna, SVVU, Tirupati


Q190. వేదవిచారసరణి కోఆర్డినేటర్ గారికి నమస్కారం. తిరుమలలో ఏడు కొండలు అంటారు కదా? వాటి పేర్లు ఏమిటి? కొన్నిపురాణాలలో పది కన్నా ఎక్కువ గిరుల పేర్లు కనబడుతున్నాయి? ఈ భేదం ఎందువల్ల? దయచేసి తెలియజేయగలరు? - కౌముది స్వయంపాకుల, విజయవాడ

Answer: ఏడు కొండల స్వామి అని , సప్తాద్రివాసుడని, సప్తగిరివాసుడని శ్రీవేంకటేశ్వరునకు పేరు. ఆ పేర్లు:

౧. శేషాద్రి .. శ్రీమహావిష్ణువుయొక్క ఆజ్ఞానుసారం స్వామివారి ప్రీతికోసం క్రీడాద్రిగా అవతరించిన ఆదిశేషుని పేర శేషాద్రి ఏర్పడింది.

౨. గరుడాద్రి .. గరుత్మంతునిచే తిసుకుని రాబడిన సుమేరు పర్వతశిఖరమిది అని ఐతిహ్యం.

౩. వృషభాద్రి .. వృషబాసురుడనే రాక్షసుని ఈ పర్వతముపైనే శ్రీమహావిష్ణువు సంహరించారు.

౪. అంజనాద్రి .. హనుమంతులవారి తల్లి అయిన అంజనాదేవి తపస్సు చేసిన ప్రాంతమిది.

౫. నారాయణద్రి .. నారాయణుడనే బ్రాహ్మణుడు తపస్సు చేసిన ప్రదేశమిది.

౬. నీలాద్రి ... నీలాదేవి పేరున ప్రసిద్ధమైన పర్వతమిది.

౭. వృషాద్రి ... ధర్మగిరి

ఇవికాక ఈ సప్తగిరులతో కూడిన వేంకటాచలమునకు ...తీర్థాద్రి, శ్రీనివాసాద్రి, చింతామణిగిరి, శ్రీశైలం, వరాహాద్రి, జ్ఞానాద్రి, కనకాచలం, ఆనందాద్రి, సుమేరుశిఖరాచలం,వైకుంఠాద్రి, పుష్కరాద్రి అని కూడా అనేక ప్రశస్తమైన పేర్లు ఉన్నవి.

Svasti.

- Dr. Rani Sadasiva Murthy, Associate Professor, R.S. Vidyapeetha, Tirupati


Q191. శ్రుతి, స్మృతి, పురాణానాం ఆలయం కరుణాలయం - అంటారు కదా శంకరాచార్యుల వారిని. శ్రుతి, స్మృతి వీటి మధ్యలో భేదం ఏమిటి? శ్రుతి, పురాణాలకు మధ్యలో ఉన్న భేదం ఏమిటి? సమాధానం తెలియ చేయగలరు. ధన్యవాదములు, - కౌముది స్వయంపాకుల, విజయవాడ

Answer: శ్రుతి ... అనేది వేదములకు మరొక పేరు. అవి ఇతర గ్రంథముల వలె పుస్తకమునందు చూసి స్వయంగా చదువుకొని నేర్చుకో దగినవికావు. వేదములు గురుశిష్యపరంపరలో గురువులు చెబుతుంటే శిష్యులు విని నేర్చుకోవలసినవి. అందుచేత వీటికి శ్రుతులు అనిపేరు. శృతులలో ఉన్నవాటినే అనుసరించి మానవసమాజం ఎలా ప్రవర్తించాలో మార్గనిర్దేశం చేసేవి స్మృతులు. వాటికే ధర్మశాస్త్రములని పేరు. ఇక పురాణములు వేదవ్యాసవిరచితములు. అవి సంఖ్యకు ౧౮. మత్స్య, మార్కండేయ, భాగవత, భవిష్య, బ్రహ్మ, బ్రహ్మవైవర్త, బ్రహ్మాండ, వరాహ, వామన, విష్ణు, వాయు, అగ్ని, నారద, పద్మ, లింగ, కూర్మ, స్కందపురాణములని వీటికి పేర్లు. ఇవి వేదములలోనూ, ధర్మశాస్త్రములలోనూ ఉన్న ధర్మములకు, ధర్మసూక్ష్మములకు ఉదాహరణభూతములగు ఎన్నో చరిత్రలను మనకందించును. అంతేకాక పురాణములు వేద, ధర్మశాస్త్రములవలె నానా విజ్ఞానశాస్త్రవిశేషములతో కూడినవి.

Svasti.

- Dr. Rani Sadasiva Murthy, Associate Professor, R.S. Vidyapeetha, Tirupati


Q192. Subject: Regarding Dharma questions

1). what is importence of Thrisulam and Damarakam wearing by God Eshwar.

2). why Thrisulam installed before the godess parvathy Temple.

3). when peacock is vahanam to subramanyaswamy , why sri krishna is wearing peacock feather on is head.Who are the saptha rhushis Plz e-mail the name.

4) What is the impotence of Thirunamam.shi.

5) we have no Telugu script so you can send answer in Telugu or English by email

Srinivasulu Chettry R

Answer: 1). what is importence of Thrisulam and Damarakam wearing by God Eshwar? - Trishulam is also called Trident in English. A Trident has three sharp edges representing the three Gunas Sattva, Rajas and Tamas in Human Beings. This Trishula of Hara or Eashwar removes the adverse effects of these Trigunas. Similarly Damaruka in the hand of Shiva represents the source of all the languages the VARNAS. (Letters).

2) Why Thrisulam installed before the godess parvathy Temple? - Since Parvathi is the spouse of Shiva the Trident of her husband sometimes is held by her also. So as a symbol to say that she is the spouse of Shiva the Trishula of Shiva is sometimes installed before the goddess Parvathi's Temple.

3). when peacock is vahanam to subramanyaswamy , why sri krishna is wearing peacock feather on is head? - These two instances have no inter-connection.

4) Who are the saptha rhushis? Bhrugu, Angiras, Atri, Vishvamitra, Agastya, Vasishtha and Jamadagni.

5) What is the importance of Thirunamam? - This question was already answered. Please verify in the previous answers of VedavichAra sarani.

Svasti.

- Dr. Rani Sadasiva Murthy, Associate Professor, R.S. Vidyapeetha, Tirupati


Q193. Namaskaram Guruvugaru, Sir in last year durting Karthika Masam I along with my family went for Pooja there one Couple has given us Shiva Lingam to our family which is one inch in height, made of metal heavier than its size. My question is daily Can we keep the lingam in home as such we do not have any tradition in our family like this, Iam pouring some water on the linga daily but sometimes I am missing the same. - regards, ravi

Answer: Bhakti should be regular to the maximum possible extent. There is nothing wrong to keep Shivalingam at home as its size is very small.

Svasti.

- Dr. Rani Sadasiva Murthy, Associate Professor, R.S. Vidyapeetha, Tirupati


Q194.వాస్తు దోషము దృష్ట్యా లేదా మరే ఇతర కారణముల వలనో తప్పనిసరి అయి ఒక చెట్టును తొలగించవవలసిన పరిస్తితి వచ్చినపుడు విధి విహితములు ఏమిటి. ఏ ఏ వృక్షాలకు ఎలాంటి విధి విధానాలు పాటించాలి తెలుపగలరు. - భవదీయుడు, రవి ప్రకాష్

Answer: 1. మఱ్రి. రావి, జువ్వి, మేడి, ( వీటిని గంధర్వాప్సరసల గృహములుగా వేదమందు చెప్పబడినవి ) వీటిని ఎప్పటికీ తొలగించరాదు.

2. వేప, కానుగ, మామిడి, పనస మొదలైన చెట్లను తొలగించరాదు.

3. కొబ్బరి మొదలైన ఫలవృక్షములను, ఆ ఫలములు లేకుండనప్పుడు తొలగించవలెను.

వాస్తు శాంతి ప్రకరణమందు వృక్ష, ఓషధ్యాది ఛేదనము ( అనగా, పెద్దవృక్షములుగాని, చిన్నమొక్కలుగాని, పూలమొక్కలుగాని ) వేటినైనా తొలగించి అచట గృహనిర్మాణము చేసి నివసించుట దోషముగా చెప్పబడినది. నిర్మాణ సమయమందు తప్పని సరిగా చేయవలసిన ఈ పని వల్ల కలిగిన దోష నివారణ కొరకు వాస్తు శాంతి చెప్పబడియున్నది.

అనగా పెద్దవృక్షములను ఆశ్రయించి అనేక క్రిమి, కీటక, పక్ష్యాదులు నివాసముండుట, ఆహారము పొందుట జరుగునుకాన వీటిని తొలగించి మనకు తెలియకయే అనేక జీవులను వాసస్ధానము, ఆహారమును లేకుండా చేయుట, పైగా ఆస్థానంలో మనముండుట అనునవి ఆ జీవుల ఆక్రందనల వలన మనకు అపకారము కలుగునను భావముతో చెప్పబడినదు.

కనుక సాధ్యమైనంత వరకు ఇతరజీవులకు అపకారము చేయకుండుట మేలు. అవసరమైనయెడల ఆ చెట్టు వద్ద కొంతకాలముముందునుంచే ఈ చెట్టును నేను తీసివేయదలచితిని. కనుక వృక్షాశ్రయ జీవులు వేరొక ప్రదేశము చూచుకొనవలసిదిగా చెప్పుచూ తర్వాత తీసి పైన నిర్మాణానంతరం వాస్తుశాంతి చేవలెను.

Sri G.V. Subrahmanya Sarma, Dean, SVVU


Q195. వల్లూరి.చంద్రహాస శర్మ, గుంటూరు. పెద్దలకు నమస్కారములు, స్వామి, శివాలయములో ఈశ్వరప్రదక్షిణములు ఆడవారికి మగవారికి విధానములో ఒకేరకంగా ఉంటాయా లేక స్త్రీలకు వేరుగా ప్రదక్షిణానియమాలు ఉంటాయా. వీటికి సంబంధించిన అధీకృత పుస్తకములు ఏమైనా ఉన్నాయా దయచేసి వివరింపగలరు. మరియొకటి ఏమనగా బ్రహ్మసూత్ర శివాలయాలలో ప్రత్యేకంగా ఎక్కడ ఉన్నాయు. ఆయా శివాలయాలలో అనుసరించవలసిన నియమములు ఏమిటి. మా యందు దయతో సందాహములు నివృత్తి చేయగలరు.

Answer: వల్లూరి.చంద్రహాస శర్మ, గుంటూరు. పెద్దలకు నమస్కారములు, స్వామి, శివాలయములో ఈశ్వరప్రదక్షిణములు ఆడవారికి మగవారికి విధానములో ఒకేరకంగా ఉంటాయా లేక స్త్రీలకు వేరుగా ప్రదక్షిణానియమాలు ఉంటాయా. వీటికి సంబంధించిన అధీకృత పుస్తకములు ఏమైనా ఉన్నాయా దయచేసి వివరింపగలరు. మరియొకటి ఏమనగా బ్రహ్మసూత్ర శివాలయాలలో ప్రత్యేకంగా ఎక్కడ ఉన్నాయు. ఆయా శివాలయాలలో అనుసరించవలసిన నియమములు ఏమిటి. మా యందు దయతో సందాహములు నివృత్తి చేయగలరు.

2. బ్రహ్మసూత్ర శివాలయమను పేరుతో విభాగము కనిపించుట లేదు. 1. స్వయం వ్యక్తములు, 2. ఆర్ష, 3. మానుష ప్రతిష్ఠాది భేదములు శాస్త్రమందు కలవు. కనుక బ్రహ్మసూత్ర శివాలయ వివరములు తెలుపలేక పోవుచున్నాము.

Sri G.V. Subrahmany Sarma, Dean, SVVU


Q196. లలితా మాధురి, విజయవాడ, నమస్కారములు! జపమాలలు ఆడవారికి మగవారికి వేరుగా ఉంటాయా. స్త్రీలు ముఖ్యంగా ముత్తైదువులు ఏ జపమాలలు వాడవచ్చును, ఏవి వాడకూడదు లాంటివి ఏమైనా ఉన్నాయా దయచేసి వివరించగలరు.

Answer: ధర్మశాస్త్రమందు స్త్రీలకు, పురుషులకు వేరువేరుగా జపమాలలు చెప్పబడలేదు. స్రంగుళి పర్వలు, రుద్రాక్షలు, తులసి, పగడములు, ముత్యములు, స్ఫటికములు పుత్రజీవి, దర్భ ( కుశ ) గ్రంథులు, శంఖములు, పద్మాక్షలు ( తామర గింజలు ) మొదలైనవి చెప్పబడియున్నవి. వాని ఫలములు చెప్పబడియున్నవి. స్త్రీలకు ( సువాసినులకు) పగడములు, ముత్యములు, స్ఫటికములు, పద్మాక్షలు, జపమాలలు యుక్తమైనవిగా నా అభిప్రాయము. ఇవి సౌభాగ్యము, సంపదలను ఇచ్చునుకనుకను – 108 సంఖ్యామాలలు ఉత్తమమైనవిగా చెప్పబడినవి.

Sri G.V. Subrahmanya Sarma, Dean, SVVU


1       2